• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • PREMIUM LED TELEVISIONS PRICES INCLUDING SONY BRAVIO AND LG METZ BRANDS AK GH

LED TV: ఈ టీవీల ధరలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. ఎంతో తెలుసా..

LED TV: ఈ టీవీల ధరలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. ఎంతో తెలుసా..

LED TV: ఈ టీవీల ధరలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. ఎంతో తెలుసా..

Premium LED TV: అడ్వాన్స్‌డ్ ఫీచర్స్‌తో వర్చువల్, రియల్‌ను విలీనం చేసి అపూర్వమైన అనుభవాన్ని అందించడం ఈ టీవీల ప్రత్యేకత.

  • Share this:
టెలివిజన్ మార్కెట్‌లో గత కొంత కాలంగా ఎల్ఈడీ టీవీల హవా కొనసాగుతుంది. అడ్వాన్స్‌డ్ ఫీచర్స్‌తో వర్చువల్, రియల్‌ను విలీనం చేసి అపూర్వమైన అనుభవాన్ని అందించడం ఈ టీవీల ప్రత్యేకత. ఈ టీవీల్లో నిజమైన సినిమా అనుభవాన్ని పొందడమే కాకుండా ఇవి పనిచేయడానికి చాలా తక్కువ ఎనర్జీ అవసరం అవుతుంది. అయితే క్వాలిటీ మరియు ప్రాక్టికాలిటీ మాత్రం కంపెనీ, ధరను బట్టి మారుతుంది. మార్కెట్’లో లభించే కొన్ని ఉత్తమమైన ఓఎల్ఈడీ టీవీలను పరిశీలిద్దాం.

సోనీ బ్రావియా A9F OLED
సోనీ కంపెనీకి చెందిన బ్రావియా A9F OLED టీవీలో సరికొత్త ‘X1 అల్టిమేట్ ప్రాసెసర్’ ఉంటుంది. దీనిలోని OLED ప్యానెల్ పిక్సెల్ కాంట్రాస్ట్ బూస్టర్‌ను కలిగి ఉంటుంది. ఇది హైక్వాలిటీ పిక్చర్ అనుభవాన్ని ఇస్తుంది. అంతేకాక, ఇది ఎకౌస్టిక్ సర్ఫేస్ ఆడియో ప్లస్‌తో వస్తుంది. గొప్ప పిక్చర్ అనుభూతి కోసం దీనిలో 3.2 ఛానల్ మల్టీ డైమెన్షనల్ సౌండ్ సిస్టమ్ అందుబాటులో ఉంది. 55 అంగుళాల సోనీ బ్రావియా మోడల్ ధర రూ. 3.99 లక్షలు కాగా, 65 అంగుళాల మోడల్ రూ. 55.59 లక్షలకు లభిస్తుంది.

ఎల్‌జీ AI THINQ OLED77W8PTA
ఎల్ కంపెనీ నుండి వచ్చిన AI ThinQ OLED టీవీ ఈ సంవత్సరం ప్రారంభంలో అనేక డిజైన్ అవార్డులను గెలుచుకుంది. అల్ట్రాస్లిమ్ రూపంలో వచ్చే ఈ ఓఎల్ఈడీ టీవీ ఉత్తమ పిక్చర్ క్వాలిటీతో రెట్టింపు అనుభవాన్ని ఇస్తుంది. కాగా 77 అంగుళాల ఎల్జీ ఓఎల్ఈడీ మోడల్ టీవీ రూ .32.9 లక్షలకు లభిస్తుంది.

సోనీ బ్రావియా A1 సీరీస్
సోనీ కంపెనీకి చెందిన మరో ఓఎల్ఈడీ టీవీ బ్రావియా A1. ఇది 4K పిక్చర్ క్లారిటీతో వస్తుంది. అంతేకాక ఇది బెస్ట్ పిక్చర్ బ్రైట్నెస్తో పాటు హై డైనమిక్ రేంజ్ (HDR) ఫార్మాట్తో వస్తుంది. సోనీ యొక్క యాజమాన్య ట్రైల్యుమినస్ డిస్ప్లేని కలిగి ఉంది. ఈ టీవీ రిచ్, వైబ్రెంట్ కలర్స్ను ఉత్పత్తి చేస్తుంది. 55 అంగుళాల సోనీ బ్రావియా A1 సీరీస్ స్క్రీన్ ధర రూ. 3.05 లక్షలు కాగా, 65 అంగుళాల మోడల్ రూ .4.05 లక్షలకు లభిస్తుంది.



ఎల్‌జీ OLED 55B7T
ఎల్‌జీ కంపెనీకి చెందిన మరో ఓఎల్ఈడీ టీవీ LG OLED 55B7T. దీనిలోని డాల్బీ విజన్‌తో ప్రీమియం హెచ్‌డీఆర్ కంటెంట్‌ను చూడవచ్చు. దీనిలో యాక్టివ్ హెచ్‌డీఆర్ టెక్నాలజీ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇది గొప్ప పిక్చర్ అనుభవం కోసం హెచ్‌డీఆర్ చిత్రాన్ని ఆప్టిమైజ్ చేస్తుంది. దీనిలో ఉన్న డాల్బీ అట్మోస్, ఇన్ఫనెట్ కాంట్రాస్ట్ మరియు వెబ్ఓఎస్ వంటి ఫీచర్లు గొప్ప యూజర్ ఫ్రెండ్లీ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తాయి. 55 అంగుళాల ఓఎల్ఈడి టీవీ ధర 2.25 లక్షలకు అందుబాటులో ఉంది.

మెట్జ్55 INCH 4K UHD OLED TV
ఈ టీవీని షార్ప్ లుక్, క్లీన్ లైన్స్‌తో తయారు చేశారు. దీనిలోని 3.6 మిల్లీ మీటర్ల ఇండిజినస్ డిజైన్ వల్ల టీవీ యొక్క ఫ్రేమ్ సీమ్‌లెస్‌గా కన్పిస్తుంది. ఇది వైడర్, ఇంటర్ఫేస్ ఫ్రీ వీవింగ్ అనుభవాన్ని ఇస్తుంది. దీనిలో ఉండే లౌడ్ స్పీకర్లద్వారా వచ్చే సౌండ్ సాధారణ టీవీ కంటే 3 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఈ సౌండ్ 50 హెడ్జ్ల కంటే తక్కువ ఫ్రీక్వెన్సీని కలిగి ఉంటుంది. కాగా55 అంగుళాల METZ 55 INCH 4K UHD OLED మోడల్ టీవీ రూ.99,999కు లభిస్తుంది.
Published by:Kishore Akkaladevi
First published:

అగ్ర కథనాలు