Poco X3 GT: బడ్జెట్ ధరలోనే అద్భుతమైన ఫీచర్లు... పోకో ఎక్స్​3 జీటీ స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది

Poco X3 GT: బడ్జెట్ ధరలోనే అద్భుతమైన ఫీచర్లు... పోకో ఎక్స్​3 జీటీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్

Poco X3 GT | పోకో ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న పోకో ఎక్స్3 జీటీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయింది. కానీ ఇండియన్ ఫ్యాన్స్‌కు ఓ బ్యాడ్ న్యూస్ ఉంది. ఏంటో తెలుసుకోండి.

  • Share this:
రెడ్​మి సబ్​బ్రాంబడ్​ పోకో సంస్థ వరుసగా స్మార్ట్​ఫోన్లను విడుదల చేస్తూ దూకుడుమీదుంది. బడ్జెట్​ ధరలోనే ప్రీమియం ఫీచర్లను అందిస్తుండటంతో పోకో బ్రాండ్​కు మంచి క్రేజ్​ ఏర్పడింది. దీంతో కంపెనీ ఇదే జోరు కొనసాగించేందుకు వరుస పెట్టి మోడళ్లను రిలీజ్​ చేస్తోంది. గత వారం పోకో ఎఫ్​ 3 జిటి మోడల్​ను విడుదల చేయగా.. ఇప్పుడు పోకో ఎక్స్​ 3 జీటీని మార్కెట్​లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ స్మార్ట్​ఫోన్​ రెడ్​మీ నోట్ 10 ప్రో 5జీ​ని పోలి ఉంటుందని తెలుస్తోంది. ఇక, ధర విషయానికి వస్తే..​ పోకో ఎక్స్ 3 జిటి 8 జిబి ర్యామ్​/128 జిబి స్టోరేజ్​ వేరియంట్ $ 299 (సుమారు రూ. 22,000) వద్ద ప్రారంభమవుతుంది. 8 జిబి ర్యామ్​ /256 జిబి వేరియంట్​ $ 329 (సుమారు రూ.24,000) ధర వద్ద లభిస్తుంది. తొలుత ఇది ఆగ్నేయాసియా, మిడిల్ ఈస్ట్​,​ లాటిన్ అమెరికా, ఆఫ్రికా వంటి దేశాల్లో అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఇండియాలో రిలీజ్ అయ్యే అవకాశం లేదు. ఇప్పటికే ఇండియాలో పోకో ఎక్స్3 ప్రో, పోకో ఎఫ్3 జీటీ రిలీజ్ అయ్యాయి. కాబట్టి పోకో ఎక్స్​3 జీటీ రిలీజ్ చేయమని అంటోంది కంపెనీ.

SBI New Feature: ఎస్‌బీఐ కస్టమర్లకు అలర్ట్... వెంటనే ఈ ఫీచర్ వాడుకోండి

Oppo F17: ఒప్పో ఎఫ్17 స్మార్ట్‌ఫోన్‌పై రూ.4,000 తగ్గింపు... ఆఫర్ వివరాలు ఇవే

రెడ్‌మి నోట్ 10 ప్రో రీబ్రాండ్​ వెర్షన్​


స్పెసిఫికేషన్ల పరంగా చూస్తే.. పోకో ఎక్స్​ 3 జీటీ 6.6 అంగుళాల ఫుల్​ హెచ్​డీ ప్లస్​ డిస్​ప్లేతో వస్తుంది. ఈ డిస్​ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, కార్నింగ్​ గొరిల్లాగ్లాస్​ విక్టస్ ప్రొటెక్షన్​ కలిగి ఉంటుంది. కెమెరాల విషయానికి వస్తే.. దీని వెనుక భాగంలో మూడు కెమెరాలతో కూడిన ట్రిపుల్​ కెమెరా సెటప్​ను చేర్చింది. వీటిలో 64 మెగాపిక్సెల్​ ప్రైమరీ సెన్సార్, 8 మెగాపిక్సెల్​ అల్ట్రావైడ్​ లెన్స్​, 2 మెగాపిక్సెల్​ మాక్రో లెన్స్​ కెమెరాలను అందించింది. సెల్ఫీల కోసం దాని ముందు భాగంలో ప్రత్యేకంగా పంచ్ హోల్ కటౌట్‌తో కూడిన16 ఎంపి సెల్ఫీ షూటర్ కెమెరాను అందించింది.

iQoo Z3 5G: ఈ 5జీ స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్... రూ.3,500 తగ్గింపు

Vivo V19: ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.7,000 డిస్కౌంట్... ఆఫర్ వివరాలు తెలుసుకోండి

ఈ స్మార్ట్​ఫోన్​ మీడియాటెక్ డైమెన్సిటీ 1100 ప్రాసెసర్​తో పనిచేస్తుంది. ఇందులో 5,000 mAh బ్యాటరీ, 67W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్ స్పీడ్​ వంటివి అందించింది. ఇది ఆండ్రాయిడ్ 11 ఆధారిత MIUI 12.5 వెర్షన్​తో పనిచేస్తుంది. ఈ ఫీచర్లకు అదనంగా సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, స్టీరియో స్పీకర్లు, ఐఆర్ బ్లాస్టర్ వంటివి అందించింది.
Published by:Santhosh Kumar S
First published: