భారత్‌లో 5G నెట్వర్క్ రాకతో టాప్ మొబైల్ బ్రాండ్స్ 5G ఫోన్లపై ఎక్కువగా దృష్టిసారిస్తున్నాయి. కొన్ని కంపెనీలు వివిధ సెగ్మెంట్లలో ఇప్పటికే 5Gకి సపోర్ట్ చేసే ఫోన్లను రిలీజ్ చేశాయి. భవిష్యత్‌లో మరిన్ని ఫీచర్స్‌తో 5G ఫోన్లు లాంచ్ కానున్నాయి. అయితే ప్రస్తుతం ఈ లేటెస్ట్ టెక్నాలజీ సపోర్ట్‌తో తక్కువ ధరకే మంచి ఫోన్లు లభిస్తున్నాయి. మీ బడ్జెట్ రూ.20వేలు అయితే.. మీకు కొన్ని మోడల్స్ బెస్ట్ ఆప్షన్‌గా చెప్పవచ్చు. అవేంటో చూద్దాం.
ఈ 5G స్మార్ట్‌ఫోన్ (6GB + 128GB)వేరియంట్ ప్రారంభ ధర రూ.16,999. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌తో 6.6-అంగుళాల FHD+ డిస్ప్లేతో ఇది లభిస్తుంది. ఆండ్రాయిడ్ 12, వన్ UI 4 ఓఎస్‌పై రన్ అవుతుంది. 50MP మెయిన్ + 5MP అల్ట్రా వైడ్+ 2MP మ్యాక్రో + 2MP డెప్త్ లెన్స్‌తో రియర్ క్వాడ్ కెమెరా సెటప్ ఈ ఫోన్లో ఉంటుంది. సెల్ఫీల కోసం 8MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 6000mAh లిథియం-అయాన్ బ్యాటరీ ఈ స్మార్ట్‌ఫోన్‌లో అమర్చారు.
Whatsapp Polls Feature: వాట్సప్‌లో పోల్స్ ఫీచర్ వచ్చేసింది... పోల్ ఇలా క్రియేట్ చేయాలి
ఈ వన్‌ప్లస్ డివైజ్ రూ.18,999 వద్ద అందుబాటులో ఉంది. ఇందులో అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయి. 120 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.59 అంగుళాల 401 PPI, IPS LCD డిస్ప్లేతో ఈ ఫోన్ లభిస్తుంది. ఆక్టా కోర్ (2.2 GHz, డ్యూయల్ కోర్ + 1.7 GHz, హెక్సా కోర్) స్నాప్‌డ్రాగన్ 695తో ఈ హ్యాండ్ సెట్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అందిస్తోంది. 64 MP + 2 MP + 2 MPతో రియర్ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో పాటు 16 MP ఫ్రంట్ కెమెరా... వంటివి ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్.
ఈ 5G స్మార్ట్‌ఫోన్ ధర రూ.15,499 నుంచి ప్రారంభమవుతుంది. ఇది 6nm క్వాల్కాప్ స్నాప్‌డ్రాగన్ 695 5G ప్రాసెసర్‌తో బెస్ట్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. 20Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల FHD+ డిస్ప్లేతో ఇది లభిస్తుంది. ఇందులో18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000mAh లిథియం-అయాన్ బ్యాటరీ ఉంటుంది. 50MP+ 2MP +2MP రియర్ ట్రిపుల్ కెమెరా సెటప్, 16MP ఫ్రంట్ కెమెరా.. వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
Weak Password: ఇండియాలో టాప్ 20 వీక్ పాస్వర్డ్స్ ఇవే... మీరు వెంటనే మార్చేయండి
షియోమి కంపెనీకి చెందిన రెడ్మీ నోట్ 11టీ 5G ఫోన్ ప్రస్తుతం రూ.17,999కు అందుబాటులో ఉంది. 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల FHD+ డాట్ డిస్ప్లేతో ఈ స్మార్ట్‌ఫోన్ లభిస్తుంది. 33W ప్రో ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000mAh Li-Po బ్యాటరీ ఇందులో ఉంటుంది. 50MP AI మెయిన్ + 8MP అల్ట్రా-వైడ్‌తో రియర్ డ్యూయల్ కెమెరా సెటప్‌తో పాటు 16MP ఫ్రంట్ కెమెరా వంటి ఫీచర్స్ ఇందులో ఉన్నాయి.
ఈ స్మార్ట్‌ఫోన్ రూ.14,990కు అందుబాటులో ఉంది. 6.5-అంగుళాల FHD+ హైపర్-కలర్ స్క్రీన్, 90Hz రిఫ్రెష్ రేట్‌తో పంచ్-హోల్ డిస్ప్లేతో ఈ ఫోన్ లభిస్తుంది. ఇందులో 5000mAh బ్యాటరీ ఉంటుంది. 48MP మెయిన్ + 2MP మ్యాక్రో + 2MP డెప్త్ లెన్స్‌తో రియర్ ట్రిపుల్ కెమెరా సెటప్, 8MP ఫ్రంట్ కెమెరా వంటివి ఈఫోన్ ప్రత్యేక ఫీచర్లు.
Redmi 10 Power: రూ.12,000 లోపే 8GB+128GB స్మార్ట్‌ఫోన్ కొనేయండి... అదిరిపోయే ఆఫర్
5G నెట్వర్క్ సపోర్ట్ చేసే ఈ మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ను రూ.16,999కు సొంతం చేస్తుంది. ఈ హ్యాండ్సెట్ 6.67 అంగుళాల 395 PPI, 120 Hz రిఫ్రెష్ రేట్‌తో AMOLED డిస్ప్లేతో లభిస్తుంది. ఆక్టా కోర్ (2.2 GHz, డ్యూయల్ కోర్ + 1.7 GHz, హెక్సా కోర్) ఓఎస్‌పై రన్ అవుతుంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్ వినియోగించారు. LED ఫ్లాష్‌తో 64 MP + 8 MP + 2 MPతో రియర్ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో పాటు16 MP ఫ్రంట్ కెమెరా ఇందులో ఉంటుంది. సోనిక్ ఛార్జింగ్ టెక్నాలజీ, USB టైప్-సి పోర్ట్, 5000 mAh బ్యాటరీ వంటి అదనపు ఫీచర్స్ ఇందులో ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5g mobile, 5G Smartphone, Smartphone