హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Gaming Phones: గేమింగ్ స్మార్ట్​ఫోన్ కొనాలా? ఈ 10 బెస్ట్ స్మార్ట్​‌ఫోన్లపై ఓ లుక్కేయండి

Gaming Phones: గేమింగ్ స్మార్ట్​ఫోన్ కొనాలా? ఈ 10 బెస్ట్ స్మార్ట్​‌ఫోన్లపై ఓ లుక్కేయండి

Gaming Phones | స్మార్ట్‌ఫోన్ కంపెనీలు వీడియో గేమ్స్ ఆడేవారికోసం గేమింగ్ ఫీచర్స్‌ని అందిస్తుంటాయి. మరి ప్రస్తుతం ఉన్న స్మార్ట్‌ఫోన్లలో బెస్ట్ గేమింగ్ స్మార్ట్‌ఫోన్ల గురించి తెలుసుకోండి.

Gaming Phones | స్మార్ట్‌ఫోన్ కంపెనీలు వీడియో గేమ్స్ ఆడేవారికోసం గేమింగ్ ఫీచర్స్‌ని అందిస్తుంటాయి. మరి ప్రస్తుతం ఉన్న స్మార్ట్‌ఫోన్లలో బెస్ట్ గేమింగ్ స్మార్ట్‌ఫోన్ల గురించి తెలుసుకోండి.

Gaming Phones | స్మార్ట్‌ఫోన్ కంపెనీలు వీడియో గేమ్స్ ఆడేవారికోసం గేమింగ్ ఫీచర్స్‌ని అందిస్తుంటాయి. మరి ప్రస్తుతం ఉన్న స్మార్ట్‌ఫోన్లలో బెస్ట్ గేమింగ్ స్మార్ట్‌ఫోన్ల గురించి తెలుసుకోండి.

  మీరు గేమింగ్​ను ఇష్టపడతారా? స్మార్ట్​ఫోన్​ దొరికితే చాలు ఆడేస్తారా?.. మీ లాంటి వారి కోసమే స్మార్ట్​ఫోన్​ కంపెనీలు గేమింగ్ ఫోన్లను విడుదల చేస్తున్నాయి. మార్కెట్​లో అనేక స్మార్ట్​ఫోన్లు ఉన్నప్పటికీ వాటిలో కొన్ని ఫోన్లు మాత్రమే గేమింగ్​కు అనుకూలంగా ఉంటాయి. వీటిలోని ఆకట్టుకునే డిస్​ప్లే, మోడర్న్​ డిజైన్, డ్యూయల్ స్పీకర్లు, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన భారీ బ్యాటరీ, శక్తివంతమైన ప్రాసెసర్ వంటివి మీకు మంచి గేమింగ్​ అనుభవాన్ని అందిస్తాయి. భారత మార్కెట్​లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఉత్తమమైన 10 గేమింగ్ స్మార్ట్​ఫోన్లపై ఓలుక్కేయండి.

  పోకో ఎక్స్ 3 ప్రో


  పోకో ఎక్స్ 3 ప్రో మీ గేమింగ్​ అవసరాలకు సరిగ్గా సరిపోతుంది. భారత మార్కెట్​లో ఇది రూ.18,999 వద్ద లభిస్తుంది. దీనిలో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 860 ప్రాసెసర్‌ను అందించారు. ఇదే ధరల శ్రేణిలో లభిస్తున్న ఇతర ఫోన్లలోని చిప్‌సెట్ల కంటే ఇది శక్తివంతమైనది. ఈ చిప్​సెట్​ స్నాప్‌ డ్రాగన్ 855 ప్రాసెసర్​కు అప్​డేటెడ్​ వెర్షన్. దీనిలో 5,160 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జర్, డ్యూయల్ స్పీకర్లను చేర్చారు. అంతేకాక, దీనిలో120 హెర్ట్జ్​ రిఫ్రెష్ రేట్ కలిగి ఉన్న కార్నింగ్ గొరిల్లా 6 ప్రొటెక్షన్​తో వచ్చే6.67 -అంగుళాల ఫుల్​-హెచ్‌డి + అమోలెడ్ డిస్‌ప్లే అందించారు.

  షావోమీ ఎంఐ 10ఐ


  షావోమీ ఎంఐ 10 ఐ స్మార్ట్​ఫోన్​ గేమింగ్​ ప్రియులకు బెస్ట్​ ఆప్షన్​. భారత మార్కెట్​లో ఇది రూ.20,999లకు లభిస్తుంది. దీనిలో శక్తివంతమైన మిడ్​ రేంజ్​ ప్రాసెసర్‌ను అందించారు. కాబట్టి, దీని పర్ఫార్మెన్స్​ విషయంలో ఎటుంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ స్మార్ట్​ఫోన్​​లో స్టీరియో స్పీకర్లు, 120 హెర్ట్జ్ అడాప్టివ్ సింక్ రిఫ్రెష్ రేట్ డిస్​ప్లే, ఇన్‌బిల్ట్ కూలింగ్​ సిస్టమ్​ వంటి వాటిని అందించారు. ఇది 8 ఎన్ఎమ్ ఆధారిత క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 750 జి ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. దీనిలో 6.7-అంగుళాల డిస్​ప్లే, 108 ఎంపి క్వాడ్ రియర్ కెమెరా సెటప్, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 4,820 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రీమియం ఫీచర్లను చేర్చింది.

