హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Poco M3: పోకో నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్ రిలీజ్.. తక్కువ ధరతో అదిరే ఫీచర్లు.. వివరాలివే

Poco M3: పోకో నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్ రిలీజ్.. తక్కువ ధరతో అదిరే ఫీచర్లు.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇటీవల కాలంలో పోకో సంస్థకు చెందిన ఫోన్లు యువతను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. తాజాగా పోకో ఎం3 స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లో సంస్థ లాంచ్ చేసింది.

ఏది కొనుగోలు చేసినా స్మార్ట్ ఫోన్ ను తొందరపడి కొనకూడదు. ఎందుకంటే రోజుకో మోడల్ మార్కెట్లోకి వచ్చేసి ఊరిస్తాయి. ఇటీవల కాలంలో పోకో సంస్థకు చెందిన ఫోన్లు యువతను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. తాజాగా పోకో ఎం3 స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లో లాంచ్ చేసిందీ సంస్థ. ఎం2 మోడల్ తర్వాత వచ్చిన ఈ ఫోన్ ట్రిపుల్ రియర్ కేమెరా, క్వాల్కం స్నాప్ డ్రాగన్ 662 ప్రాసెసర్ తో అందుబాటులోకి వచ్చింది. ఎం3 మోడల్ ప్రపంచ వ్యాప్తంగా గతేడాది నవంబరులోనే లాంచ్ అయినప్పటికీ భారత్ లో మాత్రం ఇప్పుడే విడుదల చేశారు. ఈ సరికొత్త పోకో ఎం3 స్మార్ట్ ఫోన్ ప్రారంభ ధర రూ.10,999లు. ఇందులో 6జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజి సామర్థ్యం కలవు. 128 జీబీ స్టోరేజి కావాలంటే రూ.11,999లతో కొనుగోలు చేసుకోవాలి. ఈ సరికొత్త ఎం3 సిరీస్ పవర్ బ్లాక్, పోకో యెల్లో, కూల్ బ్లూ లాంటి కలర్స్ లో లభ్యమవుతుంది. ఫిబ్రవరి 9 అర్ధాత్రి 12 గంటల నుంచి ఫ్లిప్ కార్టులో విక్రయానికి అందుబాటులో ఉంటుంది. ఇవికాకుండా ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులపై తక్షణ డిస్కౌంటు రూ.1000లు, ఈఎంఐ ఆప్షన్లు లాంటి ఆఫర్ల కంపెనీ ఇచ్చింది.

ఫీచర్లు..

పోకో ఎంజీ స్మార్ట్ ఫోన్ 6.53 అంగుళాల ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే, 1080X2340 పిక్సెల్ రిజల్యూషన్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 19.5:9 యాస్పెక్ట్ రేషియో లాంటి ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. ఇవి కాకుండా ఆక్టా కోర్ క్వాల్కం స్నాప్ డ్రాగన్ 662 ప్రోసెసర్ తో ఇది పనిచేస్తుంది. అదనంగా ట్రిపుల్ రియర్ కెమేరా సెటప్ తో పాటు 48ఎంపీ ప్రైమరీ సెన్సార్, 2ఎంపీ సెకండరీ సెన్సార్, 2ఎంపీ డెప్త్ సెన్సార్ తో కూడిన f/2.4 లెన్స్ ను ఇందులో అమర్చారు. అంతే కాకుండా 6జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్ ఆప్షన్ ఇందులో ఉంటాయి.

ఇవి కాకుండా 512 జీబీ వయా మైక్రో ఎస్డీ కార్డు ఆప్షన్ కూడా ఇందులో ఉంది. యూఎస్బీ టైప్-సీ, 3.5ఎంఎం హెడ్ ఫోన్ జాక్, 4జీ వోల్టే, వైఫై బ్లూటూత్, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఇన్ఫ్రారెడ్ బ్లాస్టర్ లాంటి ప్రత్యేకతలు దీని సొంతం.  ఇవి కాకుండా ఫింగర్ పాయింట్ సెన్సార్, స్టేరియో టైప్ స్పీకర్లు అదనపు ప్రత్యేకతలు. బ్యాటరీ దగ్గరకొస్తే 6000mAh సామర్థ్యం కలిగి ఉంది. 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ తో పాటు 162.30X77.30X9.60 ఎంఎం ప్రమాణాలను కలిగి ఉంది. భారత మార్కెట్లో పోకో ఎం3 స్మార్ట్ ఫోన్ కు పోటీగా మోటోరోలా జీ9, రియల్ మీ 7ఐ, శాంసంగ్ గెలాక్సీ ఎం11 లాంటి ఫోన్లు ఉన్నాయి.

Published by:Nikhil Kumar S
First published:

Tags: India, POCO, POCO India, Smartphones

ఉత్తమ కథలు