Poco X3: ఇండియాలో రిలీజైన పోకో ఎక్స్3... ధర, స్పెసిఫికేషన్స్ వివరాలివే

Poco X3 | పోకో ఇండియా నుంచి మరో స్మార్ట్‌ఫోన్ భారతీయ మార్కెట్లోకి రిలీజ్ అయింది. పోకో ఎక్స్‌3 ధర, స్పెసిఫికేషన్స్, ఇతర వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: September 22, 2020, 1:31 PM IST
Poco X3: ఇండియాలో రిలీజైన పోకో ఎక్స్3... ధర, స్పెసిఫికేషన్స్ వివరాలివే
Poco X3: ఇండియాలో రిలీజైన పోకో ఎక్స్3... ధర, స్పెసిఫికేషన్స్ వివరాలివే (image: Poco India)
  • Share this:
మీరు రూ.20,000 బడ్జెట్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? షావోమీ సబ్‌బ్రాండ్ పోకో ఇండియా ఇండియాలో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. రూ.20,000 లోపు బడ్జెట్‌లో పోకో ఎక్స్3 మోడల్‌ను పరిచయం చేసింది. ఇక ఇటీవల పోకో ఇండియా వరుసగా కొత్త స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేస్తోంది. ఇప్పటికే పోకో ఎం2 ప్రో, పోకో ఎం2 మోడల్స్‌ని పరిచయం చేసింది. రియల్‌మీ, ఒప్పో, వివో, సాంసంగ్ స్మార్ట్‌ఫోన్లకు పోటీ ఇస్తోంది. ఇప్పుడు పోకో ఎక్స్2 అప్‌గ్రేడ్ వర్షన్ పోకో ఎక్స్3 స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 732జీ ప్రాసెసర్, 6000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ప్రత్యేకతలున్నాయి. 6జీబీ+64జీబీ, 6జీబీ+128జీబీ, 8జీబీ+128జీబీ వేరియంట్లలో పోకో ఎక్స్3 రిలీజైంది. సెప్టెంబర్ 29 మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌లో తొలి సేల్ ఉంటుంది.

Realme Narzo 20 Series: రియల్‌మీ నార్జో 20 సిరీస్‌లో 3 స్మార్ట్‌ఫోన్స్... ఏది బెస్ట్ తెలుసుకోండి

Redmi 9i: కాసేపట్లో రెడ్‌మీ 9ఐ సేల్... రూ.10,000 లోపే 4GB+128GB స్మార్ట్‌ఫోన్


పోకో ఎక్స్3 స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 6.67 అంగుళాల పుల్ హెచ్‌డీ+ ఫుల్ స్క్రీన్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్
ర్యామ్: 6జీబీ, 8జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ, 128జీబీ
ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 732జీ
రియర్ కెమెరా: 64 మెగాపిక్సెల్ Sony IMX 682 సెన్సార్ + 13 (అల్ట్రావైడ్)+2 (మ్యాక్రో)+2 (డెప్త్)
ఫ్రంట్ కెమెరా: 20 మెగాపిక్సెల్
బ్యాటరీ: 6000ఎంఏహెచ్ (33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్)
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10 + ఎంఐయూఐ 12
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
కలర్స్: షాడో గ్రే, కోబాల్ట్ బ్లూ
ధర:
6జీబీ+64జీబీ- రూ.16,999
6జీబీ+128జీబీ- రూ.18,499
8జీబీ+128జీబీ- రూ.19,999
Published by: Santhosh Kumar S
First published: September 22, 2020, 1:31 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading