• Home
  • »
  • News
  • »
  • technology
  • »
  • POCO M3 PRO 5G SMARTPHONE LAUNCHED IN INDIA KNOW PRICE SPECIFICATIONS AND EARLY BIRD OFFER DETAILS SS

Poco M3 Pro 5G: పోకో ఇండియా సంచలనం... రూ.13,999 ధరకే 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్

Poco M3 Pro 5G: పోకో ఇండియా సంచలనం... రూ.13,999 ధరకే 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ (image: Poco)

Poco M3 Pro 5G | ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి మరో 5జీ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. పోకో ఎం3 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ విశేషాలు తెలుసుకోండి.

  • Share this:
    షావోమీకి చెందిన మరో స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ అయిన పోకో ఇండియా సంచలనం సృష్టించింది. రూ.13,999 ధరకే 5జీ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. గ్లోబల్ మార్కెట్‌లో కొద్ది రోజుల క్రితమే Poco M3 Pro 5G స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయింది. ఇప్పుడు అదే మోడల్‌ను ఇండియాలో రిలీజ్ అయింది. పోకో ఇండియా భారతదేశంలో రిలీజ్ చేసిన మొదటి 5జీ స్మార్ట్‌ఫోన్ కూడా ఇదే. పోకో ఎం3 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్, 48 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ప్రత్యేకతలు ఉన్నాయి. బాక్సులో 22.5 వాట్ ఛార్జర్ లభిస్తుంది. Poco M3 Pro 5G ప్రారంభ ధర రూ.13,999. ఇది 4జీబీ+64జీబీ వేరియంట్ ధర. దీంతో పాటు 6జీబీ+128జీబీ వేరియంట్ కూడా రిలీజ్ అయింది. ధర రూ.15,999. జూన్ 14న ఫ్లిప్‌కార్ట్‌లో సేల్ మొదలుకానుంది. మొదటి సేల్‌లో పోకో ఎం3 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ కొనేవారికి ఎర్లీ బర్డ్ ఆఫర్ ప్రకటించింది పోకోఇండియా. రూ.500 తక్కువకే ఈ స్మార్ట్‌ఫోన్ కొనొచ్చు. అంటే జూన్ 14న పోకో ఎం3 ప్రో 5జీ 4జీబీ+64జీబీ వేరియంట్‌ను రూ.13,499 ధరకు, 6జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.15,499 ధరకు కొనొచ్చు.

    Redmi Note 10 Pro: ఈ స్మార్ట్‌ఫోన్ ధర పెరిగింది... కొత్త రేట్స్ ఇవే

    Realme 5G Phone: రియల్‌మీ మరో సంచలనం... రూ.7,000 ధరకే 5జీ ఫోన్


    Poco M3 Pro 5G స్పెసిఫికేషన్స్
    డిస్‌ప్లే: 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డాట్ డిస్‌ప్లే
    ర్యామ్: 4జీబీ, 6జీబీ
    ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ, 128జీబీ
    ప్రాసెసర్: మీడియాటెక్ డైమెన్సిటీ 700
    రియర్ కెమెరా: 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్
    ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సెల్
    బ్యాటరీ: 5,000ఎంఏహెచ్ (18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్)
    ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 11 + ఎంఐయూఐ 12
    సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
    కలర్స్: పవర్ బ్లాక్, కూల్ బ్లూ, పోకో ఎల్లో
    ధర:
    4జీబీ+64జీబీ- రూ.13,999
    6జీబీ+128జీబీ- రూ.15,999

    Realme Anniversary Sale: రియల్‌మీ సేల్‌లో ఈ 28 స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్స్

    Realme X7 Max 5G: కాసేపట్లో రియల్‌మీ ఎక్స్7 మ్యాక్స్ 5జీ సేల్... ఆఫర్ వివరాలు ఇవే

    ఇండియాలో ఇటీవల వరుసగా 5జీ స్మార్ట్‌ఫోన్లు రిలీజ్ అవుతున్నాయి. ఇండియాలో ఇంకా 5జీ నెట్వర్క్ అందుబాటులోకి రాలేదు. కానీ స్మార్ట్‌ఫోన్ కంపెనీలు పోటీపడుతూ 5జీ మొబైల్స్ లాంఛ్ చేస్తున్నాయి. రూ.15,000 లోపు బడ్జెట్‌లో ఒప్పో ఏ53ఎస్ 5జీ, రియల్‌మీ 8 5జీ స్మార్ట్‌ఫోన్లు మార్కెట్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇక రూ.20,000 లోపు బడ్జెట్‌లో చాలా మొబైల్స్ ఉన్నాయి. రియల్‌మీ, షావోమీతో పాటు ఇతర బ్రాండ్స్ రూ.20,000 లోపు 5జీ స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేశాయి.
    Published by:Santhosh Kumar S
    First published: