హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Poco M4 5G: పోకో ఎం4 5జీ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది... రూ15,000 లోపే 6GB+128GB మొబైల్

Poco M4 5G: పోకో ఎం4 5జీ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది... రూ15,000 లోపే 6GB+128GB మొబైల్

Poco M4 5G: పోకో ఎం4 5జీ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది... రూ15,000 లోపే 6GB+128GB మొబైల్
(image: Poco India)

Poco M4 5G: పోకో ఎం4 5జీ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది... రూ15,000 లోపే 6GB+128GB మొబైల్ (image: Poco India)

Poco M4 5G | మరో 5జీ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. పోకో ఇండియా పోకో ఎం4 5జీ మొబైల్‌ను రిలీజ్ చేసింది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్ ఉండటం విశేషం. కేవలం రూ.15,000 లోపే 6GB+128GB మొబైల్ కొనొచ్చు.

పోకో ఇండియా నుంచి భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి మరో 5జీ స్మార్ట్‌ఫోన్ (5G Smartphone) రిలీజైంది. పోకో ఎం4 5జీ (Poco M4 5G) మోడల్‌ను పరిచయం చేసింది. గతేడాది బాగా పాపులర్ అయిన పోకో ఎం3 స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ వేరియంట్ ఇది. ఈసారి పోకో ఇండియా 5జీ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేయడం విశేషం. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 90Hz డిస్‌ప్లే, 50మెగాపిక్సెల్ కెమెరా సెటప్ లాంటి ప్రత్యేకతలు ఉన్నాయి. రూ.15,000 లోపు బడ్జెట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ రిలీజైంది. ఇదే బడ్జెట్‌లో 6GB+128GB మొబైల్ సొంతం చేసుకోవచ్చు. ఇప్పటికే రూ.15,000 లోపు బడ్జెట్‌లో ఉన్న వివో టీ1, రెడ్‌మీ నోట్ 10టీ, మోటో జీ51 లాంటి మోడల్స్‌కు గట్టి పోటీ ఇవ్వనుంది.

పోకో ఎం4 5జీ ధర


పోకో ఎం4 5జీ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో రిలీజైంది. 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999 కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999. బ్లాక్, బ్లూ, ఎల్లో కలర్స్‌లో ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుతో కొంటే రూ.2,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్‌తో 4జీబీ+64జీబీ వేరియంట్‌ను రూ.10,999 ధరకు, 6జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.12,999 ధరకు సొంతం చేసుకోవచ్చు. మే 5న సేల్ ప్రారంభం అవుతుంది. ఫ్లిప్‌కార్ట్‌లో కొనొచ్చు.

OnePlus: వన్‌ప్లస్ సంచలనం... తొలిసారి రూ.20,000 లోపు స్మార్ట్‌ఫోన్ రిలీజ్

పోకో ఎం4 5జీ స్పెసిఫికేషన్స్


పోకో ఎం4 5జీ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.58 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇదే ప్రాసెసర్ వివో వై75, సాంసంగ్ గెలాక్సీ ఎఫ్42, రెడ్‌మీ నోట్ 10టీ, రియల్‌మీ నార్జో 30 స్మార్ట్‌ఫోన్లలో ఉంది.

Samsung Galaxy M53 5G: సాంసంగ్ గెలాక్సీ ఎం53 5జీ సేల్ ఈరోజే... భారీ డిస్కౌంట్ పొందండి ఇలా

పోకో ఎం4 5జీ స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయెల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 2మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్లతో వెనుకవైపు రెండు కెమెరాలు ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 12 + ఎంఐయూఐ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. 5జీ కనెక్టివిటీ, డ్యూయెల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.1, యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, మైక్రోఎస్‌డీకార్డ్ స్లాట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.

Published by:Santhosh Kumar S
First published:

Tags: 5G Smartphone, Mobile News, Mobiles, Smartphone

ఉత్తమ కథలు