  OPPO F19: మీ పాత ఫోన్ ఎక్స్‌ఛేంజ్ చేస్తే ఈ స్మార్ట్‌ఫోన్ రూ.1,990 ధరకే కొనొచ్చు

  Samsung Galaxy F12: కాసేపట్లో సాంసంగ్ గెలాక్సీ ఎఫ్12 సేల్... రూ.1,000 డిస్కౌంట్

  వన్‌ప్లస్ నార్డ్​


  మీ అన్ని గేమింగ్​ అవసరాలకు వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్​ఫోన్​ సరిపోతుంది. భారత మార్కెట్​లో ఇది రూ.25,999లకు లభిస్తుంది. మిడ్​ రేంజ్​లో వచ్చిన ఈ 5 జి స్మార్ట్​ఫోన్​లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 765 జి SoC ప్రాసెసర్​ను అందించారు. ఇది మీకు మంచి గేమింగ్​ ఎక్స్​పీరియన్స్​ అందిస్తుంది. దీనిలో 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.44 -అంగుళాల పూర్తి-హెచ్‌డి + అమోలెడ్ డిస్‌ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్​, స్టీరియో స్పీకర్లు మంచి సౌండ్​ క్వాలిటీతో పాటు బెస్ట్​ స్ట్రీమింగ్​ అనుభవాన్ని ఇస్తాయి. వన్‌ప్లస్ నార్డ్​లో 30W ఫాస్ట్​ ఛార్జింగ్​ సపోర్ట్​తో కూడిన 4,115 ఎంఏహెచ్ బ్యాటరీని చేర్చింది.

  రియల్‌మీ ఎక్స్‌ 7 ప్రో


  రియల్‌మీ X7 ప్రో మీకు మంచి గేమింగ్​ అనుభవాన్ని అందిస్తుంది. దీనిలో మీరు జెన్షిన్ ఇంపాక్ట్, యాస్పాల్ట్​ 9, సబ్వే సర్ఫర్స్ వంటి భారీ ఆటలు​ ఆడుతున్నప్పటికీ ఎటువంటి సమస్యలు రావు. దీనిలో మీడియాటెక్ ఫ్లాగ్‌షిప్ డైమెన్సిటీ 1000+ ప్రాసెసర్, 64 ఎంపి క్వాడ్ రియర్ కెమెరా సెటప్, డాల్బీ అట్మోస్‌కు సపోర్ట్​ కిలిగిన స్టీరియో స్పీకర్లు, 65W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్​ ఉన్న 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి వాటిని చేర్చింది. ఈ స్మార్ట్​ఫోన్​లో​ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, 1,200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో కూడిన 6.55 -అంగుళాల ఫుల్-హెచ్‌డి + అమోలెడ్ డిస్‌ప్లేను అందించారు. భారత మార్కెట్​లో ఇది రూ .29,999 కు లభిస్తుంది.

  Lenovo Legion Duel 2: ఈ స్మార్ట్‌ఫోన్‌లో 2 ఫ్యాన్లు, 2 బ్యాటరీలు ఉన్నాయి... ఎందుకో తెలుసా?

  Samsung Galaxy F02s: ఈరోజే సాంసంగ్ గెలాక్సీ ఎఫ్02ఎస్ ఫస్ట్ సేల్... ధర రూ.8,999

  వివో వి 20 ప్రో


  వివో వి 20 ప్రో స్మార్ట్‌ఫోన్ మీ అన్ని గేమింగ్​ అవసరాలకు సరిగ్గా సరిపోతుంది. ఇది ఫ్లిప్‌కార్ట్‌లో రూ .29,990 కు అమ్ముడవుతోంది. ఇది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 765 జి ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ మిడ్-రేంజ్ 5 జి ఫోన్​లో 6.44-అంగుళాల ఎఫ్‌హెచ్‌డి + డిస్‌ప్లేను అందించారు. ఈ ఫోన్ వెనుక భాగంలో, 64MP సెన్సార్‌ కెమెరాతో సహా మూడు కెమెరాలను చేర్చింది. సెల్ఫీల కోసం ప్రత్యేకంగా మీకు 44MP + 8MP డ్యూయల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలను అందించింది. దీనిలోని 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్​కు సపోర్ట్ ఇస్తుంది.

