సూపర్ ఫోన్ HONOR 9X కోసం శక్తివంతమైన ప్రాసెసర్ Kirin 710

Kirin 710 చిప్‌సెట్ మీకు ఫర్‌ఫెక్ట్‌గా చేస్తుంది. ఈ ఫీచర్లు మీకు బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ల్లోనూ హై ఎండ్ స్మార్ట్‌ఫోన్ వంటి అనుభవాన్ని మీకు ఇస్తుంది.

news18-telugu
Updated: January 21, 2020, 4:51 PM IST
సూపర్ ఫోన్ HONOR 9X కోసం శక్తివంతమైన ప్రాసెసర్ Kirin 710
సూపర్ ఫోన్ HONOR 9X కోసం శక్తివంతమైన ప్రాసెసర్ Kirin 710
  • Share this:
స్మార్ట్‌ఫోన్‌లు ఇప్పుడు మరింత స్మార్ట్‌గా తయారవుతున్నాయి. నేడు ఫోన్ పనితీరు కేవలం దాని కెమెరా లేదా బ్యాటరీ లేదా దాని స్టోరేజీకి మాత్రమే పరిమితం కాదు. చక్కటి అనుభవం కోసం మంచి ప్రాసెసర్ కూడా అవసరం. ప్రాసెసర్‌ల గురించి మాట్లాడితే Kirin ప్రాసెసర్‌లు వాటి పనితీరుకు పెట్టింది పేరు. ఇది Huawei ఇన్‌హౌస్ తయారీ మరియు ఈ ప్రాసెసర్‌ని దాని సబ్ బ్రాండ్ HONOR ఫోన్‌ల్లో విస్త్రృతంగా ఉపయోగిస్తుంటారు. ఈ ప్రాసెసర్‌ల్లో ఒకటి Kirin 710F, ఇది HONOR తాజా ఫోన్ HONOR 9Xతోపాటు లభిస్తుంది. దీని చిప్‌సెట్ కంపెనీ ద్వారా అందించే గొప్ప మరియు శక్తివంతమైన చిప్‌సెట్‌ల్లో ఒకటి.

ఇటీవల, HONOR తన X సీరిస్‌లో ఈ కొత్త HONOR 9Xని లాంఛ్ చేసింది. Kirin 710F పాటుగా, మీరు 16MP AI పాప్ అప్ సెల్ఫీ కెమెరా 48MP + 8MP + 2MP AI రియర్ కెమెరాని పొందుతారు. దీనితోపాటుగా ఈ ఫోన్‌లో FHD + ఫుల్ వ్యూ డిస్‌ప్లే, 4GB / 6GB RAM, 128GB ROM (512GB వరకు విస్తరించవచ్చు) ప్లస్ 4,000mAh బ్యాటరీ మరియు అనేక మంచి ఫీచర్లు కూడా లభ్యమవుతాయి. ఈ ప్రాసెసర్ HONOR 9Xని మరింత శక్తివంతంగా ఎలా మారుస్తుందో మనం ఇప్పుడు చూద్దాం.

Kirin 710 ఫీచర్లు


Kirin 710 ప్రాసెసర్ 12nm టెక్నాలజీని ఉపయోగిస్తుంది, చిప్‌సెట్ చాలా చిన్నది, కంపెనీ స్మార్ట్‌ఫోన్‌కు మరింత ఫీచర్లు జోడించగలదు. కంపెనీ HONOR 9Xలో దీనినే అమలు చేసింది, దీనిలో కేవలం పాప్ అప్ కెమెరా మాత్రమే కాకుండా, శక్తివంతమైన బ్యాటరీ, 48MP ప్రైమరీ సెన్సార్, 8MP సూపర్‌వైడ్ లెన్స్‌లు మరియు 2MP డెప్త్ సెన్సార్‌తో ట్రిపుల్ కెమెరా మరియు ఇంకా ఎన్నో ఫీచర్లు కలిగి ఉంది.

స్మార్ట్‌ఫోన్‌కు అదనపు పవర్


ఈ ప్రాసెసర్‌లో నాలుగు చిన్న ARM Cortex-A53 కోర్‌లు, నాలుగు పెద్ద ARM Cortex-A73 కోర్‌లు ఉన్నాయి. దీని octa-core CPU స్మార్ట్‌ఫోన్‌కు మరింత పవర్ అందించడం ద్వారా దాని పనితీరును మరింత సమర్థవంతంగా మారుస్తుంది. ఇప్పుడు మీరు ఫోన్‌పై అనేక పనులను ఒకేసారి చేయవచ్చు, ఎలాంటి అంతరాయం ఉండదు. HONOR 9X ట్రిపుల్ కెమెరాతో ఫోటోలు తీసుకోవడం కావొచ్చు, లేదా Netflixపై సినిమాలు చూస్తూ సేదతీరడం కావొచ్చు, యూజర్ ఒక మృదువైన అనుభవాన్ని పొందుతాడు. క్లుప్తంగా చెప్పాలంటే, Kirin 710 చిప్‌సెట్ వల్ల, మీరు Kirin 659 ప్రాసెసర్‌తో పోలిస్తే HONOR 9Xలో సింగిల్ పేరు పనితీరులో 75% మరియు మల్టీ- కోర్ టెస్ట్‌లో 68% పెరుగుదలను పొందుతారు.

