చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ కంపెనీ పోకో నుంచి మరో స్మార్ట్‌ఫోన్ రిలీజ్ కాబోతోంది. పోకో ఎం3 లాంఛ్ చేస్తున్నట్టు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. నవంబర్ 24న పోకో ఎం3 స్మార్ట్‌ఫోన్ ఇండియాలో రిలీజ్ కానుంది. పోకో నుంచి ఇప్పటికే ఎం సిరీస్‌లో
పోకో ఎం2,
పోకో ఎం2 ప్రో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే సిరీస్‌లో మూడో స్మార్ట్‌ఫోన్‌ను పోకో ఎం3 పేరుతో లాంఛ్ చేయనుంది. పోకో ఎం3 స్మార్ట్‌ఫోన్‌కు ప్రత్యేకతలు, ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ గురించి కంపెనీ అధికారికంగా ఏమీ ప్రకటించలేదు. కేవలం రిలీజ్ డేట్ మాత్రమే ప్రకటించింది. నవంబర్ 24న సాయంత్రం 5.30 గంటలకు వర్చువల్ ఈవెంట్ ద్వారా పోకో ఎం3 రిలీజ్ కానుంది. అయితే రెడ్మీ నోట్ 10 రీబ్రాండెడ్ వర్షన్‌ను పోకో ఎం3 పరిచయం చేయొచ్చన్న వార్తలొస్తున్నాయి. ఇప్పటికే రెడ్మీ 9 ప్రైమ్ స్మార్ట్‌ఫోన్‌ను పోకో ఎం2 పేరుతో రీబ్రాండ్ చేసిన సంగతి తెలిసిందే. పోకో ఎం3 విషయంలో కూడా అదే జరగొచ్చని భావిస్తున్నారు.
Jio New Plans: జియోలో రూ.75 నుంచే ఆల్ ఇన్ వన్ ప్లాన్స్... బెనిఫిట్స్ ఇవే
Dual Selfie Camera Phones: సెల్ఫీ కోసం రెండు కెమెరాలు ఉన్న బెస్ట్ స్మార్ట్ఫోన్లు ఇవే
ఈ ఫోన్‌కు సంబంధించిన స్పెసిఫికేషన్స్ కొన్ని ప్రచారంలో ఉన్నాయి. 6.53 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్, 64 మెగాపిక్సెల్ సెన్సార్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్, డ్యూయెల్ స్పీకర్స్, 6,000ఎంఏహెచ్ బ్యాటరీ, 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ లాంటి స్పెసిఫికేషన్స్ ఉండొచ్చని అంచనా. పూర్తి స్పెసిఫికేషన్స్ తెలియాలంటే నవంబర్ 24 వరకు ఆగాల్సిందే. ఇక ఈ ఫోన్ ఇండియాలో రిలీజ్ అవుతుందా లేదా, ఎప్పట్లోపు రావచ్చు అన్న స్పష్టత లేదు. ఇండియన్ మార్కెట్లోకి కొత్త స్మార్ట్ఫోన్ల రిలీజ్‌కు ఇన్నాళ్లూ కాస్త బ్రేక్ పడింది. దసరా, దీపావళి పండుగ సీజన్ కారణంగా కంపెనీలన్నీ ఇప్పటికే రిలీజైన స్మార్ట్ఫోన్లను అమ్మడంపైనే ఎక్కువగా దృష్టిపెట్టాయి. దీంతో కొత్త మొబైల్స్ ఎక్కువగా రిలీజ్ కాలేదు. ఇప్పుడు దీపావళి పండుగ ముగియడంతో స్మార్ట్‌ఫోన్ కంపెనీలు మళ్లీ కొత్త మోడల్స్‌ను తీసుకురావొచ్చు.
Published by:Santhosh Kumar S
First published:November 18, 2020, 18:06 IST