వాట్సాప్ వినియోగదారులకు ఢిల్లీ పోలీసులు తాజాగా హెచ్చరికలు జారీ చేశారు. ఫ్రీ సబ్ స్క్రిప్షన్ అంటూ వచ్చే లింకులపై క్లిక్ చేయొద్దని సూచించారు. ఈ మేరకు వారు ట్వీట్ చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
సోషల్ మీడియా యుగంలో సైబర్ నేరగాళ్లు చిత్ర విచిత్రమైన రూపంలో అమాయకులతో ఆడుకుంటున్నారు. ఫ్రీ అంటూ ఆశ చూపుతూ మోసాలకు పాల్పడుతున్నారు. స్మార్ట్ ఫోన్ వాడే వారిని టార్గెట్ గా చేసుకుని వారికి ఫేక్ లింకు లు పంపుతూ వారి వద్ద నుంచి బ్యాంకు తదితర సమాచారాన్ని కొల్లగొడుతున్నారు. అనేక మంది ఇలాంటి ఫేక్ మెసేజ్ లను నమ్మడంతో పాటు వాటిని ఇతరులకు కూడా పంపడంతో అవి వైరల్ గా మారుతున్నాయి. దీంతో వందల మంది బాధితులుగా మారుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఢిల్లీ సైబర్ క్రైమ్ పోలీసులు ఇలాంటి మెసేజ్ ల విషయంలో ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. అమెజాన్ ప్రైమ్(Amazon Prime), నెట్ ఫ్లిక్స్(Netflix) తదితర వీడియో స్ట్రీమింగ్ యాప్ లకు ఉచితంగా యాక్సెస్ అంటూ వచ్చే మెసేజ్ లను నమ్మ వద్దని సూచించారు.
ఇలాంటి హానికరమైన లింకులు మీ స్మార్ట్ ఫోన్లోని విలువైన డేటాను దొంగిలిస్తాయని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వారు వెల్లడించారు. ఇలాంటి మెసేజ్ లు ఏమైనా వస్తే వాటిపై క్లిక్ చేయవద్దని సూచించారు. వాటిని ఇతరులకు ఫార్వర్డ్ కూడా చేయవద్దని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి స్క్రీన్ షాట్లను సైతం వారు షేర్ చేశారు.
Several users are receiving WhatsApp messages as shown below👇🏽👇🏽
These messages have URLs/Links which are flagged as malicious by multiple antivirus engines. The Links have been blocked.
“Get 2 months of Amazon Premium Free anywhere in the world for 60 days. http://profilelist.xyz/?livestream” అంటూ వచ్చిన లింక్ లపై క్లిక్ చేయవద్దని ఆ ట్వీట్ లో వారు సూచించారు. ఈ లింక్ లపై క్లిక్ చేస్తే మనకు తెలియకుండానే మన స్మార్ట్ ఫోన్లోని బ్యాంకు ఖాతాల వివరాలు తదితర సమాచారం సైబర్ నేరగాళ్లకు చేరుతుందని వారు తెలిపారు. క్రెడిట్ కార్డు వివరాలు, పాస్వర్డ్ లు, మెసేజ్ లు, ఫొటోలు కేటుగాళ్ల చేతుల్లోకి వెళ్తాయని స్పష్టం చేశారు. వాట్సాప్ వినియోగదారలు ఇలాంటి మెసేజ్ ల విషయంలో అప్రమత్తంగా ఉండి మోసపోవద్దని వారు సూచించారు.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.