హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

OTT Plans: భారత్​లో ఓటీటీ కంటెంట్​కు పెరుగుతున్న ఆదరణ.. అందుబాటు ధరల్లో ఓటీటీ ప్లాన్లు.. వివరాలు ఇవే..

OTT Plans: భారత్​లో ఓటీటీ కంటెంట్​కు పెరుగుతున్న ఆదరణ.. అందుబాటు ధరల్లో ఓటీటీ ప్లాన్లు.. వివరాలు ఇవే..

అయితే ప‌లు ఓటీటీలు స్టూడెంట్ అండ్ యూత్‌ను ఆక‌ట్టుకొనేందుకు ప్ర‌త్యేక ప్యాకేజీల‌ను అందిస్తోంది. అయితే ఈ ప్లాన్ తీసుకోవ‌డానికి ప్లాన్‌కు వెరిఫికేషన్ తప్పనిసరి. (ప్రతీకాత్మక చిత్రం)

అయితే ప‌లు ఓటీటీలు స్టూడెంట్ అండ్ యూత్‌ను ఆక‌ట్టుకొనేందుకు ప్ర‌త్యేక ప్యాకేజీల‌ను అందిస్తోంది. అయితే ఈ ప్లాన్ తీసుకోవ‌డానికి ప్లాన్‌కు వెరిఫికేషన్ తప్పనిసరి. (ప్రతీకాత్మక చిత్రం)

భారత్​లో వీడియో స్ట్రీమింగ్​ ఓటీటీ ప్లాట్​ఫామ్​లకు భారీ డిమాండ్​ ఏర్పడింది. కరోనా లాక్​డౌన్​ తర్వాత ఇది ప్రతి ఒక్కరి జీవితంలో సాధారణంగా మారింది. ప్రస్తుతం తక్కువ ధరలోనే మొబైల్ ఇంటర్నెట్, హోమ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందుబాటులోకి రావడంతో ఈ ధోరణి మరింతగా పెరిగింది. దీంతో ఓటీటీ ఆదరణ కూడా బాగా పెరిగింది.

ఇంకా చదవండి ...

భారత్​లో వీడియో స్ట్రీమింగ్​ ఓటీటీ ప్లాట్​ఫామ్​లకు భారీ డిమాండ్​ ఏర్పడింది. కరోనా లాక్​డౌన్​ తర్వాత ఇది ప్రతి ఒక్కరి జీవితంలో సాధారణంగా మారింది. ప్రస్తుతం తక్కువ ధరలోనే మొబైల్ ఇంటర్నెట్, హోమ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందుబాటులోకి రావడంతో ఈ ధోరణి మరింతగా పెరిగింది. మరోవైపు కరోనా భయంతో జనాలు థియేటర్లకు రావడం దాదాపుగా మానేశారు. అందుకే నిర్మాణ సంస్థలు సైతం కొత్త సినిమాలను ఓటీటీల్లోనే విడుదల చేసేందుకు మొగ్గుచూపుతున్నాయి. వెబ్​సిరీస్​ల నుంచి ఒరిజినల్​ షోల వరకూ అన్ని భాషల కంటెంట్​ ఓటీటీల్లోనే రిలీజ్​ అవుతున్నాయి. అయితే పేరుకు ఓటీటీలు చాలానే ఉన్నా కొన్ని ఓటీటీలు మాత్రమే అన్ని చోట్లా ఆడియన్స్​ను ఆకర్షిస్తున్నాయి. వాటిలో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్‌స్టార్, సోనీ లైవ్ వంటివి ముందు వరుసలో ఉన్నాయి. ఇవి భారత్​లో తమ హవా కొనసాగిస్తున్నాయి. ఈ ప్లాట్​ఫామ్​ల ప్లాన్లు, ధరలు, ప్రయోజనాలను పరిశీలిద్దాం.

నెట్‌ఫ్లిక్స్

నెట్‌ఫ్లిక్స్ దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఓటీటీ ప్లాట్​ఫామ్​గా కొనసాగుతోంది. అనేక హాలీవుడ్​, బాలీవుడ్ ప్రీమియర్‌లను కూడా అందిస్తుంది. ప్రస్తుతం నెట్​ఫ్లిక్స్​ అందిస్తున్న ప్లాన్లను పరిశీలిద్దాం.

మొబైల్: నెలకు రూ .199, 480p రిజల్యూషన్ వీడియో స్ట్రీమింగ్​, ఫోన్, టాబ్లెట్లకు మాత్రమే యాక్సెస్. 1 వ్యూయర్​కు మాత్రమే.

బేసిక్​: నెలకు రూ .499, 480p రిజల్యూషన్ వీడియో స్ట్రీమింగ్​, టీవీతో సహా అన్ని డివైజెస్​లో యాక్సెస్. 1 వ్యూయర్​కి మాత్రమే.

స్టాండర్డ్​: నెలకు రూ. 649, 1080p రిజల్యూషన్ వీడియో స్ట్రీమింగ్, టీవీతో సహా అన్ని డివైజెస్​లో యాక్సెస్, 2 వ్యూయర్స్​కు మాత్రమే.

