Home /News /technology /

POCO X4 PRO 5G SALE BEGINS BUY RS 18999 WORTH SMARTPHONE JUST FOR RS 6549 KNOW OFFER DETAILS SS

Poco X4 Pro: రూ.18,999 విలువైన మొబైల్ రూ.6,549 ధరకే... నేటి నుంచే ఆఫర్

Poco X4 Pro: రూ.18,999 విలువైన మొబైల్ రూ.6,549 ధరకే... నేటి నుంచే ఆఫర్
(image: Poco India)

Poco X4 Pro: రూ.18,999 విలువైన మొబైల్ రూ.6,549 ధరకే... నేటి నుంచే ఆఫర్ (image: Poco India)

Poco X4 Pro 5G | పోకో ఎక్స్4 ప్రో 5జీ (Poco X4 Pro 5G) స్మార్ట్‌ఫోన్ సేల్ ఈరోజు ప్రారంభం అయింది. పోకో ఎక్స్2, పోకో ఎక్స్3, పోకో ఎక్స్3 ప్రో యూజర్లు భారీ డిస్కౌంట్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ కొనొచ్చు. ఆఫర్ వివరాలు తెలుసుకోండి.

ఇండియాలో పోకో ఎక్స్3 ప్రో అప్‌గ్రేడ్ వర్షన్ పోకో ఎక్స్4 ప్రో 5జీ (Poco X4 Pro 5G) స్మార్ట్‌ఫోన్ ఇటీవల రిలీజైంది. ఏప్రిల్ 5న సేల్ కూడా ప్రారంభమైంది. ఇందులో పాపులర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్ (Qualcomm Snapdragon 695), అమొలెడ్ డిస్‌ప్లే, 64మెగాపిక్సెల్ కెమెరా సెటప్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 5జీ కనెక్టివిటీ లాంటి ప్రత్యేకతలున్నాయి. పోకో ఎక్స్2, పోకో ఎక్స్3, పోకో ఎక్స్3 ప్రో యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ చేసి పోకో ఎక్స్4 ప్రో 5జీ కొనాలనుకుంటే వారికి అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది కంపెనీ. ఈ స్మార్ట్‌ఫోన్లను ఎక్స్‌ఛేంజ్ చేసి పోకో ఎక్స్4 ప్రో 5జీ బేస్ మోడల్‌ను రూ.6,549 ధరకే సొంతం చేసుకోవచ్చు.

పోకో ఎక్స్4 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ 6జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,999 కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999. హైఎండ్ వేరియంట్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.21,999. పోకో ఎక్స్3 ప్రో ఎక్స్‌ఛేంజ్ చేస్తే రూ.8,450 డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో పాటు అదనంగా రూ.3,000 బంపర్ డిస్కౌంట్ లభిస్తుంది. మొత్తం కలిపి రూ.11,450 డిస్కౌంట్ పొందొచ్చు. ఫైనల్ ఎక్స్‌ఛేంజ్ ధర రూ.7,549. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డుతో కొంటే మరో రూ.1,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అంటే రూ.6,549 చెల్లిస్తే చాలు.

BSNL Plan: ఈ బీఎస్ఎన్ఎల్ ప్లాన్స్‌పై రూ.1,50,000 వరకు ప్రైజ్ మనీ... పూర్తి వివరాలివే


పోకో ఎక్స్2 స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌ఛేంజ్ చేసేవారికి రూ.10,500 ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డుతో కొంటే రూ.1,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. రూ.7,499 చెల్లించి పోకో ఎక్స్4 ప్రో 5జీ బేసిక్ వేరియంట్ సొంతం చేసుకోవచ్చు. ఇక పోకో ఎక్స్3 స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌ఛేంజ్ చేసేవారికి రూ.11,100 ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డుతో కొంటే రూ.1,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. రూ.6,899 చెల్లించి పోకో ఎక్స్4 ప్రో 5జీ బేసిక్ వేరియంట్ సొంతం చేసుకోవచ్చు. ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ మాత్రమే.

పోకో ఎక్స్4 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 120Hz అమొలెడ్ డిస్‌ప్లే ఉంది. ముందు, వెనుక కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉండటం విశేషం. స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇదే ప్రాసెసర్ రెడ్‌మీ నోట్ 11 ప్రో+, వివో టీ1, రియల్‌మీ 9 ప్రో, మోటో జీ71 స్మార్ట్‌ఫోన్లలో కూడా ఉంది.

Oneplus 10 Pro: ఈరోజే వన్‌ప్లస్ 10 ప్రో 5జీ సేల్... ఎస్‌బీఐ కార్డుపై రూ.4,500 డిస్కౌంట్

పోకో ఎక్స్4 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 64మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా + 8మెగాపిక్సెల్ అల్‌ట్రావైడ్ సెన్సార్ + 2మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. పోకో ఎక్స్4 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌లో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 67వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. డ్యూయెల్ స్పీకర్స్, హెడ్‌ఫోన్ జాక్, హైబ్రిడ్ మైక్రోఎస్‌డీ కార్డ్ స్లాట్, బ్లూటూత్ 5.1 లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ 11 + ఎంఐయూఐ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.
Published by:Santhosh Kumar S
First published:

Tags: 5G Smartphone, Mobile News, Mobiles, POCO India, Smartphone

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు