Home /News /technology /

POCO M4 PRO 5G SMARTPHONE LAUNCHED IN INDIA WITH MEDIATEK DIMENSITY 810 PROCESSOR KNOW PRICE AND SPECIFICATIONS SS

Poco M4 Pro 5G: డైమెన్సిటీ ప్రాసెసర్‌తో పోకో ఎం4 ప్రో రిలీజ్... ధర ఎంతంటే

Poco M4 Pro 5G: డైమెన్సిటీ ప్రాసెసర్‌తో పోకో ఎం4 ప్రో రిలీజ్... ధర ఎంతంటే
(image: Poco India)

Poco M4 Pro 5G: డైమెన్సిటీ ప్రాసెసర్‌తో పోకో ఎం4 ప్రో రిలీజ్... ధర ఎంతంటే (image: Poco India)

Poco M4 Pro 5G | రూ.20,000 5జీ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? పోకో ఇండియా నుంచి పోకో ఎం4 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ (5G Smartphone) రిలీజ్ అయింది. ధర, స్పెసిఫికేషన్స్, సేల్ వివరాలు తెలుసుకోండి.

    పోకో ఇండియా భారతీయ మార్కెట్లోకి పోకో ఎం4 ప్రో 5జీ (Poco M4 Pro 5G) స్మార్ట్‌ఫోన్‌ను లాంఛ్ చేసింది. ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్ యూరప్ మార్కెట్లో గతేడాది రిలీజ్ అయిన సంగతి తెలిసిందే ఇప్పుడు పోకో ఎం4 ప్రో 5జీ మోడల్‌ను ఇండియన్ మార్కెట్‌కు పరిచయం చేసింది. రూ.20,000 లోపు సెగ్మెంట్‌ను (5G Smartphone Under Rs 20000) దృష్టిలో పెట్టుకొని పోకో ఎం4 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్, 5,000ఎంఏఏహెచ్ బ్యాటరీ, 50మెగాపిక్సెల్ కెమెరా, డ్యూయెల్ స్పీకర్ సెటప్ లాంటి ప్రత్యేకతలున్నాయి. పోకో ఎం4 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ మూడు వేరియంట్లలో రిలీజ్ అయింది. 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999 కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999. ఇక హైఎండ్ వేరియంట్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ధర రూ.18,999.

    పోకో ఎం4 ప్రో 5జీ సేల్


    ఇప్పటికే ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో రూ.20,000 లోపు బడ్జెట్‌లో రియల్‌మీ 8, రెడ్‌మీ నోట్ 11టీ, వివో టీ1, ఐకూ జెడ్3, మోటో జీ71 లాంటి 5జీ మోడల్స్ ఉన్నాయి. వీటికి పోకో ఎం4 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ గట్టి పోటీ ఇవ్వనుంది. ఫిబ్రవరి 22న ఫ్లిప్‌కార్ట్‌లో పోకో ఎం4 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ సేల్ ప్రారంభం కానుంది.

    Smartphone Offer: ఈ స్మార్ట్‌ఫోన్ కొంటే రూ.1,999 విలువైన పవర్ బ్యాంక్ ఉచితం


    పోకో ఎం4 ప్రో 5జీ స్పెసిఫికేషన్స్


    పోకో ఎం4 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6 అంగుళాల డాట్ డిస్‌ప్లే ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇదే ప్రాసెసర్ రెడ్‌మీ నోట్ 11టీ, వివో వీ23ఈ 5జీ, లావా అగ్ని 5జీ, రియల్‌మీ 8ఎస్ 5జీ స్మార్ట్‌ఫోన్లలో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 4జీబీ+64జీబీ, 6జీబీ+128జీబీ, 8జీబీ+128జీబీ వేరియంట్లలో లభిస్తుంది. ర్యామ్ ఎక్స్‌ప్యాన్షన్ ఫీచర్‌తో ర్యామ్ పెంచుకోవచ్చు. ఇక మైక్రోఎస్‌డీ కార్డ్ ఆప్షన్‌తో 1టీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు.

    Vivo T1 5G: వివో టీ1 స్మార్ట్‌ఫోన్ సేల్ ప్రారంభం... తొలి సేల్‌లో డిస్కౌంట్ ఆఫర్

    పోకో ఎం4 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 8 మెగాపిక్సెల్ అల్‌ట్రా వైడ్ లెన్స్ + 5 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్‌లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఇందులో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఆండ్రాయిడ్ 11 + ఎంఐయూఐ 12.5 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 5జీ, 4జీ ఎల్‌టీఈ, యూఎస్‌బీ టైప్ సీ, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ లాంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. పవర్ బ్లాక్, కూల్ బ్లూ, పోకో ఎల్లో కలర్స్‌లో కొనొచ్చు.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: 5G Smartphone, Mobile News, Mobiles, POCO, POCO India, Smartphone

    తదుపరి వార్తలు