ప్రీమియం: నెలకు రూ .799, 4K HDR రిజల్యూషన్. అన్ని టీవీతో సహా అన్ని డివైజెస్​లో యాక్సెస్​, 4 వ్యూయర్స్​కు మాత్రమే.

అమెజాన్ ప్రైమ్ వీడియో

అమెజాన్ ప్రైమ్ వీడియో కూడా భారత్​లో అత్యంత ఆదరణ పొందిన ఓటీటీ ప్లాట్​ఫామ్​. అయితే, ఇది సొంతంగా వెబ్​సిరీస్​లను నిర్మించదు. నిర్మాణ సంస్థల నుంచి సినిమాలు, వెబ్​సిరీస్​లను కొనుగోలు చేసి దీనిలో ప్రదర్శిస్తుంది. దీనికి అదనంగా ప్రైమ్​ సబ్​స్కైబర్లకు అమెజాన్ ఈ–కామర్స్ యాప్‌లో స్పెషల్​ డిస్కౌంట్లను కూడా అందిస్తుంది.

ప్లాన్లు

నెలవారీ: రూ 129, 4K HDR రిజల్యూషన్​ గల వీడియోలను ఒకేసారి ముగ్గురు స్ట్రీమింగ్​ చేయవచ్చు.

త్రైమాసికం: రూ .329, 4K HDR రిజల్యూషన్ గల వీడియోలను ఒకేసారి ముగ్గురు స్ట్రీమింగ్ చేయవచ్చు.

వార్షికం: రూ .999, 4K HDR రిజల్యూషన్ గల వీడియోలను ఒకేసారి ముగ్గురు స్ట్రీమింగ్ చేయవచ్చు.

డిస్నీ+ హాట్‌స్టార్

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎస్​ల)తో సహా క్రికెట్ టోర్నమెంట్‌లను లైవ్​ స్ట్రీమింగ్​ చేస్తోంది డిస్నీ+ హాట్‌స్టార్. దీంతో భారత్​లో అత్యంత ప్రజాదరణ పొందింది. వీటితో పాటు అనేక హాలీవుడ్​, బాలీవుడ్​, లోకల్​ లాంగ్వేజ్​ చిత్రాలను ఈ ప్లాట్​ఫామ్​లో అందుబాటులోకి తెచ్చింది.

ప్లాన్లు

వీఐపీ: సంవత్సరానికి రూ .399, 1080p రిజల్యూషన్​ వీడియోను యాక్సెస్​ చేయవచ్చు.1 వ్యూయర్​కే పరిమితం.

ప్రీమియం: నెలకు రూ .299 లేదా సంవత్సరానికి రూ .1,499తో సబ్​స్క్రైబ్​ చేసుకొని డాల్బీ అట్మోస్, డాల్బీ విజన్‌తో 4K వీడియో స్ట్రీమింగ్​ను ఆస్వాదించవచ్చు. కాగా, డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లు సెప్టెంబర్ 1 నుండి రివైజ్​ అవుతున్నాయి.- కొత్త ప్లాన్ల ప్రకారం ‘మొబైల్’ రూ .499, ‘సూపర్’ రూ .899, ‘ప్రీమియం’ రూ .1,499 అందించనుంది.

సోనీ లైవ్

సోనీ లైవ్ UEFA టోర్నమెంట్లు, జర్మన్ బుండెస్లిగా, ఇటాలియన్ సీరీస్​లతో సహా లైవ్ స్పోర్ట్స్ కవరేజీ అందిస్తుంది. ఇవన్నీ సోనీ లైవ్​ను టాప్​ ఓటీటీ ప్లాట్​ఫామ్​ల జాబితాలో చేర్చాయి. ప్రస్తుతం కొనసాగుతున్న టోక్యో ఒలింపిక్స్​ను లైవ్​ స్ట్రీమింగ్​ చేస్తుండటంతో సబ్​స్క్రైబర్ల సంఖ్య కూడా పెరిగింది.

ప్లాన్లు

స్పెషల్: సంవత్సరానికి రూ .199, ఒరిజినల్స్, లైవ్ స్పోర్ట్స్ యాక్సెస్​ లభించదు. కేవలం 1 వ్యూయర్​కి మాత్రమే పరిమితం.

WWE నెట్‌వర్క్: సంవత్సరానికి రూ 299, WWE కంటెంట్​కు మాత్రమే యాక్సెస్, 1 వ్యూయర్​కు మాత్రమే పరిమితం.

స్పెషల్ ప్లస్​: సంవత్సరానికి రూ .399, ఒరిజినల్స్, లైవ్ స్పోర్ట్స్ యాక్సెస్​ లభించదు. కేవలం 1 వ్యూయర్​కు మాత్రమే పరిమితం.

ప్రీమియం: నెలకు రూ .299, ఆరు నెలలకు రూ. 699, సంత్సరానికి రూ .999. ఒకేసారి 2 వ్యూయర్స్​కు మాత్రమే పరిమితం.

First published:

Tags: Aha app, Amazon prime, Disney+ Hotstar, Investment Plans, Netflix, Ott, Sony

ఉత్తమ కథలు