హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

వచ్చే వారం మార్కెట్లోకి POCO X3 Pro.. ధర, స్పెసిఫికేషన్ల వివరాలివే

వచ్చే వారం మార్కెట్లోకి POCO X3 Pro.. ధర, స్పెసిఫికేషన్ల వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్న వారికి పోకో గుడ్ న్యూస్ చెప్పింది. POCO X3 ప్రో మోడల్ ను వచ్చే వారంలో ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

  స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్న వారికి పోకో గుడ్ న్యూస్ చెప్పింది. POCO X3 ప్రో మోడల్ ను వచ్చే వారంలో ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఫోన్ కు సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఈ ఫోన్ 6.67 ఇంచుల ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో పాటు LCD స్క్రీన్ ను కలిగి ఉంటుంది. 120Hz రీఫ్రెష్ రేట్, 240Hz టచ్ సాప్లింగ్ రేట్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ AMOLED screen ఫీచర్ ను కలిగి ఉందన్న వార్తలు సైతం వినిపిస్తున్నాయి. అయితే ఫోన్ విడుదల అనంతరమే ఆ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 860SoC ని కలిగి ఉంటుంది. 8జీబీ ర్యామ్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 48MP రేర్ కెమెరా తో పాటు 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగా పిక్సెల్ కెమెరాను కలిగి ఉంటుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తో కలిగి ఉండనుంది. ఈ ఫోన్ 5260mAh బ్యాటరీని కలిగి ఉండనుంది. దీంతో పాటు 33W ఫాస్ట్ చార్జింగ్ ను సపోర్ట్ చేస్తుంది.

  ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు ఇలా ఉండొచ్చన్న ప్రచారం జరుగుతోంది..

  -6.67inch(1080*2400 పిక్సెల్స్) ఫుల్ హెచ్ డీ డిస్ప్లే

  -ఆండ్రాయిడ్ 11 విత్ MIUI12

  -హైబ్రిడ్ డ్యుయల్ సిమ్(nano+nano/microSD)

  -48ఎంపీ రేర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాస్, 8 ఎంపీ అల్ట్రా వైడ్ సెన్సార్

  -20ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

  -సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, IR సెన్సార్

  -3.5ఎంఎం ఆడియో జాక్, స్టీరియో స్పీకర్స్

  -డ్యుయల్ 4G VoLTE, Wi-Fi 802.11 AC(2.4GHz+5GHz), VoWifi, Bluetooth 5, GPS, USB Type-C, NFC తదితర ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి.

  -ఈ ఫోన్ ధర విషయానికి వస్తే 8GB+256GB ర్యామ్ వేరియంట్ ధర రూ.25,192 వరకు ఉండొచ్చని తెలుస్తోంది. 6GB+128GB మోడల్ ధర ఇంకా తక్కువగా ఉండే అవకాశం ఉంది. మరి కొన్ని రోజుల్లో ఈ ఫోన్ కు సంబంధించిన ఖచ్చితమైన వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: POCO, POCO India, Smartphones

  ఉత్తమ కథలు