Home /News /technology /

Poco F3: పోకో నుంచి ఒకేసారి రెండు ఫోన్లు లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లపై ఓ లుక్కేయండి

Poco F3: పోకో నుంచి ఒకేసారి రెండు ఫోన్లు లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లపై ఓ లుక్కేయండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

POCO new Phones: పోకో ఎఫ్​3, పోకో ఎం4ప్రో 5జీ రెండూ ఈ రోజు లాంచ్​ కానున్నాయి. సాయంత్రం 5.30 గంటలకు ఈ లాంచింగ్​ ఈవెంట్​ ప్రారంభం కానుంది.

చైనీస్​ స్మార్ట్​ బ్రాండ్​ పోకో (poco) వరుసగా స్మార్ట్​ఫోన్లు (smart phones) విడుదల చేస్తూ దూకుడుమీదుంది. ఇదే స్పీడ్​తో నేడు (నవంబర్ 9న) ఒకేసారి రెండు స్మార్ట్​ఫోన్లు విడుదల చేయనుంది. పోకో ఎం4 ప్రో 5జీతో పాటు పోకో ఎఫ్​3 (poco f3) స్మార్ట్​ఫోన్​ను సైతం సంస్థ గ్లోబల్​ మార్కెట్​లోకి లాంచ్ చేయనుంది. కంపెనీ తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా పోకో ఎఫ్3 లాంచింగ్​ను ధ్రువీకరించింది. పోకో సంస్థ పోకో ఎఫ్​ 3 డివైజ్‌ను ఈ ఏడాది మార్చిలో ఆవిష్కరించింది. ఇప్పుడు దీనిలో అప్​డేటెడ్ ఫీచర్లు జోడించి మరోసారి మార్కెట్​లోకి అందుబాటులోకి తెస్తుంది. ఈ కొత్త మోడల్​లో మెరుగైన స్పెసిఫికేషన్లు, కెమెరా ఫీచర్లు, ప్రాసెసర్​, బ్యాటరీ వంటివి అందించనుంది.

Smartphone Blast: ఆ స్మార్ట్‌ఫోన్ మళ్లీ పేలింది... ఏ కంపెనీదో తెలుసా?

పోకో ఎఫ్​3, పోకో ఎం4ప్రో 5జీ రెండూ ఈ రోజు లాంచ్​ కానున్నాయి. సాయంత్రం 5.30 గంటలకు ఈ లాంచింగ్​ ఈవెంట్​ ప్రారంభం కానుంది. అయితే పోకో ఎఫ్​ 3 ఫోన్​ ఫీచర్ల గురించి కంపెనీ ఇప్పుటివరకు స్పష్టతనివ్వనప్పటికీ.. ఇది రెడ్​మీ కె40 ప్రోకు రీ బ్రాండ్​ వెర్షన్​గా ఈ ఫోన్​ విడుదల కానుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Smartphone Tips : మీ ఫోన్‌లో ఈ యాప్స్ ఉన్నాయా.. లాభాలేంటో తెలుసా?

* రెడ్​మీ కె40 రీబ్రాండ్​ వెర్షన్​గా పోకో ఎఫ్​3

గ్లోబల్ మార్కెట్‌లోకి పోకో ఎక్స్​ 3 ప్రోతో పాటు పోకో ఎఫ్​3 ఈ ఏడాది మార్చిలో ప్రారంభమైంది. పోకో ఎఫ్​ 3 స్మార్ట్​ఫోన్​ రెడ్​మీ కె40 స్మార్ట్​ఫోన్​కు రీబ్రాండ్​ వెర్షన్​గా వచ్చింది. అయితే ఇప్పుడు లాంచ్​ కానున్న పోకో ఎఫ్​ 3 స్పెసిఫికేషన్లు గతంలో వచ్చిన పోకో ఎఫ్ 3 కంటే అప్​గ్రేడెడ్​ ఫీచర్లతో రానుంది. పోకో ఎఫ్3 స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. ఇది​ ఆండ్రాయిడ్​ 11 ఆధారిత ఎంఐయూఐ 12 ఆపరేటింగ్​ సిస్టమ్​పై పనిచేస్తుంది. ఇది 6.67-అంగుళాల ఫుల్​-హెచ్​డీ+ E4 AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. క్వాల్​కామ్​ స్నాప్‌డ్రాగన్ 870 SoC ప్రాసెసర్​పై పనిచేస్తుంది. దీనిలో 12 జీబీ ర్యామ్​,256 జీబీ వరకు స్టోరేజ్‌ను అందించింది.

KYC Fraud : కేవైసీ పేరుతో మోసాలు.. ఎలా జాగ్ర‌త్త ప‌డాలో తెలుసా?

పోకో ఎఫ్​3 వెనుకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో 48 -మెగాపిక్సెల్ మెయిన్​ కెమెరా, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ షూటర్ కెమెరా, 5- మెగాపిక్సెల్ టెలి-మాక్రో కెమెరాలతో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను అందించింది. ఇక, సెల్ఫీల కోసం, ప్రత్యేకంగా 20-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను చేర్చింది. ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ గల 4,520mAh బ్యాటరీతో వస్తుంది.
Published by:Shiva Kumar Addula
First published:

Tags: POCO, Smart phone, Technology

తదుపరి వార్తలు