PORTRONICS SOUND SLICK III SOUNDBAR LAUNCHED IN IN INDIA PRICED AT RS 4199 KNOW SPECIFICATIONS SS GH
Budget Soundbar: సౌండ్ బార్ కొనాలా? తక్కువ బడ్జెట్లో పోర్ట్రోనిక్స్ నుంచి సరికొత్త మోడల్
Budget Soundbar: సౌండ్ బార్ కొనాలా? తక్కువ బడ్జెట్లో పోర్ట్రోనిక్స్ నుంచి సరికొత్త మోడల్
Portronics Sound Slick III Soundbar | మీరు సౌండ్ బార్ కొనాలనుకుంటున్నారా? మీ బడ్జెట్ రూ.5,000 లోపేనా? పోర్ట్రోనిక్స్ సౌండ్ స్లిక్ III సౌండ్ బార్ ఇండియాలో లాంఛ్ అయింది. స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ తెలుసుకోండి.
దేశీయ ఆడియో బ్రాండ్ పోర్ట్రోనిక్స్ (Portronics) ఎప్పటికప్పుడు అదిరిపోయే సౌండ్ స్పీకర్లను లాంచ్ చేస్తూ భారతీయ కస్టమర్లను బాగా ఆకట్టుకుంటోంది. తాజాగా సౌండ్ స్లిక్ III (Sound Slick III) అనే సరికొత్త బడ్జెట్ సౌండ్‌బార్‌ను సంస్థ లాంచ్ చేసింది. దీని ధర కేవలం రూ.4,199 మాత్రమే ఉండటం విశేషం. ఈ సౌండ్‌బార్ బ్లాక్ కలర్ ఫినిషింగ్‌తో రెక్టాంగిల్ డిజైన్‌తో వస్తుంది. ముందు భాగంలో వాల్యూమ్‌ను తగ్గించడానికి లేదా పెంచడానికి వీలుగా బటన్స్ ఉంటాయి. ఆడియోను ప్లే చేయడానికి, పాజ్ చేయడానికి, పవర్ బటన్‌ను ఆన్/ఆఫ్ చేయడానికి సౌండ్ స్లిక్ III సౌండ్బార్లోని ముందు భాగంలో అన్ని కంట్రోల్స్ ఉన్నాయి.
పోర్ట్రోనిక్స్ సౌండ్ స్లిక్ III సౌండ్ బార్లో కంపెనీ లోగోను కూడా ముందు భాగంలోనే ఇచ్చారు. వెనుకవైపు కనెక్టివిటీ ఆప్షన్స్‌లో 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, AUX కేబుల్ కనెక్టర్, సింగిల్ యూఎస్బీ, హెచ్డీఎంఐ పోర్ట్, ఆప్టికల్ పోర్ట్ ఉన్నాయి. సౌండ్ మోడ్‌లను మార్చడానికి వీలుగా యూజర్లకు రిమోట్ కంట్రోల్‌ను కూడా అందిస్తుంది కంపెనీ. ఈ సౌండ్‌బార్ 1 సంవత్సరం వారంటీతో వస్తుంది.
బ్లూటూత్ v5 ద్వారా సౌండ్ స్లిక్ III సౌండ్‌బార్‌ను ఎలాంటి కంపాటబుల్ టీవీ, ల్యాప్‌టాప్, ట్యాబ్ లేదా స్మార్ట్ఫోన్తోనైనా ఒక్క టచ్‌తో కనెక్ట్ చేయవచ్చు. 10 మీటర్ల కనెక్టివిటీ రేంజ్ తో ఇది వస్తుంది. డివైజ్లతో పాటు యూజర్లు MP3/WMA డ్యూయల్ ఫార్మాట్లతో కూడిన యూఎస్బీ రీడర్‌ను కూడా సౌండ్బార్కు కనెక్ట్ చేయవచ్చు. సౌండ్‌బార్ బరువు 1.85 కిలోల మాత్రమే కాబట్టి మీ రూమ్ లో దీన్ని ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లవచ్చు.
ఆడియో క్వాలిటీ పరంగా, పోర్ట్రోనిక్స్ సౌండ్ స్లిక్ III 80W సౌండ్ అవుట్‌పుట్‌ను అందిస్తుంది. ఈ సౌండ్‌బార్‌లో 3D-లాంటి సరౌండ్ సౌండ్ అనుభూతిని అందించడానికి రెండు ఆడియో డ్రైవర్లు, డీప్ బాస్ అందించారు. సౌండ్‌బార్ ప్రీమియం డిజైన్ మీ రూమ్‌కి స్టైల్ యాడ్ చేస్తుందని పోర్ట్రోనిక్స్ చెబుతోంది. అయితే ఈ సౌండ్‌బార్‌లో ప్రత్యేక వూఫర్ యూనిట్ లేదా శాటిలైట్ స్పీకర్లు లేవని కస్టమర్లు గమనించాలి.
పోర్ట్రోనిక్స్ సౌండ్ స్లిక్ III ధర రూ. 4,199గా నిర్ణయించారు. దీన్ని పోర్ట్రోనిక్స్ కంపెనీ అధికారిక వెబ్సైట్, అమెజాన్, ఇతర ఆన్లైన్, ఆఫ్‌లైన్ స్టోర్ల నుంచి కొనుగోలు చేయవచ్చు. యాక్సిస్ మైల్స్ (Axis Miles) క్రెడిట్ కార్డ్‌లపై 10 శాతం డిస్కౌంట్ (రూ. 5,000 కంటే ఎక్కువ కొనుగోలు) వంటి సేల్ డీల్స్ కూడా అమెజాన్ అందిస్తోంది. మాస్టర్ కార్డ్ యూజర్లు సిటీ యూనియన్ బ్యాంక్ డెబిట్ కార్డ్‌పై రూ. 150 విలువైన ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు. అయితే ఈ సౌండ్‌బార్ సింగిల్ బ్లాక్ కలర్ ఆప్షన్లో మాత్రమే వస్తుందని కస్టమర్లు గమనించాలి.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.