Home /News /technology /

POCO M4 PRO 5G SMARTPHONE LAUNCHED WITH MEDIATEK DIMENSITY 810 PROCESSOR KNOW PRICE AND SPECIFICATIONS SS GH

Poco M4 Pro 5G: పోకో ఎం4 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ లాంచ్... 50MP కెమెరా, 5,000mAh బ్యాటరీ, మరెన్నో ఫీచర్లు

Poco M4 Pro 5G: పోకో ఎం4 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ లాంచ్... 50MP కెమెరా, 5,000mAh బ్యాటరీ, మరెన్నో ఫీచర్లు

Poco M4 Pro 5G: పోకో ఎం4 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ లాంచ్... 50MP కెమెరా, 5,000mAh బ్యాటరీ, మరెన్నో ఫీచర్లు

Poco M4 Pro 5G | గ్లోబల్ మార్కెట్‌లో పోకో ఎం4 ప్రో 5జీ (Poco M4 Pro 5G) స్మార్ట్‌ఫోన్ లాంఛ్ అయింది. 50 మెగాపిక్సెల్ కెమెరా, 5,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ లాంటి ప్రత్యేకతలున్నాయి. స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి.

షావోమీ సబ్ బ్రాండ్ పోకో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. పోకో ఎం4 ప్రో 5జీ (Poco M4 Pro 5G) పేరుతో దీన్ని యూరప్‌లో లాంచ్ చేసింది. గత నెలలో చైనాలో లాంచ్ అయిన రెడ్‌మీ నోట్ 11 5G (Redmi Note 11 5G) స్మార్ట్‌ఫోన్‌కు ఇది రీబ్రాండెడ్ వెర్షన్‌గా భావిస్తున్నారు. పోకో ఎం3 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను ఆరు నెలల క్రితమే విడుదల చేసింది. దీనికి అప్‌డేటెడ్ వెర్షన్‌గా పోకో ఎం4 ప్రో 5జీ డివైజ్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. పాత మోడల్ కంటే కొంచెం పెద్దదైన 6.6 అంగుళాల 90Hz FHD+ LCD డిస్‌ప్లేను దీంట్లో అందించారు. దీంతోపాటు మరికొన్ని అప్‌గ్రేడ్‌లతో డివైజ్‌ను అభివృద్ధి చేశారు. ప్యానెల్‌కు సెక్యూరిటీ కల్పించే గొరిల్లా గ్లాస్- 3తో, ఆకట్టుకునే పంచ్-హోల్ నాచ్, ఫోన్ అన్నివైపులా ఉన్న స్లిమ్‌లైన్ బెజెల్స్ వంటివి అప్‌డేటెడ్ ఫీచర్లతో ఈ డివైజ్ స్మార్ట్‌ఫోన్ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది.

Smartphone Blast: జేబులో పేలిన స్మార్ట్‌ఫోన్... రీఫండ్ ఇచ్చిన కంపెనీ


పోకో ఎం4 ప్రో 5జీ స్పెసిఫికేషన్స్


పోకో M4 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 810 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. 64GB, 128GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లు.. 4GB లేదా 6GB RAM ఆప్షన్లతో ఈ ఫోన్లు లభిస్తున్నాయి. మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను పొడిగించుకోవచ్చు. దీంతోపాటు 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 5,000mAh ఇంటర్నల్ బ్యాటరీ, 3.5mm హెడ్‌ఫోన్ పోర్ట్‌, సైడ్-మౌంటెడ్ కెపాసిటివ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్.. వంటి అధునాతన ఫీచర్లను ఈ ఫోన్‌లో చేర్చింది.

WhatsApp Tricks: వాట్సప్‌లో ఎవరైనా విసిగిస్తున్నారా? వాళ్లకు తెలియకుండా ఇలా చేయండి

పోకో ఎం4 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌ 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సార్‌తో లభిస్తుంది. రియర్ కెమెరా సెటప్‌లో మరికొన్ని లెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్‌లో 16 మెగాపిక్సెల్‌ సెల్ఫీ కెమెరా సైతం ఉంది. పోకో ఎం4 ప్రో 5జీ డివైజ్‌లో ఆండ్రాయిడ్ 11 ఓఎస్ ఇన్‌స్టాల్ చేసి ఉంటుంది. అయితే ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌కు ఎప్పుడు అప్‌డేట్ వస్తుందనే విషయంపై స్పష్టత లేదు.

పోకో ఎం4 ప్రో 5జీ 4GB ర్యామ్, 64GB స్టోరేజ్ వెర్షన్ ధర €230 (సుమారు రూ.19,600) నుంచి ప్రారంభమవుతుంది. 6GB, 128 GB వేరియంట్ ధర €250గా (రూ.19,600) ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ పవర్ బ్లాక్, కూల్ బ్లూ, పోకో యెల్లో వంటి మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. అయితే ఈ ఫోన్‌ భారత్‌లో ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే వివరాలను సంస్థ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
Published by:Santhosh Kumar S
First published:

Tags: 5G Smartphone, Mobile News, Mobiles, POCO, POCO India, Smartphone

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు