కొద్ది రోజుల క్రితం ఇండియాలో పోకో ఎం4 ప్రో 5జీ (Poco M4 Pro 5G) స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్, 5,000ఎంఏఏహెచ్ బ్యాటరీ, 50మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్, 5,000ఎంఏహెచ్ లాంటి ప్రత్యేకతలతో పోకో ఎం4 ప్రో 5జీ రిలీజైంది. ఇప్పుడు పోకో ఎం4 ప్రో 4జీ మోడల్‌ను భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌కు పరిచయం చేసింది పోకో ఇండియా. ఇందులో అమొలెడ్ డిస్ప్లే, గేమింగ్ ప్రాసెసర్ లాంటి ప్రత్యేకతలున్నాయి. పోకో ఎం4 ప్రో 4జీ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ హీలియో జీ96 ప్రాసెసర్ ఉంది. ఇటీవల రిలీజ్ అయిన రియల్మీ నార్జో 50 (Realme Narzo 50), రెడ్మీ నోట్ 11ఎస్ (Redmi Note 11S) మోడల్స్‌లో కూడా ఇదే ప్రాసెసర్ ఉంది. వీటికి పోటీ ఇవ్వనుంది పోకో ఎం4 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్.
పోకో ఎం4 ప్రో 4జీ స్మార్ట్‌ఫోన్ 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999 కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,499. ఇక హైఎండ్ వేరియంట్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ధర రూ.17,999. ఇంట్రడక్టరీ ఆఫర్ కింద రూ.1,000 తగ్గింపు లభిస్తుంది. పోకో ఎం4 ప్రో 4జీ స్మార్ట్‌ఫోన్ 4జీబీ+64జీబీ వేరియంట్‌ను రూ.13,999 ధరకు, 6జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.15,499 ధరకు, 8జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.16,999 ధరకు సొంతం చేసుకోవచ్చు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డుతో కొంటే రూ.1000 తగ్గింపు లభిస్తుంది. మార్చి 7 మధ్యాహ్నం 12 గంటలకు సేల్ మొదలవుతుంది. పోకో ఎల్లో, కూల్ బ్లూ, పవర్ బ్లాక్ కలర్స్‌లో కొనొచ్చు.
Apple iPhone: కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటారా? కాస్త ఆగండి... రూ.20,000 లోపు ఐఫోన్ వచ్చేస్తోంది
We won’t go without mentioning how much the most electrifying smartphone in phone entertainment is gonna cost you! And trust us, it won’t be much: #POCOM4Pro comes in three variants -6GB/64GB (13999) 6GB/128GB (15499) and 8GB/128GB (16999). Your chance to #StepUpUrFun begins now! pic.twitter.com/zh6XN3hT1f
— POCO India (@IndiaPOCO) February 28, 2022
పోకో ఎం4 ప్రో 4జీ స్పెసిఫికేషన్స్ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.43 అంగుళాల సూపర్ అమొలెడ్ డిస్ప్లే ఉంది. తొలిసారి పోకో ఎం సిరీస్‌లో అమొలెడ్ డిస్ప్లే ఉండటం విశేషం. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ హీలియో జీ96 గేమింగ్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 4జీబీ+64జీబీ, 6జీబీ+128జీబీ, 8జీబీ+128జీబీ వేరియంట్లలో రిలీజైంది. టర్బోర్యామ్ ఫీచర్‌తో 11జీబీ వరకు ర్యామ్ పెంచుకోవచ్చు.
Xiaomi 11 Lite NE 5G: ఈ 5జీ మొబైల్‌పై రూ.7,000 తగ్గింపు... ఇంకొన్ని గంటలే ఆఫర్
పోకో ఎం4 ప్రో 4జీ స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 64మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 8మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా సెన్సార్లతో వెనుకవైపు మూడు కెమెరాలున్నాయి. సెల్ఫీలు, వీడియోకాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఇందులో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 11 + ఎంఐయూఐ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. డ్యూయెల్ స్టీరియో స్పీకర్స్, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, బ్లూటూత్ 5.0 లాంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5G Smartphone, HDFC bank, Mobile News, Mobiles, POCO, Smartphone