Poco X2 vs Realme X2: రూ.15,000 బడ్జెట్‌లో ఏది మంచి స్మార్ట్‌ఫోన్? తెలుసుకోండి

Poco X2 vs Realme X2 | పోకో ఎక్స్2, రియల్‌మీ ఎక్స్2 ధరలు చూస్తే పోకో ఎక్స్2 మోడల్ ధర కాస్త తక్కువగా ఉంది. మరి ఈ రెండు ఫోన్ల స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

news18-telugu
Updated: February 8, 2020, 9:57 AM IST
Poco X2 vs Realme X2: రూ.15,000 బడ్జెట్‌లో ఏది మంచి స్మార్ట్‌ఫోన్? తెలుసుకోండి
Poco X2 vs Realme X2: పోకో ఎక్స్2, రియల్‌మీ ఎక్స్2... ఈ రెండు స్మార్ట్‌ఫోన్లలో ఏది బెస్ట్
  • Share this:
పోకో ఫ్యాన్స్ ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పోకో ఎఫ్1 అప్‌గ్రేడ్ వర్షన్ పోకో ఎక్స్2 వచ్చేసింది. ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న రియల్‌మీ ఎక్స్2 మోడల్‌కు పోటీగా పోకో ఎక్స్‌2 స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది షావోమీ సబ్ బ్రాండ్ అయిన పోకో ఇండియా. ఇప్పుడు ఈ రెండు ఫోన్ల మధ్య గట్టి పోటీ నెలకొంది. పోకో ఎక్స్‌2 స్మార్ట్‌ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్, 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 27 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 730జీ ప్రాసెసర్, VoWifi సపోర్ట్ లాంటి ప్రత్యేకతలున్నాయి. రియల్‌మీ ఎక్స్‌2 మోడల్‌లో ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 730జీ ప్రాసెసర్, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, 30W VOOC FLASH CHARGE 4.0, సూపర్ అమొలెడ్ డిస్‌ప్లే, 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా లాంటి ప్రత్యేకతలున్నాయి.

Poco X2 vs Realme X2, Poco X2 vs Realme X2 which is best phone, Poco X2 or Realme X2, Realme X2 price, Realme X2 specifications, Poco X2 features, Poco X2 price, పోకో ఎక్స్2 వర్సెస్ రియల్‌మీ ఎక్స్2, రియల్‌మీ ఎక్స్2 ధర, రియల్‌మీ ఎక్స్2 ఫీచర్స్, రియల్‌మీ ఎక్స్2 స్పెసిఫికేషన్స్, పోకో ఎక్స్2 ఫీచర్స్, పోకో ఎక్స్2 ధర, పోకో ఎక్స్2 స్పెసిఫికేషన్స్

డిజైన్ చూస్తే పోకో ఎక్స్‌2 గ్రేడియంట్ ఫినిష్‌తో వస్తుంది. 3 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. రియల్‌మీ ఎక్స్‌2 డిజైన్ రియల్‌మీ ఎక్స్‌టీ లాగా ఉంటుంది. పోకో ఎక్స్‌2 స్మార్ట్‌ఫోన్‌లో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌తో ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉంది. రియల్‌మీ ఎక్స్‌2 మోడల్‌లో 6.4 అంగుళాల పుల్ హెచ్‌డీ+ అమొలెడ్ డిస్‌ప్లే ఉండటం విశేషం. ఇక ఈ రెండు ఫోన్లలో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 730జీ ప్రాసెసర్లు ఉన్నాయి. రెండు ఫోన్లు 8జీబీ ర్యామ్ వరకు అందుబాటులో ఉన్నాయి. రియల్‌మీ ఎక్స్‌2 స్మార్ట్‌ఫోన్‌లో కలర్ఓఎస్ 7 ఉండగా, పోకో ఎక్స్‌2 మోడల్‌లో ఎంఐయూఐ11 ఓఎస్ ఉంది.

