హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Poco M3 Pro 5G: పోకో ఎం3 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్... స్పెసిఫికేషన్స్ ఇవే

Poco M3 Pro 5G: పోకో ఎం3 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్... స్పెసిఫికేషన్స్ ఇవే

Poco M3 Pro 5G: పోకో ఎం3 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్... స్పెసిఫికేషన్స్ ఇవే
(image: Poco Global)

Poco M3 Pro 5G: పోకో ఎం3 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్... స్పెసిఫికేషన్స్ ఇవే (image: Poco Global)

Poco M3 Pro 5G | పోకో ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న పోకో ఎం3 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ గ్లోబల్ మార్కెట్‌లో రిలీజ్ అయింది. ధర, స్పెసిఫికేషన్స్ వివరాలు తెలుసుకోండి.

  గ్లోబల్ మార్కెట్‌లోకి మరో 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయింది. పోకో నుంచి పోకో ఎం3 ప్రో 5జీ వచ్చేసింది. ఇటీవల కాలంలో వరుసగా 5జీ స్మార్ట్‌ఫోన్లు రిలీజ్ అవుతున్నాయి. షావోమీ, రియల్‌మీ, ఒప్పో, వివో లాంటి కంపెనీలన్నీ 5జీ మోడల్స్‌ను పరిచయం చేస్తున్నాయి. ఇప్పుడు పోకో ఎం3 ప్రో 5జీ రిలీజ్ అయింది. గ్లోబల్ ఈవెంట్ ద్వారా ఈ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది కంపెనీ. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్ ఉంది. 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే, 48 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ప్రత్యేకతలున్నాయి. 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కానీ బాక్సులో 22.5 వాట్ ఛార్జల్ లభించడం విశేషం. పోకో ఎం3 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ త్వరలో ఇండియాలో లాంఛ్ కానుంది. పోకో ఎం3 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ 4జీబీ+64జీబీ, 6జీబీ+128జీబీ వేరియంట్లలో రిలీజ్ అయింది. 4జీబీ+64జీబీ వేరియంట్ ధర 179 యూరోలు కాగా, 6జీబీ+128జీబీ వేరియంట్ ధర 199 యూరోలు.

  Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఈ 15 స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్

  Google Photos: గూగుల్ ఫోటోస్ వాడుతున్నారా? అన్‌లిమిటెడ్ స్టోరేజ్ ఇక ఉండదు

  పోకో ఎం3 ప్రో 5జీ స్పెసిఫికేషన్స్

  డిస్‌ప్లే: 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే

  ర్యామ్: 4జీబీ, 6జీబీ

  ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ, 128జీబీ

  ప్రాసెసర్: మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్

  రియర్ కెమెరా: 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్

  ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సెల్

  బ్యాటరీ: 5,000ఎంఏహెచ్ (18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్)

  ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 11 + ఎంఐయూఐ 12

  సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్

  కలర్స్: పవర్ బ్లాక్, కూల్ బ్లూ, పోకో ఎల్లో

  ధర:

  4జీబీ+64జీబీ- సుమారు రూ.16,000

  6జీబీ+128జీబీ- సుమారు రూ.17,800

  Realme 8 5G: ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ ధర ఇప్పుడు రూ.13,999 మాత్రమే

  Free Wifi at Railway Station: దేశంలోని 6,000 రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై

  పోకో ఇండియా నుంచి భారతదేశంలో ఇప్పటివరకు 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ కాలేదు. అయితే త్వరలోనే పోకో ఇండియా పోకో ఎం3 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ కూడా రూ.15,000 లోపు రిలీజ్ అయ్యే అవకాశం ఉందన్న వార్తలొస్తున్నాయి. ఇప్పటికే రూ.15,000 లోపు రియల్‌మీ 8 5జీ, ఒప్పో ఏ53ఎస్ 5జీ స్మార్ట్‌ఫోన్లు రిలీజ్ అయ్యాయి.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: 5G Smartphone, Mobile, Mobile News, Mobiles, POCO, POCO India, Smartphone, Smartphones

  ఉత్తమ కథలు