హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Poco M3 Pro: పోకో నుంచి మరో సూపర్ స్మార్ట్ ఫోన్.. ఎల్లుండే మార్కెట్లోకి.. ధర ఎంతంటే?

Poco M3 Pro: పోకో నుంచి మరో సూపర్ స్మార్ట్ ఫోన్.. ఎల్లుండే మార్కెట్లోకి.. ధర ఎంతంటే?

ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ పోకో నుంచి Poco M3 Pro స్మార్ట్ ఫోన్ విడుదలకు సిద్ధమైంది. ఈ ఫోన్ కు సంబంధించిన ధర, స్పెసిఫికేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి.

  ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ పోకో నుంచి త్వరలో మరో స్మార్ట్ ఫోన్ విడుదల కానుంది. సంస్థ నుంచి ఎం 3 ప్రో 5 జి స్మార్ట్‌ఫోన్‌ త్వరలో విడుదలకు సిద్ధమైంది. జూన్ 8 న ఆన్‌లైన్ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి రానుంది. అయితే ఈ ఫోన్ మే నెలలో ప్రపంచవ్యాప్తంగా కొనుగోలుకు అందుబాటులో ఉండగా ఇండియాలోకి ఇప్పుడు విడుల అవుతోంది. పోకో ఎం 3 ప్రో స్మార్ట్‌ఫోన్ జూన్ 8 న ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉండనుంది. ప్రస్తుతానికి, ధర రూ .15 వేలుగా అంచనా వేస్తున్నారు.

  Flipkart Flagship Fest Sale: ఫ్లిప్‌కార్ట్ లో ఆఫర్ల పండగ.. ఈ ఫోన్లపై 5 వేల వరకు డిస్కౌంట్.. రూ. 19 వేల వరకు ఎక్సేంజ్ ఆఫర్

  Vivo: వివో నుంచి మరో సూపర్ స్మార్ట్​ఫోన్ లాంఛ్​.. ధర, స్పెసిఫికేషన్ల వివరాలివే..

  పోకో ఎం 3 ప్రో ప్రత్యేకతలు:

  కొత్త స్మార్ట్‌ఫోన్‌లో 6.5-అంగుళాల ఎఫ్‌హెచ్‌డి + డిస్ప్లే మరియు 90 హెచ్‌జడ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంది. ఈ ఫోన్ 5జీని సపోర్ట్ చేయనుంది. ఈ ఫోన్లో 6 జీబీ ర్యామ్‌తో పాటు, 128 జీబీ స్టోరేజ్‌ ఉంటుంది. పోకో ఎం 3 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా ఉంది .48 మెగాపిక్సెల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా మరియు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ తో పాటు ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.

  Jio Prepaid Plans: కరోనా వేళ జియో బంపరాఫర్.. రూ. 98కే డైలీ 1.5 జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్.. ప్లాన్ వివరాలివే..

  Samsung Galaxy A22: సాంసంగ్ గెలాక్సీ ఏ22 4జీ, 5జీ మోడల్స్ రిలీజ్

  ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో 18 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం ఉంది. ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్ 11 లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో పనిచేస్తుంది. ఈ ఫోన్ లో మూడు రంగుల్లో లభించనుంది. నీలం, నలుపు, పసుపు కలర్లలో అమ్మకానికి ఉంచినట్లు పోకో తెలిపింది.

  First published:

  Tags: 5G Smartphone, POCO, POCO India, Smartphone

  ఉత్తమ కథలు