PREDATOR SPYWARE ALERT FOR SMARTPHONE USERS HACKERS TARGETING USERS WITH PREDATOR SPYWARE GH VB
Chrome Browser: క్రోమ్ బ్రౌజర్ వాడుతున్నారా..? అయితే జాగ్రత్త.. వాటితో టార్గెట్ చేస్తున్న హ్యాకర్లు..
ప్రతీకాత్మక చిత్రం
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ (Android Smartphone), లేదా క్రోమ్ బ్రౌజర్ (Chrome Browser) వాడుతున్నారా... అయితే మీరు తప్పకుండా అప్రమత్తం కావాలి. ఎందుకంటే కొందరు హ్యాకర్లు ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లు, గూగుల్ క్రోమ్ వాడే యూజర్ల డివైజ్‌లను టార్గెట్ చేస్తున్నారు.
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ (Android Smartphone), లేదా క్రోమ్ బ్రౌజర్ (Chrome Browser) వాడుతున్నారా.. అయితే మీరు తప్పకుండా అప్రమత్తం కావాలి. ఎందుకంటే కొందరు హ్యాకర్లు ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లు, గూగుల్ క్రోమ్ వాడే యూజర్ల డివైజ్‌లను టార్గెట్ చేస్తున్నారు. వీరు యూజర్ల డివైజ్‌లను ఇన్ఫెక్ట్ చేయడానికి ప్రిడేటర్ (Predator) అనే స్పైవేర్ (Spyware)ను ఇన్స్టాల్ చేస్తున్నారు. ఫైవ్ జీరో-డే (5 Zero Day) అనే సాంకేతిక లోపాలను సద్వినియోగం చేసుకొని వీరు యూజర్లపై దాడులకు తెగబడుతున్నారని గూగుల్ సేఫ్టీ గ్రూప్ (Google’s Security Group) తాజాగా గుర్తించింది. గూగుల్ తన థ్రెట్ అనాలిసిస్ గ్రూప్ (TAG) ద్వారా టెక్నికల్ లోపాలవల్ల వివిధ రకాల హ్యాకర్లు యూజర్లపై దాడులు చేసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రిడేటర్ స్పైవేర్‌ను వాణిజ్య నిఘా సంస్థ (Commercial Surveillance Company) సైట్రాక్స్ (Cytrox) అభివృద్ధి చేసిందని గూగుల్ వెల్లడించింది. మరి ప్రిడేటర్ స్పైవేర్ బారిన పడకుండా ఎలా జాగ్రత్తపడాలో తెలుసుకుందాం.
గతేడాది ఆగస్టు-అక్టోబరు మధ్య కాలంలో ప్రిడేటర్ స్పైవేర్ దాడులు జరిగాయని థ్రెట్ అనాలిసిస్ గ్రూప్ (TAG) పేర్కొంది. గూగుల్ ప్రకారం, సైబర్ అటాక్స్ చేసేవారు లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్‌లు ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్లలో స్పైవేర్‌ను ఇన్స్టాల్ చేస్తున్నారు. క్రోమ్ ఓఎస్, ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌లను లక్ష్యంగా చేసుకోవడానికి జీరో-డే (కంప్యూటర్-సాఫ్ట్‌వేర్‌లో సాంకేతిక లోపం)లను హ్యాకర్లు యూజ్ చేస్తున్నారని గూగుల్ వెల్లడించింది. ఆయా ప్రభుత్వాలకు సపోర్టు అందించే హ్యాకర్లకు ప్రిడేటర్ స్పైవేర్‌ను సైట్రాక్స్ సంస్థ విక్రయించినట్లు తెలుస్తోంది. ఈ హ్యాకర్లలో ఈజిప్ట్, మడగాస్కర్, సెర్బియా, స్పెయిన్, ఇండోనేషియాకు చెందినవారు ఉన్నారని ట్యాగ్ (Tag) తెలిపింది. ఆండ్రాయిడ్, క్రోమ్ రెండింటికీ హాని కలిగించే దాదాపు 6 భద్రతా లోపాలను ప్రభుత్వ-అనుబంధ హ్యాకర్లకు సైట్రాక్స్ సంస్థ విక్రయించినట్లు సమాచారం. గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో నాలుగు జీరో-డే సెక్యూరిటీ ఇష్యూలు, ఆండ్రాయిడ్‌లో ఒక సెక్యూరిటీ లోపాన్ని ప్రభుత్వ-అనుబంధ హ్యాకర్లకు ఆ సంస్థ విక్రయించిందని వస్తున్న వార్తలు ఇప్పుడు అందరినీ నివ్వెరపరుస్తున్నాయి.
ఈ స్పైవేర్‌తో ఆయా దేశాల్లోని ప్రభుత్వం నిర్దిష్ట వ్యక్తులపై నిఘాను పెట్టేందుకు ఉపయోగిస్తుందని గూగుల్ ట్యాగ్ వివరించింది. ఈ ప్రిడేటర్ స్పైవేర్‌లో ఇటీవలి కాలంలో బాగా ట్రెండ్ అయిన పెగాసస్ స్పైవేర్ లక్షణాలు ఉన్నాయి. లక్ష్యంగా చేసుకున్న వ్యక్తులపై గూఢచర్యం చేయడానికి కొన్ని ప్రభుత్వాలు పెగాసస్‌ను కొనుగోలు చేశాయని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. స్పైవేర్‌తో డివైజ్‌లను ఇన్ఫెక్ట్ చేయడానికి హ్యాకర్లు ఒక పద్ధతిని ఫాలో అవుతారని గూగుల్ వివరించింది. సైబర్ హ్యాకర్లు ఈ-మెయిల్ ద్వారా వన్-టైమ్ యాక్సెస్ యూఆర్ఎల్ (URL)లను పంపుతారు. యూజర్లు ఆ లింక్‌ను ఓపెన్ చేసినప్పుడు హ్యాకర్ డొమైన్ ఓపెన్ అవుతుంది. ఈ డొమైన్లో ఉన్న కొన్ని సెకన్లలోనే స్పైవేర్ డివైజ్‌లో ఇన్స్టాల్ అయిపోతుంది. ఆ తర్వాత అసలైన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దీనివల్ల యూజర్లకు పెద్దగా అనుమానం కూడా రాదు.
అయితే ఈ అటాక్స్ బారిన పడకుండా ఉండేందుకు మీరు ఏ లింకులపై క్లిక్ చేయకపోవడం మంచిది. వాస్తవానికి ఈ స్పైవేర్ లక్షల మంది యూజర్లపై అటాక్ చేయడానికి ఉద్దేశించినది కాదని ట్యాగ్ బృందం తెలిపింది. ఈ స్పైవేర్‌తో కేవలం పదుల సంఖ్యలో యూజర్లపై మాత్రమే సైబర్ అటాక్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు గూగుల్ తెలిపింది. దీనర్థం నిర్దిష్ట వ్యక్తులు లేదా సంస్థలపై దాడి చేసేందుకే ఈ స్పైవేర్‌ను హ్యాకర్లు యూజ్ చేస్తారని తెలుస్తోంది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.