గేమింగ్ మరింత వినోదాత్మకం

ఈ చిప్‌సెట్‌లో ARM Mali-G51 MP4 GPU కూడా ఉంది. Kirin 710 ప్రాసెసర్ మీకు AI ఫోటో ఫీచర్లు అందించడమే కాకుండా స్వతంత్ర ISP మరియు DSP ద్వారా గొప్ప గేమింగ్ అనుభవాన్ని అందిస్తుంది. HONOR 9X స్మార్ట్‌ఫోన్‌లో, మీరు 48MP AI ట్రిపుల్ కెమెరాని ఎంజాయ్ చేయడమే కాకుండా PUBG లేదా Fortnite వంటి అధిక గ్రాఫిక్ గేమ్‌లను ఎలాంటి లాగ్ లేకుండా ప్లే చేయడానికి మీకు అవకాశం కల్పిస్తుంది. HONOR 9Xలో GPU Turbo 3.0 టెక్నాలజీ ఉంది, ఇది టచ్‌లో లాటెన్సీని 36% తగ్గిస్తుంది. క్లుప్తంగా చెప్పాలంటే, మీ స్క్రీన్ టచ్ రెస్పాన్స్‌లో మీరు ఎలాంటి లాగ్‌ని అనుభూతి చెందరు.

HONOR 9X, HONOR 9X features, HONOR 9X processor, HONOR 9X price, HONOR 9X Kirin 710 processor, HONOR 9X Review, హానర్ 9ఎక్స్, హానర్ 9ఎక్స్ ఫీచర్స్, హానర్ 9ఎక్స్ ప్రాసెసర్, హానర్ 9ఎక్స్ ధర, హానర్ 9ఎక్స్ కిరిన్ 710 ప్రాసెసర్, హానర్ 9ఎక్స్ రివ్యూ

బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లో హై ఎండ్ చిప్‌సెట్ పవర్


HONOR X సీరిస్‌ అతి తక్కువ ధరకే ఫ్లాగ్‌షిప్ అనుభవాలను అందిస్తుంది. యూజర్‌ల డిమాండ్, అవసరం ఉన్నదని భావించిన దాదాపుగా ప్రతి ఫీచర్ మరియు స్పెసిపికేషన్‌ని కంపెనీ అందించే స్మార్ట్‌ఫోన్ HONOR 9X. ఈ అన్నివిషయాలు పనిచేయడానికి మీకు పవర్ అవసరం అవుతుంది, Kirin 710 చిప్‌సెట్ మీకు ఫర్‌ఫెక్ట్‌గా చేస్తుంది. ఈ ఫీచర్లు మీకు బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ల్లోనూ హై ఎండ్ స్మార్ట్‌ఫోన్ వంటి అనుభవాన్ని మీకు ఇస్తుంది.

AI సామర్థ్యాలు


Kirin 710F వల్ల, మీ HONOR 9Xలో మీరు హ్యాండ్‌హెల్డ్ డిటెక్షన్, లైట్ డిటెక్షన్, అద్భుతమైన క్లారిటీ కొరకు ప్రాసెసింగ్ మరియు వీడియో స్టెబిలైజేషన్ వంటి అనేక AI ఫీచర్లను పొందుతారు. దీని AI స్క్రీన్ రికగ్నైజేషన్ 22 కేటగిరీల్లో 500 పైగా దృశ్యాలను ఆటోమేటిక్‌గా గుర్తిస్తుంది, అంటే ఈ ఫోన్ కెమెరా ఆల్ట్రా క్లియర్ ఇమేజ్‌లను క్యాప్చర్ చేయడానికి సాయపడే అనేక విషయాలను గుర్తించడానికి మరియు మీకు మెరుగైన ఫోటోగ్రఫీ అనుభవాన్ని అందిస్తుంది. మొత్తం మీద, ఈ అన్ని ఫీచర్లు కూడా మీ ఫోటోగ్రఫీని మరింత మెరుగ్గా మారుస్తాయి.

