POCO M3 TO OPPO A53 HUGE DISCOUNT OFFERS ON THESE SMARTPHONES ON FLIPKART BIG BILLION DAYS SALE SS GH
Flipkart Offers: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఆఫర్ల వరద... ఈ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్
Flipkart Offers: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఆఫర్ల వరద... ఈ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్
(image: Flipkart)
Flipkart Big Billion Days 2021 | ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో స్మార్ట్‌ఫోన్ (Smartphone Offer) కొనాలనుకుంటున్నారా? ఏఏ స్మార్ట్ఫోన్లపై ఆఫర్స్ ఉన్నాయో తెలుసుకోండి.
పండుగ సీజన్ సమీపిస్తుండటంతో ఇ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పోటీ పోటీగా ఆఫర్లు గుప్పిస్తున్నాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ (Amazon Great Indian Festival), ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ (Flipkart Big Billion Days) సేల్స్ అక్టోబర్ 3న ప్రారంభం కానున్నాయి. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ప్రముఖ కంపెనీలకు చెందిన మొబైల్స్‌పై బంపరాఫర్ లభిస్తోంది. వీటికి అదనంగా, యాక్సిస్ బ్యాంక్, ICICI బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్ట్ పేమెంట్లపై 10% ఇన్స్టంట్ డిస్కౌంట్ కూడా అందిస్తామని తెలిపింది. బిగ్ బిలియన్ డేస్ సేల్ కింద అన్ని డీల్స్‌ను ఫ్లిప్‌కార్ట్ ఇంకా వెల్లడించనప్పటికీ, కొన్ని అగ్రశ్రేణి స్మార్ట్‌ఫోన్ డీల్స్‌ను మాత్రం వెల్లడించింది. ఆ డీల్స్ వివరాలను పరిశీలిద్దాం.
Poco M3
పోకో ఎం3 ప్రస్తుతం ధర రూ. 11,999 వద్ద ఉండగా.. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్‌లో కేవలం రూ. 9,499 వద్ద కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ 6.53 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది. ఇది క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 662 SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది 4 జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నెట్ స్టోరేజ్‌ని అందించింది. పోకో M3 48 మెగాపిక్సెల్స్ (వైడ్), 2 మెగాపిక్సెల్స్ (మాక్రో), 2 మెగాపిక్సెల్స్ (డెప్త్) సెన్సార్లతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కూడా చేర్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6000 mAh బ్యాటరీని అందించింది. ఙది 22.5W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్ధతిస్తుంది.
ఒప్పో A53 ప్రస్తుత ధర రూ. 15,990 వరకు ఉండగా.. సేల్‌లో భాగంగా రూ. 3 వేల డిస్కౌంట్ ఇస్తోంది. తద్వారా కేవలం రూ. 12,990 ధర వద్ద అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.52 -అంగుళాల హెచ్డీ+ డిస్ప్లేతో వస్తుంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది 6జీబీ ర్యామ్, 128 జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌ను కలిగి ఉంటుంది. ఒప్పో A53 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. సెల్ఫీలు లేదా వీడియో కాలింగ్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించింది. ఈ స్మార్ట్‌ఫోన్ 5000 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది 5జీ కనెక్టివీటికి మద్దతిస్తుంది.
మోటరోలా జి 60 అసలు ధర రూ. 18,149 వరకు ఉండగా.. బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో కేవలం రూ. 15,999 ధర వద్ద అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల ఫుల్ HD+ IPS LCD డిస్ప్లేతో వస్తుంది. ఇది క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 732G ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 6GB ర్యామ్, 128 GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో వస్తుంది. మోటరోలా జి 60లో 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ సెల్ఫీ కెమెరాతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను అందించింది. దీనిలో 6000 ఎంఏహెచ్ అతి పెద్ద బ్యాటరీని చేర్చింది.
మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 అసలు ధర రూ. 10,999 వద్ద ఉండగా.. బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో కేవలం రూ. 9,499 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఇది 6.67 అంగుళాల ఫుల్ HD+ IPS ఇన్ఫినిటీ డిస్ప్లే వస్తుంది. ఇది మీడియాటెక్ హీలియో G85 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 4GB ర్యామ్, 64GB ఇంటర్నల్ స్టోరేజ్‌ను అందించింది. స్మార్ట్‌ఫోన్‌లో క్వాడ్ రేర్ కెమెరా సెటప్‌ను చేర్చింది. ఇందులో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ సెల్ఫీ కెమెరాలను అందించింది. IN నోట్ 1లో 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ గల 5000 mAh బ్యాటరీ ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఐఫోన్ 12, ఐఫోన్ 12 మిని, ఐఫోన్ ఎస్‌ఈలపై కూడా భారీ డిస్కౌంట్ ప్రకటించింది.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.