హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Poco M3 Pro 5G: పోకో ఎం3 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ ఇండియాకు వచ్చేస్తోంది... ఫీచర్స్ ఇవే

Poco M3 Pro 5G: పోకో ఎం3 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ ఇండియాకు వచ్చేస్తోంది... ఫీచర్స్ ఇవే

Poco M3 Pro 5G: పోకో ఎం3 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ ఇండియాకు వచ్చేస్తోంది... ఫీచర్స్ ఇవే
(image: Poco India)

Poco M3 Pro 5G: పోకో ఎం3 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ ఇండియాకు వచ్చేస్తోంది... ఫీచర్స్ ఇవే (image: Poco India)

Poco M3 Pro 5G | ఇండియాలో మరో 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ కాబోతోంది. పోకో ఇండియా నుంచి తొలి 5జీ స్మార్ట్‌ఫోన్ పోకో ఎం3 ప్రో 5జీ వచ్చేస్తోంది.

    కొద్ది రోజుల క్రితం గ్లోబల్ మార్కెట్‌లో పోకో ఎం3 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. షావోమీ, రియల్‌మీ, ఒప్పో, వివో లాంటి కంపెనీలకు పోటీగా తొలి 5జీ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది పోకో. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ ఇండియాకు ఎప్పుడు వస్తుందా అని పోకో ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. జూన్ 8న ఇండియాలో పోకో ఎం3 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ కానుంది. ఇందుకు సంబంధించిన టీజర్ ఫ్లిప్‌కార్ట్‌లో కనిపించింది. పోకో ఎం3 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్ ఉంది. 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే, 48 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ లాంటి ప్రత్యేకతలున్నాయి. తమ కంపెనీ నుంచి భారతదేశంలో తొలి 5జీ స్మార్ట్‌ఫోన్ పరిచయం చేస్తున్నట్టు పోకో ఇండియా ట్విట్టర్‌లో ప్రకటించింది.

    Amazon Prime Subscription: రూ.499 ధరకే అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్... కండీషన్స్ అప్లై

    Smartphone Multitasking: స్మార్ట్‌ఫోన్‌తో మల్టీటాస్కింగ్ చాలా డేంజర్... ఎందుకో తెలుసుకోండి

    పోకో ఎం3 ప్రో 5జీ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉంది. 4జీబీ+64జీబీ, 6జీబీ+128జీబీ వేరియంట్లలో రిలీజ్ కావొచ్చు. మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. రియర్ కెమెరా వివరాలు చూస్తే 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్. 5,000ఎంఏహెచ్. 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బాక్సులో 22.5 వాట్ ఛార్జర్ లభిస్తుంది. పోకో ఎం3 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 11 + ఎంఐయూఐ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. డ్యూయెల్ సిమ్ సపోర్ట్ చేస్తుంది. పవర్ బ్లాక్, కూల్ బ్లూ, పోకో ఎల్లో కలర్స్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ కానుంది.

    Realme X7 Max 5G: ఇండియాలో రిలీజ్ అయిన రియల్‌మీ ఎక్స్7 మ్యాక్స్ 5జీ... ధర ఎంతంటే

    Top 10 Smartphones: ఈ ఏడాది ఎక్కువగా అమ్ముడుపోయిన 10 స్మార్ట్‌ఫోన్లు ఇవే...

    గ్లోబల్ మార్కెట్‌లో పోకో ఎం3 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ ధర విషయానికి వస్తే 4జీబీ+64జీబీ వేరియంట్ ధర సుమారు రూ.16,000 కాగా, 6జీబీ+128జీబీ వేరియంట్ ధర సుమారు రూ.17,700. కానీ ఇండియాలో రూ.15,000 లోపే పోకో ఎం3 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసే అవకాశం ఉంది. రూ.15,000 లోపు బడ్జెట్‌లో ఇప్పటికే రియల్‌మీ 8 5జీ, ఒప్పో ఏ53ఎస్ 5జీ స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. ఇక జూన్ 8న ఇండియాలో ఐకూ జెడ్3 5జీ స్మార్ట్‌ఫోన్ కూడా రిలీజ్ కానుంది.

    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: 5G Smartphone, Mobile, Mobile News, Mobiles, POCO, POCO India, Smartphone, Smartphones

    ఉత్తమ కథలు