హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Poco F4 5G: త్వరలో మార్కెట్లోకి పోకో F4 5G స్మార్ట్‌ఫోన్..12GB RAMతో పాటు టాప్ ఫీచర్లతో రానున్న డివైజ్

Poco F4 5G: త్వరలో మార్కెట్లోకి పోకో F4 5G స్మార్ట్‌ఫోన్..12GB RAMతో పాటు టాప్ ఫీచర్లతో రానున్న డివైజ్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Poco F4 5G In Market : స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ పోకో (Poco) మరో కొత్త మోడల్‌ గురించి అప్‌డేట్ ఇచ్చింది. పోకో F4 (Poco F4 5G) పేరుతో ఒక డివైజ్‌ను రూపొందిస్తున్నట్లు కంపెనీ గతంలోనే అనౌన్స్ చేసింది. ఇది స్నాప్‌డ్రాగన్ 870 SoC చిప్‌సెట్‌తో రానునట్లు పేర్కొంది. అయితే ఈ ఫోన్‌కు సంబంధించిన మరో విషయం బయటకు వచ్చింది.

ఇంకా చదవండి ...

Poco F4 5G In Market : స్మార్ట్‌ఫోన్(Smart Phone) తయారీ సంస్థ పోకో (Poco) మరో కొత్త మోడల్‌ గురించి అప్‌డేట్ ఇచ్చింది. పోకో F4 (Poco F4 5G) పేరుతో ఒక డివైజ్‌ను రూపొందిస్తున్నట్లు కంపెనీ గతంలోనే అనౌన్స్ చేసింది. ఇది స్నాప్‌డ్రాగన్ 870 SoC చిప్‌సెట్‌తో రానునట్లు పేర్కొంది. అయితే ఈ ఫోన్‌కు సంబంధించిన మరో విషయం బయటకు వచ్చింది. మిడ్ రేంజ్ ఫోన్ల సెగ్మెంట్‌లో పోకో F4 మోడల్ లిక్విడ్‌కూల్ 2.0 హీట్-డిస్సిపేటింగ్ సిస్టమ్‌తో పాటు 12GB LPDDR5 ర్యామ్‌తో వస్తుందని కంపెనీ ప్రకటించింది. ఇది UFS 3.1 స్టోరేజ్‌తో వస్తుందని వెల్లడించింది.

దీనికి సంబంధించి పోకో జూన్ 11న ఒక ట్వీట్ చేసింది. అందులో తాజా ఫోన్ ర్యామ్ కెపాసిటీ గురించి సమాచారాన్ని వెల్లడించింది. ‘మీకు 6GB RAM సరిపోతుందా, అయితే 8GB RAM ఉంటే? అయితే ఇంతకు మించి POCO F4 5G ఫోన్ 12GB LPDDR5 RAMతో వస్తే ఎలా ఉంటుంది? దీని ట్రూ పవర్‌ను ఎక్స్‌పీరియన్స్ చేయడానికి రెడీ అవ్వండి’ అని పోకో ట్వీట్‌లో పేర్కొంది.

Mia Khalifa Car Collection: మియా ఖలీఫా కార్ కలెక్షన్..ఆమె వద్ద ఉన్న హాట్ అండ్ సెక్సీ రేంజ్ కార్లు ఇవే..

https://twitter.com/IndiaPOCO/status/1535554934233604096?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1535554934233604096%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.gsmarena.com%2Fpoco_f4_5g_ram_storage_details-news-54646.php

పోకో F4 5G ఫోన్.. హై రేంజ్ ప్రైమరీ కెమెరాతో వచ్చిన రెడ్‌మీ కే40ఎస్ (Redmi K40S) మోడల్‌కు లేటెస్ట్ వెర్షన్ అని తెలుస్తోంది. ఇది 8GB RAMతో గీక్‌బెంచ్‌లో లిస్ట్ అయింది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా లీక్ అయ్యాయి. ఈ ఫోన్ OIS సపోర్టెడ్ 64MP ప్రైమరీ కెమెరాతో వస్తుందని లీకుల ద్వారా తెలుస్తోంది. రెడ్‌మీ K40S ఫోన్‌ను ఈ మార్చిలో ఆవిష్కరించారు. ఇది 6.67 ఫుల్HD+ 120Hz AMOLED డిస్‌ప్లే, 20MP సెల్ఫీ కెమెరా, సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ రీడర్, స్టీరియో స్పీకర్స్, 67W ఛార్జింగ్‌తో కూడిన 4,500 mAh బ్యాటరీతో రిలీజ్ అయింది. అయితే పోకో F4 5G ఫోన్ లాంచింగ్ ఎప్పుడు అనే విషయంపై కంపెనీ స్పష్టత ఇవ్వలేదు. మరికొన్ని రోజుల్లో పోకో ఈ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ గురించి అధికారిక ప్రకటన వెల్లడించే అవకాశం ఉంది.

పోకో నుంచి వచ్చే F-సిరీస్.. బడ్జెట్ ధరలో ఫ్లాగ్‌షిప్ రేంజ్ హార్డ్‌వేర్‌ను అందిస్తుంది. తాజా F4 5G ఫోన్ కూడా ఇదే రేంజ్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లతో రావచ్చని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ 64MP ప్రైమరీ కెమెరాతో రానుంది. 8MP అల్ట్రా-వైడ్ సెన్సార్, 2MP మాక్రో లెన్స్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో పాటు 20MP సెల్ఫీ స్నాపర్‌తో ఈ ఫోన్ రిలీజ్ కానుంది. ఇది ఆండ్రాయిడ్ 12-బేస్డ్ MIUI 13తో రన్ అవుతుంది.

కలియుగ బకాసురుడు..వండిపెట్టడానికే ఇద్దరు భార్యలు..అతడి తిండికి భయపడి బంధువులు పంక్షన్లకు పిలవట్లేదట!

* పోకో F4 5G ధర, లభ్యత

పోకో F4 5Gని లాంచ్ చేసిన తర్వాతే, దీని ధర, లభ్యత వివరాలు తెలిసే అవకాశం ఉంది. అయితే రెడ్‌మీ K40s ధర చైనాలో CNY 1,799 (సుమారు రూ. 21,000) వద్ద ప్రారంభమవుతుంది. దీన్ని బట్టి చూస్తే.. ఇండియాలో పోకో F4 5G ధర రూ. 30,000 లోపు ఉండవచ్చు.

First published:

Tags: 5g smart phone, New smartphone

ఉత్తమ కథలు