SHOCK: మీకు తెలియకుండా ఫోన్ స్క్రీన్‌ని రికార్డ్ చేస్తున్న ఐఫోన్ యాప్స్

మీరు ఏదైనా యాప్ ఉపయోగించేప్పుడు స్క్రీన్‌పై ఏమేం చేశారో మొత్తం రికార్డై సెషన్ రిప్లే కింద సదరు సంస్థలకు ఫీడ్‌బ్యాక్ వెళ్తుంది. దీని ద్వారా కస్టమర్ల డేటాకు ముప్పు ఉన్నట్టే.

news18-telugu
Updated: February 9, 2019, 8:17 AM IST
SHOCK: మీకు తెలియకుండా ఫోన్ స్క్రీన్‌ని రికార్డ్ చేస్తున్న ఐఫోన్ యాప్స్
SHOCK: మీకు తెలియకుండా స్క్రీన్‌ని రికార్డ్ చేస్తున్న ఐఫోన్ యాప్స్ (Image: tech2/Omkar Patne)
  • Share this:
స్మార్ట్‌ఫోన్ యూజర్ల పర్సనల్ డేటాకు ముప్పు ఉందని రుజువు చేసే ఘటనలు ఎక్కువయ్యాయి. ఫేస్‌బుక్, గూగుల్ లాంటి టెక్ దిగ్గజాలు యూజర్ల డేటాను ఐఫోన్లలోని వీపీఎన్ యాప్స్ ద్వారా సేకరిస్తున్న విషయం వారం రోజులుగా కలకలం రేపుతోంది. హోటల్, ట్రావెల్ సైట్స్, ఎయిర్‌లైన్స్‌కు సంబంధించిన యాప్స్ ఐఫోన్ల నుంచి డేటాను కలెక్ట్ చేస్తున్నాయని టెక్‌క్రంచ్ మరో సంచలన కథనాన్ని పబ్లిష్ చేసింది. మీరు మీ స్మార్ట్‌ఫోన్‌పై ఎన్నిసార్లు ట్యాప్ చేశారు? ఎలా స్వైప్ చేశారు? గెశ్చర్స్ ఏవి ఉపయోగించారు? అన్న డేటా మీ డివైజ్ నుంచి ఇతరుల చేతుల్లోకి వెళ్తుందన్నది ఆ కథనం సారాంశం.

ఏబర్‌క్రోంబీ అండ్ ఫిచ్, సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో పాటు మరికొన్ని సంస్థలు కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ అనలిటిక్స్ సంస్థ గ్లాస్‌బాక్స్ సేవల్ని ఉపయోగించుకుంటున్నాయి. మీరు ఏదైనా యాప్ ఉపయోగించేప్పుడు స్క్రీన్‌పై ఏమేం చేశారో మొత్తం రికార్డై సెషన్ రిప్లే కింద సదరు సంస్థలకు ఫీడ్‌బ్యాక్ వెళ్తుంది. దీని ద్వారా కస్టమర్ల డేటాకు ముప్పు ఉన్నట్టే. ఎందుకంటే ఏవైనా లావాదేవీలు చేసినప్పుడు యూజర్ ఐడీ, పాస్‌వర్డ్, కార్డు వివరాల్లాంటివి ఇతరుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదముంది. ఎక్స్‌పీడియా, Hotels.com కూడా సెషన్ రీప్లే టెక్నాలజీని ఉపయోగిస్తున్నాయని టెక్‌క్రంచ్ కథనం.

Photos: రూ.50 కోట్లతో 6 రోల్స్ రాయిస్ కార్లు... తలపాగాతో మ్యాచింగ్...




ఇవి కూడా చదవండి:

SBI Alert: కార్డు మోసాలు జరుగుతున్నాయి... ఇలా జాగ్రత్తపడండి

PAN-AADHAR link: పాన్ కార్డుతో ఆధార్ లింక్... డెడ్‌లైన్ మార్చి 31Paytm SIP Offer: డబ్బులు లేవా? అయినా పెట్టుబడి పెట్టొచ్చు... ఎలాగో తెలుసుకోండి
First published: February 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు