Poco X3: కాసేపట్లో పోకో ఎక్స్3 రిలీజ్... ఫీచర్స్ ఇవే

Poco X3 | యూరప్ మార్కెట్‌లో రిలీజైన పోకో ఎక్స్3 స్మార్ట్‌ఫోన్ ఇండియాలో రిలీజ్ కాబోతోంది. ప్రత్యేకతలు తెలుసుకోండి.

news18-telugu
Updated: September 22, 2020, 8:56 AM IST
Poco X3: కాసేపట్లో పోకో ఎక్స్3 రిలీజ్... ఫీచర్స్ ఇవే
Poco X3: కాసేపట్లో పోకో ఎక్స్3 రిలీజ్... ఫీచర్స్ ఇవే (image: Poco India)
  • Share this:
షావోమీ సబ్‌బ్రాండ్ అయిన పోకో ఇండియా వరుసగా స్మార్ట్‌ఫోన్లు రిలీజ్ చేస్తోంది. ఇప్పటికే పోకో ఎం2 ప్రో, పోకో ఎం2 మోడల్స్‌ని పరిచయం చేసింది. పోకో ఎక్స్3 స్మార్ట్‌ఫోన్‌ను కూడా ఇండియాలో రిలీజ్ చేయనుంది. సెప్టెంబర్ 22 మధ్యాహ్నం 12 గంటలకు పోకో ఎక్స్3 స్మార్ట్‌ఫోన్ లాంఛ్ చేయనున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఇప్పటికే పోకో ఎక్స్3 ఎన్ఎఫ్‌సీ పేరుతో యూరప్ మార్కెట్‌లో ఓ ఫోన్ రిలీజ్ అయింది. మరి ఇండియాలో అదే ఫోన్ పోకో ఎక్స్3 పేరుతో రిలీజ్ అవుతుందా, స్పెసిఫికేషన్స్‌లో మార్పులు ఉంటాయా అన్నది చూడాలి. పోకో ఎక్స్3 వీడియో గేమ్ ఫ్యాన్స్ కోసం రానున్న గేమింగ్ సెంట్రిక్ స్మార్ట్‌ఫోన్. ఇందులో స్నాప్‌డ్రాగన్ 732జీ ప్రాసెసర్, 5,160ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, 64 మెగాపిక్సెల్ Sony IMX 682 సెన్సార్ లాంటి స్పెసిఫికేషన్స్ ఉంటాయని అంచనా. పూర్తి స్పెసిఫికేన్స్, ఫీచర్స్, ధర లాంటి వివరాలు తెలియాలంటే సెప్టెంబర్ 22 వరకు ఆగాల్సిందే.

Smartphone: రూ.20,000 లోపు బడ్జెట్‌లో 8 బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే...

Infinix Note 7: పెద్ద డిస్‌ప్లే, భారీ బ్యాటరీ... ఇన్ఫీనిక్స్ నోట్ 7 రిలీజ్


పోకో ఎక్స్3 స్పెసిఫికేషన్స్ (అంచనా)
డిస్‌ప్లే: 6.67 అంగుళాల పుల్ హెచ్‌డీ+, 120Hz రిఫ్రెష్ రేట్
ర్యామ్: 8జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 128జీబీ
ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 732జీ
రియర్ కెమెరా: 64 మెగాపిక్సెల్ Sony IMX 682 సెన్సార్ + 13+2+2
ఫ్రంట్ కెమెరా: 20 మెగాపిక్సెల్
బ్యాటరీ: 5,160ఎంఏహెచ్ (33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్)
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
కలర్స్: షాడో గ్రే, కోబాల్ట్ బ్లూ
ధర: రూ.20,000 లోపు
Published by: Santhosh Kumar S
First published: September 22, 2020, 8:56 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading