Home /News /technology /

POCO X4 PRO 5G SMARTPHONE LAUNCHED WITH 120HZ AMOLED DISPLAY AND SNAPDRAGON 695 CHIPSET KNOW PRICE AND OFFERS SS

Poco X4 Pro 5G: భారీ బ్యాటరీ, అమొలెడ్ డిస్‌ప్లేతో పోకో ఎక్స్4 ప్రో 5జీ రిలీజ్... ధర ఎంతంటే

Poco X4 Pro 5G: భారీ బ్యాటరీ, అమొలెడ్ డిస్‌ప్లేతో పోకో ఎక్స్4 ప్రో 5జీ రిలీజ్... ధర ఎంతంటే
(image: Poco India)

Poco X4 Pro 5G: భారీ బ్యాటరీ, అమొలెడ్ డిస్‌ప్లేతో పోకో ఎక్స్4 ప్రో 5జీ రిలీజ్... ధర ఎంతంటే (image: Poco India)

Poco X4 Pro 5G | పోకో ఎక్స్4 ప్రో 5జీ (Poco X4 Pro 5G) స్మార్ట్‌ఫోన్ ఇండియాలో లాంఛ్ అయింది. పాపులర్ ప్రాసెసర్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ రిలీజైంది. ధర, ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి.

    ఇండియాలో పోకో ఎక్స్ సిరీస్‌లో (Poco X Series) వచ్చిన స్మార్ట్‌ఫోన్లు బాగా పాపులర్ అయ్యాయి. ఇదే సిరీస్‌లో మరో స్మార్ట్‌ఫోన్ లాంఛ్ అయింది. పోకో ఎక్స్4 ప్రో 5జీ (Poco X4 Pro 5G) స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో లాంఛ్ చేసింది. పోకో ఎక్స్3 ప్రో అప్‌గ్రేడ్ వర్షన్‌గా ఈ స్మార్ట్‌ఫోన్ రిలీజైంది. పోకో ఎక్స్4 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌లో పాపులర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్ (Qualcomm Snapdragon 695), అమొలెడ్ డిస్‌ప్లే, 64మెగాపిక్సెల్ కెమెరా సెటప్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 5జీ కనెక్టివిటీ లాంటి ప్రత్యేకతలున్నాయి. పోకో ఎక్స్4 ప్రో 5జీ ఇప్పటికే గ్లోబల్ మార్కెట్‌లో రిలీజైన సంగతి తెలిసిందే. గ్లోబల్ మార్కెట్‌లో 108మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్‌తో రిలీజైతే ఇండియాలో 64మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో రిలీజైంది.

    పోకో ఎక్స్4 ప్రో 5జీ ధర


    పోకో ఎక్స్4 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.18,999. ఏప్రిల్ 5న సేల్ ప్రారంభం అవుతుంది. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు ఆఫ్‌లైన్ స్టోర్లలో కొనొచ్చు. పోకో ఎక్స్4 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ 6జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,999 కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999. హైఎండ్ వేరియంట్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.21,999. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డుతో కొంటే రూ.1,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. లేజర్ బ్లూ, లేజర్ బ్లాక్, పోకో ఎల్లో కలర్స్‌లో కొనొచ్చు.

    Exchange Offer: మీ పాత మొబైల్ ఎక్స్‌ఛేంజ్ చేస్తే ఈ స్మార్ట్‌ఫోన్ రూ.3,999 ధరకే సొంతం చేసుకోవచ్చు


    పోకో ఎక్స్4 ప్రో 5జీ స్పెసిఫికేషన్స్


    పోకో ఎక్స్4 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 120Hz అమొలెడ్ డిస్‌ప్లే ఉంది. ముందు, వెనుక కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉండటం విశేషం. స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇదే ప్రాసెసర్ రెడ్‌మీ నోట్ 11 ప్రో+, వివో టీ1, రియల్‌మీ 9 ప్రో, మోటో జీ71 స్మార్ట్‌ఫోన్లలో కూడా ఉంది. ఆండ్రాయిడ్ 11 + ఎంఐయూఐ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.

    Realme 9 Pro+: భారీ డిస్కౌంట్‌తో రియల్‌మీ 9 ప్రో ప్లస్ సేల్... ఆఫర్ వివరాలివే

    పోకో ఎక్స్4 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 64మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా + 8మెగాపిక్సెల్ అల్‌ట్రావైడ్ సెన్సార్ + 2మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 67వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. డ్యూయెల్ స్పీకర్స్, హెడ్‌ఫోన్ జాక్, హైబ్రిడ్ మైక్రోఎస్‌డీ కార్డ్ స్లాట్, బ్లూటూత్ 5.1 లాంటి ఫీచర్స్ ఉన్నాయి.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: 5G Smartphone, Mobile News, Mobiles, POCO, POCO India, Smartphone

    తదుపరి వార్తలు