చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ కంపెనీ పోకో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. పోకో ఎం5 (Poco M5) మోడల్‌ను గ్లోబల్ మార్కెట్లో లాంఛ్ చేసింది కంపెనీ. ఇండియాలో కూడా ఈ ఫోన్ లాంఛ్ అయింది. రూ.15,000 లోపు బడ్జెట్లో పోటీ ఇచ్చేందుకు రెడీ అంటోంది ఈ మొబైల్. ఇందులో ఇటీవల రిలీజైన మీడియాటెక్ హీలియో జీ99 (MediaTek Helio G99) ప్రాసెసర్, 6GB ర్యామ్, 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ లాంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో (Flipkart Big Billion Days Sale) ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనొచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో అందించబోయే ఆఫర్స్‌ని కూడా ప్రకటించింది పోకో ఇండియా.
పోకో ఎం5 స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో రిలీజైంది. 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,499 కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,499. ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ , డెబిట్ కార్డులతో కొంటే రూ.1,500 ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు. ఈ ఆఫర్‌తో పోకో ఎం5 స్మార్ట్‌ఫోన్ 4జీబీ+64జీబీ వేరియంట్‌ను రూ.10,999 ధరకు, 6జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.12,999 ధరకు సొంతం చేసుకోవచ్చు. బిగ్ బిలియన్ డేస్ స్పెషల్ సేల్ సందర్భంగా సెప్టెంబర్ 13న మధ్యాహ్నం 1 గంట నుంచి కొనొచ్చు. పోకో ఎల్లో, ఐసీ బ్లూ, పవర్ బ్లాక్ కలర్స్‌లో కొనొచ్చు.
#POCOM5 is all about power, efficiency, premium Leather-like ???? looks, great cameras, unbeatable features and MAD pricing!
But when will it be yours?
Mark your calendars, and update your Flipkart wishlist cause the SALE STARTS ON 13TH SEPTEMBER @ 1PM ✨ pic.twitter.com/72WUYoBhqr
— POCO India | #BuiltToOutperform (@IndiaPOCO) September 5, 2022
పోకో ఎం5 స్పెసిఫికేషన్స్
పోకో ఎం5 స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.58 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఉంది. వెనుకవైపు లెదర్ లాంటి టెక్స్చర్ ఉంటుంది. ఇందులో టర్బో ర్యామ్ ఫీచర్ ఉంది. ఈ ఫీచర్‌తో 2జీబీ ర్యామ్ పెంచుకోవచ్చు. ఎంఐయూఐ 13 + ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.
పోకో ఎం5 స్మార్ట్‌ఫోన్ కెమెరా ఫీచర్స్ చూస్తే ఇందులో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా + 2మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ + 2మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లతో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఇందులో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా, 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇది 4జీ స్మార్ట్‌ఫోన్. డ్యూయెల్ బ్యాండ్ వైఫై, 3.5ఎంఎం జాక్, బ్లూటూత్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.
పోకో ఎం5 స్మార్ట్‌ఫోన్‌తో పాటు పోకో ఎం5ఎస్ మోడల్ కూడా లాంఛైంది. కానీ ఈ స్మార్ట్‌ఫోన్ ఇండియాలో రిలీజ్ కాలేదు. భారతదేశంలో ఈ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అవుతుందా లేదా అన్న స్పష్టత లేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: POCO, POCO India, Smartphone