POCO M2 LAUNCHED IN INDIA WITH MEDIATEK HELIO G80 PROCESSOR AND 5000MAH BATTERY KNOW PRICE SPECS AND OFFERS SS
Poco M2: పోకో ఎం2 రిలీజ్... తక్కువ ధరకే 6GB+64GB స్మార్ట్‌ఫోన్
Poco M2: పోకో ఎం2 రిలీజ్... తక్కువ ధరకే 6GB+64GB స్మార్ట్‌ఫోన్
(image: Poco India)
Poco M2 | మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? మీ బడ్జెట్ రూ.12,000 లోపేనా? పోకో ఇండియా నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ వచ్చింది. పోకో ఎం2 స్మార్ట్‌ఫోన్ విశేషాలు తెలుసుకోండి.
స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి శుభవార్త. తక్కువ ధరకే ఎక్కువ ర్యామ్ ఉన్న ఫోన్ కొనాలనుకునేవారి కోసం పోకో బ్రాండ్ నుంచి పోకో ఎం2 స్మార్ట్‌ఫోన్ రిలీజైంది. పోకో ఎం2 స్మార్ట్‌ఫోన్ 6జీబీ+64జీబీ వేరియంట్ ధర కేవలం రూ.10,999 మాత్రమే. డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఏడాదిలో పోకో ఇండియా రిలీజ్ చేసిన మూడో ఫోన్ ఇది. పోకో ఇండియా షావోమీ సబ్‌బ్రాండ్ అన్న సంగతి తెలిసిందే. ఫోన్ విషయానికి వస్తే ఇటీవల షావోమీ రిలీజ్ చేసిన రెడ్మీ 9 ప్రైమ్ లాగానే ఈ స్మార్ట్‌ఫోన్ ఉంది. అయితే కొన్ని స్పెసిఫికేషన్స్‌లో మార్పులున్నాయి. రెడ్మీ 9 ప్రైమ్ స్మార్ట్‌ఫోన్‌లో 4జీబీ ర్యామ్ మాత్రమే ఉంటే పోకో ఎం2 మోడల్లో 6జీబీ ర్యామ్ ఉంది. పోకో ఎం2 స్మార్ట్‌ఫోన్‌లో 6.53 అంగుళాల డిస్ప్లే, మీడియాటెక్ హీలియో జీ80 ప్రాసెసర్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ప్రత్యేకతలున్నాయి. పోకో ఎం2 సేల్ సెప్టెంబర్ 15న ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభం కానుంది. ఐసీఐసీఐ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ కార్డులతో కొనేవారికి రూ.750 తగ్గింపు లభిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.