ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ (Indian Postal Payment Bank) లో సేవింగ్స్ అకౌంట్ గల కస్టమర్లకు శుభవార్త. పోస్టల్ డిపాజిట్లను సులభతరం చేసేందుకు పోస్టల్ విభాగం తాజాగా కొత్త ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ (IVR) సిస్టమ్‌ను ఆవిష్కరించింది. మొబైల్ ఫోన్ ద్వారానే ఈ కొత్త సదుపాయాన్ని పొందవచ్చు. ఈ కొత్త ఐవీఆర్ సేవతో మీ పోస్టల్ పెట్టుబడులకు సంపాదించిన వడ్డీ, బ్యాలెన్స్, డిపాజిట్ వివరాలు, ఏటీఎమ్ కార్డ్ బ్లాకింగ్ (ATM Card Blocking) సౌకర్యాలు, కొత్త కార్డుల జారీతో పాటు వివిధ పోస్టల్ సేవింగ్ ఉత్పత్తులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. డిపార్ట్‌మెంట్ జారీ చేసిన సర్క్యులర్ (Circular) ప్రకారం, పీపీఎఫ్, ఎన్ఎస్సీ వంటి చిన్న పొదుపు పథకాల్లో పెట్టుబడి పెట్టిన కస్టమర్లు 18002666868 ట్రోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.
ఈ ఐవీఆర్ ఫెసిలిటీలో 1 నంబర్ నొక్కితే హిందీలో సమాచారం వస్తుంది. 2 నంబర్ నొక్కితే ఇంగ్లీష్‌లో సమాచారం వస్తుంది. మరోవైపు, దీని ద్వారా పోస్టల్ డెలివరీ సేవలు, రిజిస్టర్ పోస్ట్ సేవలు, జీవిత బీమా (Life Insurance) ప్రీమియం గడువు తేదీ, ప్రీమియం మొత్తం, పాలసీ స్టేటస్, పాలసీ మెచ్యూరిటీ తేది, హామీ మొత్తం, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ సేవలు అన్ని పథకాల్లో ఖాతా బ్యాలెన్స్, డెబిట్ కార్డు సేవలు, పోస్టాఫీస్ అందించే పలు చిన్న మొత్తాల పొదుపు పథకాలు, ఇంకా పలు రకాల ఇతర సేవల గురించి సమాచారం తెలుసుకోవచ్చు.
Apple ID: యాపిల్ యూజర్లకు బంపరాఫర్.. యాపిల్ ఐడీ వాడండి.. 20 శాతం బోనస్ పొందండి
కస్టమర్లు టోల్ ఫ్రీ నంబర్‌కు డయల్ చేసిన తర్వాత ఐవీఆర్ సూచించిన విధంగా మీకు ఎలాంటి సేవలు కావాలంటే దానికి సంబంధించిన బటన్ ప్రెస్ చేస్తే సమాచారం అందుతుంది. 5 నంబర్ నొక్కితే అన్ని రకాల ఖాతాల్లో ఉన్న బ్యాలెన్స్ సమాచారం తెలుస్తుంది. అయితే బ్యాలెన్స్ కోసం మీ అకౌంట్ నంబర్ సహా # సింబల్ ఎంటర్ చేయాలి. ఏటీఎం కార్డు బ్లాక్ చేసేందుకు 6 నంబర్‌పై క్లిక్ చేయాలి. మీ కార్డ్ నంబర్ ఉపయోగించి బ్లాక్ చేసేందుకు 1 నొక్కండి.
Technology : అసలు పాస్‌వర్డ్ ఎలా పెట్టాలి.. ఎలాంటి పాస్‌వర్డ్ పెడితే నష్టం
మీ అకౌంట్ నంబర్ ఉపయోగించి బ్లాక్ చేసేందుకు 2 నొక్కండి. మీ కస్టమర్ ఐడీ ఉపయోగించి బ్లాక్ చేసేందుకు 3 నొక్కండి.
ఐవీఆర్తో క్షణాల్లో అన్ని రకాల సేవలు..
ఇక, ఇతర సర్వీసుల కోసం 7 నంబర్ క్లిక్ చేయాలి. ఇండియన్ పోస్ట్ బ్యాంకింగ్ సేవల కోసం 2 క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఒకటి నొక్కితే మీ సేవింగ్స్ ఖాతాతో పాటు పీపీఎఫ్, ఎస్ఎస్ఏ వివరాలు తెలుస్తాయి. తొలుత మీ ఖాతా నంబర్ ఫీడ్ చేసి తర్వాత హ్యాష్‌ట్యాగ్ నొక్కాలి. మీ ఖాతా స్టేటస్ తెలుసుకోవడానికి 1 నంబర్ నొక్కాలి. చివరి నాలుగు లావాదేవీల కోసం 2 నంబర్ నొక్కాలి. స్పెసిఫిక్ ట్రాన్సాక్షన్‌కు సంబంధించిన సమాచారం కోసం 3 నొక్కాలి. వడ్డీ ఆదాయంపై ఎంత ఐటీ తగ్గుతుందో తెలుసుకునేందుకు 4 నొక్కాలి. ఖాతా వివరాలు తెలుసుకోవడం ఆపాలంటే 5 నొక్కాలి. ఏటీఎం కార్డుకు సంబంధించిన సమాచారం కొరకు 3 నంబర్ నొక్కాలి. తర్వాత 2 రెండు నొక్కి ఏటీఎం కార్డు నంబర్, 1 నొక్కితే ఏటీఎం పిన్ నంబర్‌ను మార్చుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Atm Card, Indian postal, Mobile Banking, Postal department