కనెక్టివిటీ


2 SIM కార్డులు రన్ అయ్యే స్మార్ట్‌ఫోన్‌లు ఎన్నో మార్కెట్‌లో ఉన్నాయి, కేవలం కొన్ని ఎంపిక చేయబడ్డ స్మార్ట్‌ఫోన్‌లు మాత్రమే మీకు రెండు SIMస్లాట్‌ల్లో 4G సపోర్ట్‌ని అందిస్తాయి. అందువల్లనే, మీరు SIM 1పై ప్రైమరీ కాలింగ్ మరియు మెసేజింగ్‌ని మరియు SIM 2పై ఇంటర్నెట్ రన్ చేస్తున్నట్లయితే, అప్పుడు మరో సిమ్‌లో మీరు 4G స్పీడ్ పొందలేరు. Kirin 710 మీ సమస్యకు పరిష్కారాన్ని అందిస్తుంది, ఎందుకంటే ఇది డ్యూయల్ -4G VoLTEకు మద్దతు ఇస్తుంది. అందువల్లనే, HONOR 9Xలో రెండు SIM కార్డులు ఉపయోగించేటప్పుడు, మరో SIM నెట్‌వర్క్‌ 3G లేదా 2Gకు తగ్గదు, అందువల్ల మీరు ఇంటర్నెట్‌ని తేలికగా రన్ చేయవచ్చు.

ఈ చిప్‌సెట్ మీకు గరిష్టంగా 600Mbps డౌన్‌లోడ్ స్పీడ్‌ని అందిస్తుంది, తద్వారా మీరు గేమ్స్, యాప్స్, పాటలు మరియు వీడియోలను చాలా తక్కువ సమయంలో వినవచ్చు. దీనిలో, మీరు 150Mbps అప్‌లోడ్ స్పీడ్‌ని పొందుతారు, అంటే, సోషల్ మీడియాపై ఫోటోలు, పొడవైన వీడియోల అప్‌లోడింగ్ లేదా ఇమెయిల్‌పై హెవీ ఫైల్స్‌ని అతి తక్కువ సమయంలో చాలా తేలికగా అప్‌లోడ్ చేయవచ్చు.

Honor 9X ధర


ఈ ఫోన్ రెండు వేరియెంట్‌లు ఉన్నాయి, వీటిని మీరు Flipkartనుంచి కొనుగోలు చేయవచ్చు. 4GB RAM మరియు 128GB అంతర్గత స్టోరేజీ కలిగిన వేరియెంట్ ధర రూ. 13,999 అదేవిధంగా 128GB అంతర్గత స్టోరేజీతో 6GB RAM వేరియెంట్ ధర రూ. 16,999. జనవరి 19 నుంచి జనవరి 22 వరకు రన్ అయ్యే ఆఫర్ మొదటి రోజునాడు, అంటే జనవరి 19 నాడు ఈ ఫోన్‌ని కొనుగోలు చేయడంపై రూ. 1000 డిస్కౌంట్‌ని పొందుతారు. అదనంగా, ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డు మరియు కొటక్ బ్యాంక్ డెబిట్ మరియు క్రెడిట్ కార్డు ద్వారా ఈ మోడల్ కొనుగోలు చేసినప్పుడు 10% డిస్కౌంట్ ఇవ్వబడుతుంది. అలానే, మీరు ఆఫర్ సమయంలో కొనుగోలు చేసినట్లయితే, మీరు రూ. 2,200 జియో రీఛార్జ్ వోచర్‌ని కూడా పొందుతారు, దీనిని రూ. 50 రీఛార్జ్ వలే 44 రీఛార్జ్‌లు చేసుకోవచ్చు. ఇది మాత్రమే కాదు, మీరు 125 GB అదనపు ఇంటర్నెట్ డేటాను కూడా పొందుతారు, దీనిని ప్రతి రీఛార్జ్‌కు 5GB చొప్పున 25సార్లు రీఛార్జ్ చేసుకోవచ్చు.

తీర్పు


గొప్ప ఫీచర్లు మరియు డిజైన్, మరియు Kirin 710 ప్రాసెసర్‌ ఉన్నప్పటికీ, కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్ చాలా చౌక ధరకు లభ్యమవుతుంది. శక్తివంతమైన Kirin 710 కారణంగా, దాని పనితీరుకు సంబంధించి మీకు ఎలాంటి ఫిర్యాదులు ఉండవు. చిట్టచివరగా, గేమింగ్, బింగ్ చూడటం మరియు ఎలాంటి అంతరాయం లేకుండా పాప్ అప్ కెమెరా వంటి అన్ని ఆవశ్యకతలను సంతృప్తి పరిచే స్మార్ట్‌ఫోన్‌ని ప్రతి యూజర్ పొందే అవకాశం ఉంటుంది.

(This is a partnered post.)
Published by: Santhosh Kumar S
First published: January 21, 2020, 4:48 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading