మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. పోకో ఇండియా నుంచి మరో స్మార్ట్‌ఫోన్ ఇండియాలో లాంఛ్ అయింది. పోకో ఎక్స్5 5జీ (Poco X5 5G) మోడల్‌ను రిలీజ్ చేసింది. రూ.20,000 లోపు బడ్జెట్‌లో (Smartphone Under Rs 20000) ఈ మొబైల్ లాంఛ్ అయింది. ఇందులో పాపులర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్, అమొలెడ్ డిస్‌ప్లే, 8GB ర్యామ్, 5000mAh బ్యాటరీ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇప్పటికే ఇదే బడ్జెట్‌లో, స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో పలు మొబైల్స్ ఉన్నాయి. వాటికి పోకో ఎక్స్5 5జీ గట్టి పోటీ ఇవ్వనుంది. మరి పోకో ఎక్స్5 5జీ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్ ఏంటీ, ఆఫర్స్ ఎలా ఉన్నాయి, తెలుసుకోండి.
పోకో ఎక్స్5 5జీ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తోంది. 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,999 కాగా, 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.20,999. సూపర్‌నోవా గ్రీన్, జాగ్వార్ బ్లాక్, వైల్డ్‌క్యాట్ బ్లూ కలర్స్‌లో కొనొచ్చు. మార్చి 21 మధ్యాహ్నం 12 గంటలకు సేల్ ప్రారంభం అవుతుంది. ఫస్ట్ డే ప్రైస్ ఆఫర్ ప్రకటించింది పోకో ఇండియా. ఆఫర్‌లో భాగంగా 6జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.16,999 ధరకు, 8జీబీ+256జీబీ వేరియంట్‌ను రూ.18,999 ధరకు సొంతం చేసుకోవచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ , డెబిట్ కార్డులతో కొంటే రూ.2,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. పాత మొబైల్ ఎక్స్‌ఛేంజ్ చేసేవారికి అదనంగా రూ.2,000 తగ్గింపు లభిస్తుంది.
Nokia C12: నోకియా నుంచి మరో చీపెస్ట్ స్మార్ట్‌ఫోన్... ధర రూ.5,999 మాత్రమే
Give us a better definition of an “All-Star”, we’ll wait! The POCO X5 5G comes with 7 5G bands, Snapdragon 695, and a 120Hz Super AMOLED Display… ...the list can go on and on! The POCO X5 5G goes on sale on 21st March on @Flipkart at a special price.#The5GAllStar pic.twitter.com/orx2kNRW35
— POCO India (@IndiaPOCO) March 14, 2023
పోకో ఎక్స్5 5జీ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల అమొలెడ్ డిస్‌ప్లే ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ లభిస్తుంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. రెడ్‌మీ నోట్ 11 ప్రో+, వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ లాంటి మొబైల్స్‌లో ఇదే ప్రాసెసర్ ఉంది. ఇందులో టర్బో ర్యామ్ ఫీచర్ ఉంది. ఈ ఫీచర్‌తో అదనంగా 5జీబీ వరకు ర్యామ్ పెంచుకోవచ్చు. అంటే గరిష్టంగా 13జీబీ వరకు ర్యామ్ ఉపయోగించవచ్చు.
Mobile Price Cut: ఈ మొబైల్ ధర భారీగా తగ్గింది... ఇప్పుడు రూ.9,999 ధరకే కొనొచ్చు
పోకో ఎక్స్5 5జీ స్మార్ట్‌ఫోన్ కెమెరా ఫీచర్స్ చూస్తే 48మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 8మెగాపిక్సెల్ అల్‌ట్రావైడ్ లెన్స్ + 2మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 13మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. పోకో ఎక్స్5 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఛార్జర్ బాక్సులోనే లభిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5G Smartphone, POCO, POCO India, Smartphone