స్మార్ట్ బ్రాండ్ పోకో (Poco) నుంచి సరికొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది. పోకో ఎమ్5 పేరుతో (Poco M5) పేరుతో వచ్చిన ఈ డివైజ్‌లో తక్కువ ధరలోనే మంచి ఫీచర్లను కంపెనీ అందించింది. గ్లోబల్ మార్కెట్లో కూడా ఈ బడ్జెట్ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. పోకో M-సిరీస్‌లో నెక్స్ట్ ప్రొడక్ట్‌గా పోకో M5 నిలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రీమియం లెదర్ లాంటి ఫినిషింగ్, మల్టిపుల్ కెమెరాలు, గేమింగ్-సెంట్రిక్ ప్రాసెసర్, లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ, టూ-టోన్ కలర్ స్కీమ్ వంటి బెస్ట్ ఫీచర్లను అందిస్తోంది.
స్పెసిఫికేషన్లు
పోకో M5 హ్యాండ్సెట్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.58-అంగుళాల FHD+ డిస్ప్లేతో అందుబాటులోకి వచ్చింది. ఇది మీడియాటెక్ హీలియో G99 చిప్సెట్తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5,000mAh బ్యాటరీతో వస్తుంది. Poco M5లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది, ఇందులో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ షూటర్, 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2-మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ ఉన్నాయి. వీటితోపాటు 8-మెగాపిక్సెల్ సెల్ఫీ స్నాపర్‌ను కూడా పోకో అందించింది. 4G LTE, Wi-Fi, బ్లూటూత్ v5.3, NFC, IR బ్లాస్టర్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, USB టైప్-C పోర్ట్ వంటి కనెక్టివిటీ ఫీచర్లతో వచ్చిన తాజా ఫోన్ ఆండ్రాయిడ్ 12-బేస్ట్ MIUI 13తో రన్ అవుతుంది.
Phone Launches: సెప్టెంబర్‌లో ఐఫోన్ 14తో పాటు అదిరిపోయే మరెన్నో ఫోన్లు లాంచ్.. ఓ లుక్కేయండి..
ధర, లభ్యత
పోకో M5 ఒక బడ్జెట్ స్మార్ట్‌ఫోన్. దీని బేస్ వేరియంట్ అయిన 4GB RAM + 64GB ఇంటర్నల్ స్టోరేజ్ మోడల్ ధర రూ.12,499గా ఉంది. 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ.14,499కు లభిస్తుంది. పోకో M5 స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ నుంచి కొనుగోలు చేయవచ్చు. సెప్టెంబర్ 13 నుంచి సేల్స్ ప్రారంభం కానున్నాయి. అదేరోజు మధ్యాహ్నం 1 గంటలకు ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభించే అవకాశం ఉంది. ఈ సందర్భంగానే ఫోన్‌ను లాంచ్ చేస్తున్నారని సమాచారం. ఈ స్మార్ట్‌ఫోన్ ఐసీ బ్లూ, పవర్ బ్లాక్, ఎల్లో కలర్ ఆప్షన్లలో లాంచ్ అయింది.
రూ.1,500 ఇన్స్టాంట్ డిస్కౌంట్
పోకో M5 కొనుగోలుపై ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ కార్డ్ హోల్డర్లు రూ.1,500 ఇన్స్టాంట్ డిస్కౌంట్ పొందవచ్చు. అయితే మొదటి 10,000 మంది కొనుగోలుదారులు ఒక సంవత్సరం డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందవచ్చు. బడ్జెట్ రేంజ్లో ఆకట్టుకొనే ఫీచర్లతో వచ్చిన పోకో M5 స్మార్ట్‌ఫోన్‌ను బ్యాంక్ ఆఫర్లతో బెస్ట్ ప్రైస్‌కు సొంతం చేసుకునే అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5G Smartphone, New smartphone, POCO India