Poco X2 vs Realme X2, Poco X2 vs Realme X2 which is best phone, Poco X2 or Realme X2, Realme X2 price, Realme X2 specifications, Poco X2 features, Poco X2 price, పోకో ఎక్స్2 వర్సెస్ రియల్‌మీ ఎక్స్2, రియల్‌మీ ఎక్స్2 ధర, రియల్‌మీ ఎక్స్2 ఫీచర్స్, రియల్‌మీ ఎక్స్2 స్పెసిఫికేషన్స్, పోకో ఎక్స్2 ఫీచర్స్, పోకో ఎక్స్2 ధర, పోకో ఎక్స్2 స్పెసిఫికేషన్స్

పోకో ఎక్స్‌2 స్మార్ట్‌ఫోన్ 64 మెగాపిక్సెల్ సోనీ IMX686 ప్రైమరీ సెన్సార్‌తో నాలుగు కెమెరాలు, 20+2 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉండగా, రియల్‌మీ ఎక్స్‌2 మోడల్‌లో 64 మెగాపిక్సెల్ సాంసంగ్ GW1 సెన్సార్‌తో నాలుగు కెమెరాలు, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. పోకో ఎక్స్‌2 ఫోన్‌లో 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ 30 వాట్ VOOC 4.0 ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్‌తో ఉండగా, రియల్‌మీ ఎక్స్‌2 స్మార్ట్‌ఫోన్‌లో 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా, 27వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. పోకో ఎక్స్2, రియల్‌మీ ఎక్స్2 స్పెసిఫికేషన్స్ ఈ కింది చార్ట్‌లో పోల్చి చూడొచ్చు.






























































 పోకో ఎక్స్2 రియల్‌మీ ఎక్స్‌2
 డిస్‌ప్లే  6.67 అంగుళాలు  6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమొలెడ్ డిస్‌ప్లే
 ర్యామ్  6జీబీ, 8జీబీ  4జీబీ, 6జీబీ, 8జీబీ
 ఇంటర్నల్ స్టోరేజ్  64జీబీ, 128జీబీ, 256జీబీ  64జీబీ, 128జీబీ
 ప్రాసెసర్  క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 730జీ  క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 730జీ
 రియర్ కెమెరా  64+8+2+2 మెగాపిక్సెల్  64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా
 ఫ్రంట్ కెమెరా  20+2 మెగాపిక్సెల్  32 మెగాపిక్సెల్
 బ్యాటరీ  4,500 ఎంఏహెచ్  4000 ఎంఏహెచ్
 ఆపరేటింగ్ సిస్టమ్  ఆండ్రాయిడ్ 10 + ఎంఐయూఐ 11  ఆండ్రాయిడ్ 9
 సిమ్ సపోర్ట్  డ్యూయెల్ సిమ్  డ్యుయెల్ సిమ్
 కలర్స్  మ్యాట్రిక్స్ పర్పుల్, ఫీనిక్స్ రెడ్, అట్లాంటిస్ బ్లూ  పెరల్ వైట్, పెరల్ బ్లూ, పెరల్ గ్రీన్
 ధర  6జీబీ+64జీబీ- రూ.15,999
6జీబీ+128జీబీ- రూ.16,999
8జీబీ+256జీబీ- రూ.19,999
 4జీబీ+64జీబీ- రూ.16,999
6జీబీ+128జీబీ- రూ.18,999
8జీబీ+128జీబీ- రూ.19,999

ఇవి కూడా చదవండి:

Prize Money: కస్టమర్లకు గుడ్ న్యూస్... రూ.1 కోటి గెలుచుకునే ఛాన్స్

Digital Cash: ఈ టిప్స్‌తో మీ పేటీఎం, ఫోన్‌ పేలో డబ్బులు సేఫ్

Auto Sweep: ఈ టెక్నిక్ తెలిస్తే... మీ బ్యాంక్ అకౌంట్‌లోకి డబుల్ వడ్డీ
Published by: Santhosh Kumar S
First published: February 8, 2020, 9:57 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading