Poco M3: భారీ బ్యాటరీ, ట్రిపుల్ AI కెమెరాలతో రిలీజైన పోకో ఎం3

Poco M3 | కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తున్నవారికి గుడ్ న్యూస్. పోకో ఎం3 రిలీజ్ అయింది. గ్లోబల్ మార్కెట్‌లో రిలీజ్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్ త్వరలోనే ఇండియాకు వచ్చే అవకాశముంది.

news18-telugu
Updated: November 24, 2020, 6:38 PM IST
Poco M3: భారీ బ్యాటరీ, ట్రిపుల్ AI కెమెరాలతో రిలీజైన పోకో ఎం3
Poco M3: భారీ బ్యాటరీ, ట్రిపుల్ AI కెమెరాలతో రిలీజైన పోకో ఎం3 (image: Poco)
  • Share this:
చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ కంపెనీ పోకో మరో కొత్త మోడల్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. పోకో ఎం3 స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న పోకో ఎం2 అప్‌గ్రేడ్ మోడల్ ఇది. ఇండియాలో బాగా పాపులర్ పోకో ఎం2 బాగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. దీంతో పోకో ఎం3 స్మార్ట్‌ఫోన్‌పై అంచనాలు పెరిగాయి. కొన్ని రోజులుగా పోకో ఎం3 స్మార్ట్‌ఫోన్ టీజర్లు భారీ అంచనాలను పెంచిన సంగతి తెలిసిందే. మొత్తానికి ఈ సరికొత్త మోడల్‌ను రిలీజ్ చేసింది పోకో. 48 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్, 6,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్ లాంటి ప్రత్యేకతలున్నాయి. మంచి ప్రాసెసర్, భారీ బ్యాటరీ ఉండాలనుకునేవారిని పోకో ఎం3 ఆకట్టుకుంటుంది. రొటీన్‌గా ఉండే స్మార్ట్‌ఫోన్లలా కాకుండా పోకో ఎం3 డిజైన్ కాస్త భిన్నంగా ఉండటం విశేషం. 4జీబీ+64జీబీ, 4జీబీ+128జీబీ వేరియంట్లలో పోకో ఎం3 స్మార్ట్‌ఫోన్ రిలీజైంది.

Mobile Apps: వెంటనే ఈ 5 యాప్స్ మీ ఫోన్ నుంచి డిలిట్ చేయండి

Redmi: మీరు కొన్న రెడ్‌మీ ప్రొడక్ట్స్ నకిలీవా? గుర్తించండి ఇలా


పోకో ఎం3 స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 6.53 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే
ర్యామ్:
ఇంటర్నల్ స్టోరేజ్:
ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662
రియర్ కెమెరా: 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా
ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
బ్యాటరీ: 6,000ఎంఏహెచ్ బ్యాటరీ (18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్)
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 11
సిమ్ సపోర్ట్:
కలర్స్: కూల్ బ్లూ, పవర్ బ్లాక్, పోకో ఎల్లో
ధర:
4జీబీ+64జీబీ- 149 డాలర్లు (సుమారు రూ.11,000)
4జీబీ+128జీబీ- 169 డాలర్లు (సుమారు రూ.12,500)

Jio New Plans: జియోలో రూ.75 నుంచే ఆల్ ఇన్ వన్ ప్లాన్స్... బెనిఫిట్స్ ఇవే

Prepaid Plans: రూ.300 లోపు రీఛార్జ్ చేయాలా? Airtel, Jio, Vi ప్లాన్స్ ఇవే

ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్‌లో పోకో ఎం3 రిలీజ్ అయింది. ఇండియాలో ఎప్పుడు రిలీజ్ అవుతుందన్న స్పష్టత లేదు. ఇప్పటికే ఇండియాలో ఎం సిరీస్‌లో పోకో ఎం2, పోకో ఎం2 ప్రో రిలీజ్ అయ్యాయి. ప్రస్తుతం ఇవి మార్కెట్‌లో ఉన్నాయి. మరి పోకో ఎం3 ఇండియాకు వస్తుందా? దీనిపై కంపెనీ అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.
Published by: Santhosh Kumar S
First published: November 24, 2020, 6:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading