Home /News /technology /

POCO M4 PRO 5G SMARTPHONE TO LAUNCH ON NOVEMBER 9 KNOW PRICE AND SPECIFICATIONS SS GH

Poco M4 Pro 5G: నవంబర్​ 9న పోకో ఎం4 ప్రో 5జీ లాంఛింగ్... స్పెసిఫికేషన్స్ ఇవే

Poco M4 Pro 5G: నవంబర్​ 9న పోకో ఎం4 ప్రో 5జీ లాంఛింగ్... స్పెసిఫికేషన్స్ ఇవే

Poco M4 Pro 5G: నవంబర్​ 9న పోకో ఎం4 ప్రో 5జీ లాంఛింగ్... స్పెసిఫికేషన్స్ ఇవే

Poco M4 Pro 5G | పోకో ఫ్యాన్స్‌కు శుభవార్త. పోకో నుంచి పోకో ఎం4 ప్రో 5జీ (Poco M4 Pro 5G) స్మార్ట్‌ఫోన్ రాబోతోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు, ఫీచర్స్ తెలుసుకోండి.

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్​​ తయారీ సంస్థ పోకో (Poco) మరో మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. పోకో ఎం4 ప్రో 5G (Poco M4 Pro 5G) పేరుతో నవంబర్ 9న కొత్త స్మార్ట్‌ఫోన్‌ గ్లోబల్ మార్కెట్​లోకి అందుబాటులోకి రానుంది. అయితే భారత్​లో ఎప్పుడు లాంచ్​ అవుతుందనే విషయంపై స్పష్టత లేదు. లాంచింగ్​ ఈవెంట్​లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పోకో నుంచి జులైలో విడుదలైన పోకో M3 ప్రో (Poco M3 Pro) మోడల్‌కు ఇది కొనసాగింపుగా రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ రెడ్‌మి నోట్ 11 రీబ్రాండెడ్ వెర్షన్​గా విడుదలవుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే పోకో దీన్ని ఇంకా ధ్రువీకరించలేదు. కానీ ఈ రెండింటిలో ఒకే రకమైన స్పెసిఫికేషన్లు ఉండే అవకాశం ఉంది.

WhatsApp Tips: ఈ సింపుల్ టిప్స్‌తో వాట్సప్ బ్యాక్‌గ్రౌండ్ మార్చండి ఇలా


పోకో ఎం4 ప్రో ఇండియా ధర


భారత మార్కెట్​లో పోకో ఎం4 ప్రో 5G ధరపై ప్రస్తుతానికి ఎటువంటి స్పష్టత లేదు. అయితే దీని ధర రెడ్​మీ నోట్​ 11 మాదిరిగానే ఉండే అవకాశం ఉంది. రెడ్​మీ నోట్​ 11 చైనాలో CNY 1199 (సుమారు రూ. 14,000) వద్ద లభిస్తోంది. ఇక ప్రస్తుతం ఇండియాలో పోకో నుంచి పోకో ఎం2 రీలోడెడ్, పోకో ఎం2, పోకో ఎం2 ప్రో, పోకో ఎం3, పోకో ఎం3 ప్రో 5జీ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి.

WhatsApp Chat Leaks: వాట్సప్ యూజర్లకు అలర్ట్​​... మీ చాట్స్ లీక్ అవ్వకుండా ఇలా జాగ్రత్త పడండి

పోకో ఎం4 ప్రో ఫీచర్లు


నవంబర్ 9న జరిగే లాంచింగ్​ ఈవెంట్​కు సంబంధించిన టీజర్​ను పోకో తాజాగా విడుదల చేసింది. దీనిలో పేర్కొన్న స్పెసిఫికేషన్లను పరిశీలిస్తే.. పోకో ఎం4 ప్రో స్మార్ట్​ఫోన్​ 6.6 అంగుళాల ఐపీఎస్​ ఎల్​సీడీ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 2.4GHz ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెసిటీ 810 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ గరిష్టంగా 8GB ర్యామ్​, 256GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్​తో వస్తుంది. పోకో ఎం4 ప్రో 5G 50 -మెగాపిక్సెల్ ప్రైమరీ లెన్స్, 8 -మెగాపిక్సెల్ డ్యుయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. దీని ముందు భాగంలో సెల్ఫీల కోసం ప్రత్యేకంగా16- మెగాపిక్సెల్ షూటర్‌ కెమెరాను చేర్చింది. ఈ స్మార్ట్​ఫోన్​ 5000mAh బ్యాటరీతో వస్తుంది. ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్​కు మద్దతిస్తుంది.
Published by:Santhosh Kumar S
First published:

Tags: 5G Smartphone, Mobile News, Mobiles, POCO, POCO India, Smartphone

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు