హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Poco M2 Reloaded: పోకో ఎం2 రీలోడెడ్ వర్షన్ వచ్చేసింది... ధర రూ.10,000 లోపే

Poco M2 Reloaded: పోకో ఎం2 రీలోడెడ్ వర్షన్ వచ్చేసింది... ధర రూ.10,000 లోపే

Poco M2 Reloaded | రూ.10,000 లోపు సెగ్మెంట్‌లో మరో స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసింది పోకో ఇండియా. పోకో ఎం2 రీలోడెడ్ ప్రత్యేకతలేంటో తెలుసుకోండి.

Poco M2 Reloaded | రూ.10,000 లోపు సెగ్మెంట్‌లో మరో స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసింది పోకో ఇండియా. పోకో ఎం2 రీలోడెడ్ ప్రత్యేకతలేంటో తెలుసుకోండి.

Poco M2 Reloaded | రూ.10,000 లోపు సెగ్మెంట్‌లో మరో స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసింది పోకో ఇండియా. పోకో ఎం2 రీలోడెడ్ ప్రత్యేకతలేంటో తెలుసుకోండి.

  రూ.10,000 లోపు బడ్జెట్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. పోకో నుంచి మరో స్మార్ట్‌ఫోన్ రిలీజైంది. పోకో ఎం2 రీలోడెడ్ వర్షన్ రిలీజైంది. ఇది పూర్తిగా కొత్త స్మార్ట్‌ఫోన్ కాదు. ఇప్పటికే పాపులర్ అయిన పోకో ఎం2 స్మార్ట్‌ఫోన్ రీలోడెడ్ వర్షన్‌ను రిలీజ్ చేసింది. స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, డిజైన్‌లో ఏమీ మార్పు లేదు. కానీ ర్యామ్ ఆప్షన్ ఒక్కటే మారింది. గతేడాది పోకో ఎం2 స్మార్ట్‌ఫోన్ 6జీబీ+64జీబీ, 6జీబీ+128జీబీ వేరియంట్లలో రిలీజైంది. ఇప్పుడు పోకో ఎం2 రీలోడెడ్ పేరుతో 4జీబీ+64జీబీ వేరియంట్‌ను రిలీజ్ చేసింది. రూ.10,000 లోపు బడ్జెట్‌లో ఈ కొత్త వేరియంట్‌ను పరిచయం చేసింది. పోకో ఎం2 రీలోడెడ్ వర్షన్ 4జీబీ+64జీబీ ధర రూ.9,499. ఏప్రిల్ 21 మధ్యాహ్నం 3 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌లో సేల్ మొదలవుతుంది.

  పోకో ఎం2 స్మార్ట్‌ఫోన్‌లో ఉన్నట్టుగానే పోకో ఎం2 రీలోడెడ్ వర్షన్‌లో కూడా 6.53 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే, మీడియాటెక్ హీలియో జీ80 ప్రాసెసర్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 13 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా లాంటి ఫీచర్స్ ఉన్నాయి.

  Google Nest Mini: రూ.99 ధరకే గూగుల్ నెస్ట్ మినీ స్మార్ట్ స్పీకర్... వారికి మాత్రమే

  Oppo A54: ఇండియాలో రిలీజైన ఒప్పో ఏ54... ధర ఎంతంటే

  పోకో ఎం2 రీలోడెడ్ స్పెసిఫికేషన్స్

  డిస్‌ప్లే: 6.53 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+

  ర్యామ్: 4జీబీ

  ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ

  ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో జీ80

  రియర్ కెమెరా: 13+8+5+2 మెగాపిక్సెల్

  ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సెల్

  బ్యాటరీ: 5,000ఎంఏహెచ్

  ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10+ఎంఐయూఐ 12

  సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్

  కలర్స్: పిచ్ బ్లాక్, స్లేట్ బ్లూ

  ధర:

  4జీబీ+64జీబీ- రూ.9,499

  Samsung Galaxy A32: ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.3,000 తగ్గింది... రూ.1,500 డిస్కౌంట్ కూడా

  LG Wing: ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.40,000 తగ్గింది... లేటెస్ట్ రేట్ ఎంతంటే

  ప్రస్తుతం పోకో ఎం2 స్మార్ట్‌ఫోన్ 6జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.10,499 కాగా, 6జీబీ+128జీబీ ధర రూ.11,499. ర్యామ్ వేరియంట్లలో మాత్రమే తేడా ఉంది. లేటెస్ట్‌గా రిలీజ్ అయిన పోకో ఎం2 రీలోడెడ్ వర్షన్, గతంలో రిలీజ్ అయిన పోకో ఎం2 స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, డిజైన్‌లో ఏ మార్పు లేదు. 2020 సెప్టెంబర్‌లో రిలీజైన పోకో ఎం2 బడ్జెట్ సెగ్మెంట్‌లో అనేక సంచలనాలు సృష్టించింది. మొదటి నాలుగు నెలల్లో 10 లక్షలకు పైగా యూనిట్స్ అమ్ముడుపోయాయి. నిమిషానికి 5 పోకో ఎం2 స్మార్ట్‌ఫోన్లు అమ్మి రికార్డు సృష్టించింది పోకో ఇండియా. అంతకన్నా ముందే రిలీజ్ అయిన రెడ్‌మీ 9 ప్రైమ్ రీబ్రాండెడ్ వర్షన్‌గా పోకో ఎం2 రిలీజైన సంగతి తెలిసిందే.

  First published:

  Tags: Mobile, Mobile News, Mobiles, POCO, POCO India, Smartphone, Smartphones

  ఉత్తమ కథలు