హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Poco X5 Pro 5G: పాపులర్ గేమింగ్ ప్రాసెసర్, అమొలెడ్ డిస్‌ప్లేతో పోకో ఎక్స్5 ప్రో 5జీ రిలీజ్

Poco X5 Pro 5G: పాపులర్ గేమింగ్ ప్రాసెసర్, అమొలెడ్ డిస్‌ప్లేతో పోకో ఎక్స్5 ప్రో 5జీ రిలీజ్

Poco X5 Pro 5G: పాపులర్ గేమింగ్ ప్రాసెసర్, అమొలెడ్ డిస్‌ప్లేతో పోకో ఎక్స్5 ప్రో 5జీ రిలీజ్
(image: Poco India)

Poco X5 Pro 5G: పాపులర్ గేమింగ్ ప్రాసెసర్, అమొలెడ్ డిస్‌ప్లేతో పోకో ఎక్స్5 ప్రో 5జీ రిలీజ్ (image: Poco India)

Poco X5 Pro 5G | భారతీయ మార్కెట్లోకి మరో గేమింగ్ స్మార్ట్‌ఫోన్ (Gaming Smartphone) వచ్చేసింది. పోకో ఇండియా పాపులర్ గేమింగ్ ప్రాసెసర్‌తో పోకో ఎక్స్5 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ లాంఛ్ చేసింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

భారతదేశంలో కొత్త మొబైల్స్ లాంఛింగ్ సందడి మళ్లీ మొదలైంది. కంపెనీలు కొత్త మోడల్స్ లాంఛ్ చేస్తున్నాయి. ఇండియాలో 5జీ నెట్వర్క్ లాంఛ్ కావడంతో 5జీ స్మార్ట్‌ఫోన్స్ (5G Smartphones) లాంఛ్ అవుతున్నాయి. పోకో ఇండియా లేటెస్ట్‌గా పోకో ఎక్స్5 ప్రో 5జీ (Poco X5 Pro 5G) స్మార్ట్‌ఫోన్ లాంఛ్ చేసింది. ఇందులో పాపులర్ గేమింగ్ ప్రాసెసర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778జీ, అమొలెడ్ డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీ, 108MP కెమెరా లాంటి ప్రత్యేకతలున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.22,999. పోకో ఎక్స్5 ప్రో 5జీ రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ విశేషాలు తెలుసుకోండి.

పోకో ఎక్స్5 ప్రో 5జీ ధర

పోకో ఎక్స్5 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.22,999 కాగా, 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,999. ఐసీఐసీఐ బ్యాంక్ కార్డుతో కొంటే రూ.2,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్‌తో 6జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.20,999 ధరకు, 8జీబీ+256జీబీ వేరియంట్‌ను రూ.22,999 ధరకు సొంతం చేసుకోవచ్చు. ఫిబ్రవరి 13 మధ్యాహ్నం 12 గంటలకు సేల్ ప్రారంభం అవుతుంది. ఆస్ట్రాల్ బ్లాక్, హొరైజన్ బ్లూ, పోకో ఎల్లో కలర్స్‌లో కొనొచ్చు.

Coca-Cola Smartphone: రియల్‌మీ నుంచి కోకా-కోలా ఎడిషన్ మొబైల్ ... ప్రత్యేకతలివే

పోకో ఎక్స్5 ప్రో 5జీ స్పెసిఫికేషన్స్

పోకో ఎక్స్5 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 6.67 అంగుళాల ఎక్స్‌ఫినిటీ అమొలెడ్ డిస్‌ప్లే ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది గతేడాది లాంఛ్ అయిన పాపులర్ గేమింగ్ ప్రాసెసర్. ఐకూ జెడ్6 ప్రో, రియల్‌మీ 9 5జీ స్పీడ్ ఎడిషన్, ఐకూ జెడ్5, షావోమీ 11 లైట్ 5జీ ఎన్ఈ మొబైల్స్‌లో కూడా ఇదే ప్రాసెసర్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 12 + ఎంఐయూఐ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. రెండేళ్లు ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌డేట్స్, మూడేళ్లు సెక్యూరిటీ ప్యాచెస్ ఇస్తామని కంపెనీ చెబుతోంది.

UPI Transaction Limit: గూగుల్‌ పే, ఫోన్‌పే, ఇతర యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారా? లిమిట్‌ ఎంతంటే?

పోకో ఎక్స్5 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 108మెగాపిక్సెల్ ISOCELL HM2 ప్రైమరీ సెన్సార్ + 8మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సార్ + 2మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 4కే వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఇందులో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా 67వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 5వాట్ రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, డ్యూయెల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.1 లాంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.

First published:

Tags: 5G Smartphone, POCO, POCO India, Smartphone

ఉత్తమ కథలు