Poco M2 Pro: కాసేపట్లో పోకో ఎం2 ప్రో సేల్... ధర ఎంతంటే

Poco M2 Pro: బడ్జెట్ సెగ్మెంట్‌లో రిలీజైన పోకో ఎం2 ప్రో... ధర ఎంతంటే (image: Poco India)

Poco M2 Pro | ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి మరో కొత్త మోడల్ వచ్చింది. పోకో ఎం2 ప్రో ధర, ఫీచర్లు, ఇతర వివరాలు తెలుసుకోండి.

  • Share this:
    కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? మీ బడ్డెట్ రూ.15,000 లోపేనా? బడ్జెట్ సెగ్మెంట్‌లో షావోమీ మరో కొత్త స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. పోకో నుంచి పోకో ఎం2 ప్రో ఇండియన్ మార్కెట్‌లోకి వచ్చింది. ఈ ఫోన్ రెడ్‌మీ నోట్ 9 ప్రో స్మార్ట్‌ఫోన్ లాగానే ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 720జీ ప్రాసెసర్, క్వాడ్ కెమెరా సెటప్, ట్రిపుల్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, 5,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ లాంటి ప్రత్యేకతలున్నాయి. 4జీబీ+64జీబీ, 6జీబీ+64జీబీ, 6జీబీ+128జీబీ వేరియంట్లలో ఈ ఫోన్ లభిస్తుంది. ప్రారంభ ధర రూ.13,999. మొదటి సేల్ ఫ్లిప్‌కార్ట్‌లో జూలై 14న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది.



    పోకో ఎం2 ప్రో స్పెసిఫికేషన్స్
    డిస్‌ప్లే: 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+
    ర్యామ్: 4జీబీ, 6జీబీ
    ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ, 128జీబీ
    ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 720జీ
    రియర్ కెమెరా: 48+8+5+2 మెగాపిక్సెల్
    ఫ్రంట్ కెమెరా: 16 మెగాపిక్సెల్
    బ్యాటరీ: 5,000ఎంఏహెచ్ (33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్)
    ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10
    సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
    కలర్స్: ఔట్ ఆఫ్ ది బ్లూ, గ్రీన్ అండ్ గ్రీనర్, టూ షేడ్స్ ఆఫ్ బ్లాక్
    ధర:
    4జీబీ+64జీబీ- రూ.13,999
    6జీబీ+64జీబీ- రూ.14,999
    6జీబీ+128జీబీ- రూ.16,999
    Published by:Santhosh Kumar S
    First published: