ఇండియా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి మరో 5జీ స్మార్ట్‌ఫోన్ (5G Smartphone) వస్తోంది. ఏప్రిల్ 29న పోకో ఇండియా నుంచి పోకో ఎం4 5జీ (Poco M4 5G) రిలీజ్ కానుంది. గతేడాది బాగా పాపులర్ అయిన పోకో ఎం3 స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ వేరియంట్‌గా పోకో ఎం4 5జీ స్మార్ట్‌ఫోన్ విడుదల కానుంది. ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన స్పెసిఫికేషన్స్ ప్రచారంలో ఉన్నాయి. పోకో ఎం4 5జీ స్మార్ట్‌ఫోన్ రూ.13,999 ధర నుంచి అందుబాటులో ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే ఇప్పటికే ఈ బడ్జెట్‌లో ఉన్న వివో టీ1, ఐకూ జెడ్6, రెడ్‌మీ నోట్ 10టీ 5జీ లాంటి మోడల్స్‌కు గట్టి పోటీ ఇవ్వనుంది. పోకో ఎం4 5జీ స్మార్ట్‌ఫోన్ ధర ఎంత ఉంటుందన్నది రిలీజ్ రోజు తెలుస్తుంది.
పోకో ఎం4 5జీ స్మార్ట్‌ఫోన్ గురించి ప్రస్తుతం ప్రచారంలో ఉన్న స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.58 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇదే ప్రాసెసర్ వివో వై75, సాంసంగ్ గెలాక్సీ ఎఫ్42, రెడ్‌మీ నోట్ 10టీ, రియల్‌మీ నార్జో 30 స్మార్ట్‌ఫోన్లలో ఉంది.
Nokia G21: ఒకసారి ఛార్జింగ్ చేస్తే 3 రోజుల బ్యాటరీ బ్యాకప్... నోకియా జీ21 స్మార్ట్‌ఫోన్ రిలీజ్
We've coMe a long way with the crowd favourite POCO M series. But, the journey isn't over yet as the gates to #POCOM45G opens on 29.04.2022. #KillerLooksOPPerformer pic.twitter.com/F6X1g7x9b0
— POCO India (@IndiaPOCO) April 27, 2022
పోకో ఎం4 5జీ స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయెల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 2మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్లతో వెనుకవైపు రెండు కెమెరాలు ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 12 + ఎంఐయూఐ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.
Amazon Offer: ఈ స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్... రూ.1,799 విలువైన ఇయర్‌బడ్స్ ఉచితం
ఇక ఇప్పటికే ఇండియాలో పోకో ఎం4 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజైన సంగతి తెలిసిందేపోకో ఎం4 ప్రో 4జీ స్మార్ట్‌ఫోన్ 4జీబీ+ 64జీబీ వేరియంట్ ధర రూ.14,999 కాగా, 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.16,999. హైఎండ్ వేరియంట్ 8జీబీ+128జీబీ ధర రూ.18,999. ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.43 అంగుళాల సూపర్ అమొలెడ్, మీడియాటెక్ హీలియో జీ96 గేమింగ్ ప్రాసెసర్, 64మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ప్రత్యేకతలు ఉన్నాయి.
పోకో ఎం4 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 11 + ఎంఐయూఐ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. టర్బోర్యామ్ ఫీచర్‌తో 11జీబీ వరకు ర్యామ్ పెంచుకోవచ్చు. డ్యూయెల్ స్టీరియో స్పీకర్స్, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, బ్లూటూత్ 5.0 లాంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5G Smartphone, Mobile News, Mobiles, POCO, POCO India, Smartphone