హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

POCO M5 4G: పోకో నుంచి త్వరలో కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే..

POCO M5 4G: పోకో నుంచి త్వరలో కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే..

POCO M5 4G

POCO M5 4G

POCO M5 4G: ప్రముఖ చైనీస్ మొబైల్ తయారీదారు పోకో (Poco) కూడా భారతదేశంలో కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురావడానికి సన్నద్ధమవుతోంది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఇండియాలో ఫ్లాగ్‌షిప్ మొబైల్స్ కంటే బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లు (Budget Smarphones) కొనుగోలు చేసే వారే ఎక్కువ. అందుకే కంపెనీలు ప్రీమియం ఫోన్స్‌తో పాటు ఆకర్షణీయమైన ఫీచర్లతో బడ్జెట్ మొబైల్స్‌ (Budget Mobiles)ను కూడా ఇండియన్ మార్కెట్లో(Indian Market) లాంచ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రముఖ చైనీస్ మొబైల్ తయారీదారు పోకో (Poco) కూడా భారతదేశంలో కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురావడానికి సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ట్విట్టర్ హ్యాండిల్‌లో ఈ అప్‌కమింగ్ మొబైల్ లాంచ్‌ను టీజ్‌ (Tease) కూడా చేసింది.


ఈ ఫోన్‌ కంపెనీ తన M-సిరీస్‌లో భాగంగా తీసుకొచ్చే పోకో ఎం5 4జీ (POCO M5 4G) అని టెక్ రిపోర్ట్ పేర్కొంటున్నాయి. ఈ మొబైల్‌ను వచ్చే నెల (సెప్టెంబర్) ప్రారంభంలో విడుదల చేయనుందని తెలుస్తోంది. మరి ఈ మొబైల్ (Expected) స్పెసిఫికేషన్లు ఏంటి? ధర ఎంత? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.


పోకో ఇండియా రీసెంట్ ట్వీట్‌లో 'G99' అని చూపించే ఒక ఫొటో అప్‌లోడ్ చేసింది. దీన్నిబట్టి అప్‌కమింగ్ POCO M5 4G ఫోన్ మీడియాటెక్ హీలియో G99 (MediaTek Helio G99) ప్రాసెసర్ సాయంతో పని చేస్తుందని తెలుస్తోంది. ఇది ఒక 4G చిప్‌సెట్ కాబట్టి ఫోన్ 5Gకి సపోర్ట్ చేయకపోవచ్చు. కాకపోతే గేమ్స్ స్మూత్‌గా రన్‌ చేయడంలో ఈ ప్రాసెసర్ సమర్థవంతంగా పనిచేస్తుంది.టీజర్ ఫొటోలో ఒక లెదర్ టైప్ బ్యాక్‌ ప్యానెల్ లాంటిది కనిపించింది. ఫోన్ కచ్చితమైన లాంచ్ తేదీ ఇంకా వెల్లడి కాలేదు కానీ కంపెనీ ఈ తేదీని అతి త్వరలో అధికారికంగా ప్రకటించవచ్చు. టెక్ రిపోర్ట్స్ ప్రకారం, మొబైల్ సెప్టెంబర్ నెల మొదటి వారంలో లేదా వచ్చే నెలాఖరులోపు రిలీజ్ అవుతుంది.
* పోకో ఎం5 4జీ ధర, స్పెసిఫికేషన్లు

మీడియాటెక్ హీలియో G99తో రన్ అయ్యే పోకో ఎం5 4G ఫోన్ హోల్-పంచ్ కెమెరా కట్-అవుట్‌ డిజైన్‌లో లాంచ్ కానుందని టాక్. లీక్స్ ప్రకారం, ఇందులో 90Hz రీఫ్రెష్ రేటుతో 6.58-అంగుళాల FHD+ డిస్‌ప్లే ఆఫర్ చేశారు. ఇది IPS LCD ప్యానెల్‌తో వస్తుంది. 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000 mAh బ్యాటరీని ఆఫర్ చేస్తుంది. పోకో అప్‌కమింగ్ ఫోన్‌ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో ఆకట్టుకోనుంది.


ఇది కూడా చదవండి : గూగుల్ డ్రైవ్‌తో డాక్యుమెంట్స్ స్కాన్ & సేవ్ చేయడం ఎలా..? ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి...


ధర గురించి కంపెనీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. టెక్ రిపోర్ట్స్‌ మాత్రం, Poco M5 4G బేస్ వేరియంట్ రూ.15,000 కంటే తక్కువ ధరతో లాంచ్ కావచ్చు. హై-ఎండ్ వేరియంట్స్ ధర కాస్త ఎక్కువగానే ఉండవచ్చు. ఇందులో Android 12 OS, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi కనెక్టివిటీ, బ్లూటూత్ 5.0, 6GB RAM మినిమం స్టోరేజ్‌గా అందించినట్టు రిపోర్ట్స్ పేర్కొన్నాయి. అయితే ఫోన్ అధికారికంగా లాంచ్ అయితే గానీ దీని ఫీచర్లు కచ్చితంగా తెలియవు.

First published:

Tags: POCO, POCO India, Smart phones, Tech news

ఉత్తమ కథలు