  వన్‌ప్లస్ 9 ఆర్ / వన్‌ప్లస్ 8 టి


  మీ గేమింగ్​ అవసరాల కోసం వన్‌ప్లస్ 8 టి లేదా వన్‌ప్లస్ 9 ఆర్ కొనుగోలు చేయవచ్చు. భారత మార్కెట్​లో వన్‌ప్లస్ 8 టి రూ .42,999లకు, వన్​ప్లస్​9 ఆర్​ రూ. 39,999లకు లభిస్తుంది. ఈ స్మార్ట్​ఫోన్లు 65W ఛార్జర్, స్నాప్‌డ్రాగన్ 800 సిరీస్ ప్రాసెసర్, 120Hz రిఫ్రెష్ రేట్​తో కపడిన AMOLED డిస్​ప్లేతో వస్తాయి. దీనిలో మీకు 48MP క్వాడ్ రియర్ కెమెరా సెటప్ కలిగిన 4,500mAh బ్యాటరీని కూడా పొందవచ్చు.

  ఆసుస్ ఆర్‌ఓజి ఫోన్ 3


  మీరు బెస్ట్​ గేమింగ్ స్మార్ట్​ఫోన్ కోసం చూస్తున్నట్లయితే, ఆసుస్ ROG ఫోన్ 3 మీ బెస్ట్ ఆప్షన్​. ఇది ఫ్లిప్‌కార్ట్‌లో రూ .41,999 వద్ద అమ్ముడవుతోంది. ఆసుస్ ROG ఫోన్ 3లో 6000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, కూలింగ్​ సిస్టమ్​, క్వాడ్​ మైక్రోఫోన్లు, స్నాప్​డ్రాగన్ 865+ ప్రాసెసర్, 144 హెర్ట్జ్ డిస్‌ప్లే, స్టీరియో స్పీకర్లు, అల్ట్రాసోనిక్ సెన్సార్లు, గ్రిప్ ప్రెస్ వంటి ఫీచర్లను చేర్చింది. ఈ స్మార్ట్​ఫోన్​ 33W ఫాస్ట్ ఛార్జింగ్​ సపోర్ట్​తో వస్తుంది.

  Jio Cricket plans: రేపటి నుంచి ఐపీఎల్... జియో అందిస్తున్న క్రికెట్ ప్లాన్స్ ఇవే

  WhatsApp Stickers: వాట్సప్‌లో వ్యాక్సిన్ స్టిక్కర్స్ భలే ఉన్నాయిగా... మీరూ డౌన్‌లోడ్ చేయండి ఇలా

  శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 20 ఎఫ్‌ఈ


  శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 20 ఎఫ్‌ఈ 5 జి స్మార్ట్‌ఫోన్ మీ అన్ని గేమింగ్​ అవసరాలకు సరిపోతుంది. ఇది భారత మార్కెట్​లో రూ. 47,999కు లభిస్తుంది. దీనిలో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 865 చిప్‌సెట్, వైర్‌లెస్ ఛార్జింగ్ 2.0 సపోర్ట్​, 4,500 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. దీనిలో 25W ఫాస్ట్ ఛార్జర్, 6.5-అంగుళాల ఫుల్​-హెచ్‌డి + అమోలెడ్ డిస్‌ప్లే, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి వాటిని చేర్చింది.

  వన్‌ప్లస్ 9


  వన్‌ప్లస్ 9 బెస్ట్​ గేమింగ్​ స్మార్ట్​ఫోన్లగా ప్రసిద్ధికెక్కింది. ఇది రూ.49,999 వద్ద అమ్ముడవుతోంది. దీనిలో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.55 -అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 SoC, మల్టీ-లేయర్డ్ కూలింగ్​ సిస్టమ్​, డాల్బీ అట్మోస్ సపోర్ట్‌తో కూడిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, ఇన్-డిస్​ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 65 టి ఫాస్ట్​ ఛార్జ్‌కు మద్దతు ఇచ్చే 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి వాటిని చేర్చింది. దీనిలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కూడా అందించింది.

  ఐఫోన్ 12


  ఐఫోన్ 12 ప్రో, ఐఫోన్ 12 ప్రో మాక్స్‌ ఫోన్లు గేమింగ్​కు బెస్ట్​ ఆప్షన్​. భారత మార్కెట్​లో ఐఫోన్ 12 సిరీస్​ ఫోన్లు రూ .79,900లకు లభిస్తుండగా, వీటిని ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ల కింద రూ.63,900 లకే కొనుగోలు చేయవచ్చు. దీనిలో అద్భుతమైన OLED స్క్రీన్, బ్యాక్​ కెమెరా సెటప్, శక్తివంతమైన ఆపిల్ A14 బయోనిక్ ప్రాసెసర్​ను అందించారు.

  First published:

  Tags: 5G Smartphone, Asus, Iphone, Mobile, Mobile News, Mobiles, Oneplus, POCO, POCO India, Realme, Samsung, Smartphone, Smartphones, Vivo, Xiaomi

  ఉత్తమ కథలు