Poco X3 Pro: అదిరిపోయే ఫీచర్స్‌తో పోకో ఎక్స్3 ప్రో వచ్చేసింది... ధర ఎంతంటే

Poco X3 Pro: అదిరిపోయే ఫీచర్స్‌తో పోకో ఎక్స్3 ప్రో వచ్చేసింది... ధర ఎంతంటే (image: Poco India)

Poco X3 Pro | పోకో ఫ్యాన్స్‌కు శుభవార్త. పోకో ఎక్స్3 ప్రో ఇండియాకు వచ్చేసింది. ధర, స్పెసిఫికేషన్స్, ఆఫర్స్ వివరాలు తెలుసుకోండి.

  • Share this:
    భారతదేశంలో పోకో ఇండియా దూకుడుగా కొత్త స్మార్ట్‌ఫోన్లను లాంఛ్ చేస్తోంది. గత నెలలో పోకో ఎం3 రిలీజ్ చేసిన సంగతె తెలిసిందే. ఈ స్మార్ట్‌ఫోన్ సేల్స్‌లో రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పుడు లేటెస్ట్‌గా పోకో ఎక్స్3 ప్రో రిలీజ్ చేసింది. ఇప్పటికే ఇండియన్ మార్కెట్‌లో ఉన్న పోకో ఎక్స్3 అప్‌గ్రేడ్ వేరియంట్ అది. ఫీచర్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ 120Hz డిస్‌ప్లే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 860 ప్రాసెర్, 48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6 లాంటి ప్రత్యేకతలున్నాయి. పోకో ఎక్స్‌3 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో 5160ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 33వాట్ ఫాస్ట్ ఛార్జర్ బాక్సులోనే ఉంటుంది. పోకో ఎక్స్‌3 ప్రో స్మార్ట్‌ఫోన్ 6జీబీ+128జీబీ, 8జీబీ+128జీబీ వేరియంట్లలో రిలీజైంది. ప్రారంభ ధర రూ.18,999. ఏప్రిల్ 6 మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌లో సేల్ మొదలవుతుంది. లాంఛ్ ఆఫర్‌లో భాగంగా ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఇక పోకో ఎక్స్3 ప్రో స్మార్ట్‌ఫోన్ ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న రియల్‌మీ ఎక్స్7, రెడ్‌మీ నోట్ 10 ప్రో, సాంసంగ్ గెలాక్సీ ఎఫ్62 లాంటి మోడల్స్‌కు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.

    Poco M3: నిమిషానికి 8 ఫోన్లు అమ్మిన పోకో ఇండియా... ఈ ఫోన్ ఎందుకంత స్పెషల్?

    Realme Days Sale: ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మీ డేస్ సేల్ ప్రారంభం... ఈ 15 స్మార్ట్‌ఫోన్లపై అదిరిపోయే ఆఫర్స్


    పోకో ఎక్స్3 ప్రో స్పెసిఫికేషన్స్
    డిస్‌ప్లే: 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ 120Hz డిస్‌ప్లే
    ర్యామ్: 6జీబీ, 8జీబీ
    ఇంటర్నల్ స్టోరేజ్: 128జీబీ
    ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 860
    రియర్ కెమెరా: 48 మెగాపిక్సెల్ Sony IMX582 సెన్సార్ + 8 మెగాపిక్సెల్ అల్‌ట్రా వైడ్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్
    ఫ్రంట్ కెమెరా: 20 మెగాపిక్సెల్
    బ్యాటరీ: 5160ఎంఏహెచ్ (33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్)
    ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 11 + ఎంఐయూఐ 12
    సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
    కలర్స్: గోల్డెన్ బ్రాంజ్, గ్రాఫైడ్ బ్లాక్, స్టీల్ బ్లూ
    ధర:
    6జీబీ+128జీబీ- రూ.18,999
    8జీబీ+256జీబీ- రూ.20,999

    ఇక పోకో ఎక్స్‌3 ప్రో లాంఛ్ చేసిన పోకో ఇండియా గతేడాది సెప్టెంబర్‌లో రిలీజ్ చేసిన పోకో ఎక్స్3 ధర తగ్గించింది. పోకో ఎక్స్‌3 స్మార్ట్‌ఫోన్ 6జీబీ+128జీబీ వేరియంట్ ధర ప్రస్తుతం రూ.16,999 ఉండగా ఏప్రిల్ 1 నుంచి రూ.14,999 ధరకే కొనొచ్చు.
    Published by:Santhosh Kumar S
    First published: