హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Poco M3: పోకో ఎం3 లాంఛింగ్ డేట్ ఫిక్స్... రిలీజ్‌కు ముందే తెలిసిన ఫీచర్స్

Poco M3: పోకో ఎం3 లాంఛింగ్ డేట్ ఫిక్స్... రిలీజ్‌కు ముందే తెలిసిన ఫీచర్స్

Poco M3: పోకో ఎం3 లాంఛింగ్ డేట్ ఫిక్స్... రిలీజ్‌కు ముందే తెలిసిన ఫీచర్స్
(image: Poco India)

Poco M3: పోకో ఎం3 లాంఛింగ్ డేట్ ఫిక్స్... రిలీజ్‌కు ముందే తెలిసిన ఫీచర్స్ (image: Poco India)

Poco M3 | ఇప్పటికే చైనాలో రిలీజ్ అయిన పోకో ఎం3 స్మార్ట్‌ఫోన్ ఇండియాకు వచ్చేస్తోంది. పోకో ఎం3 రిలీజ్ డేట్ ప్రకటించింది పోకో ఇండియా.

  షావోమీ ఇండియాకు చెందిన సబ్‌బ్రాండ్ అయిన పోకో ఇండియా భారతీయ మార్కెట్‌లోకి మరో స్మార్ట్‌ఫోన్‌ను లాంఛ్ చేయబోతోంది. పోకో ఎం3 మోడల్‌ను ఇండియన్ మార్కెట్‌లో రిలీజ్ చేయనుంది. ఫిబ్రవరి 2 మధ్యాహ్నం 12 గంటలకు పోకో ఎం3 స్మార్ట్‌ఫోన్ రిలీజ్ కానుంది. పోకో ఎం3 ఇప్పటికే చైనా మార్కెట్‌లో రిలీజ్ అయింది. కాబట్టి ఫీచర్స్ అందరికీ తెలిసినవే. దాదాపు అవే ఫీచర్స్‌తో ఇండియాలో కూడా పోకో ఎం3 రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ. ఇక ఇండియాలో ఇప్పటికే ఎం సిరీస్‌లో పోకో ఎం2, పోకో ఎం2 స్మార్ట్‌ఫోన్లు రిలీజ్ అయ్యాయి. ఇవి బాగా పాపులర్ కూడా అయ్యాయి. పోకో ఎం3 స్మార్ట్‌ఫోన్‌పైనా అవే స్థాయిలో అంచనాలు ఉన్నాయి. అయితే షావోమీ రెడ్‌మీ బ్రాండ్‌తో రిలీజ్ చేసిన స్మార్ట్‌ఫోన్లనే కాస్త ఫీచర్స్ మార్చి పోకో పేరుతో లాంఛ్ చేస్తుందున్న సంగతి తెలిసిందే.

  పోకో ఎం3 కాస్త భిన్నంగా ఉన్నట్టు ఫీచర్స్ చూస్తే తెలుస్తోంది. పోకో ఎం3 స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్, 48 మెగాపిక్సెల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI ట్రిపుల్ కెమెరా సెటప్, 6,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ప్రత్యేకతలున్నాయి. ఇక డిజైన్ విషయానికి వస్తే పోకో ఎం3 కొత్తగా కనిపిస్తోంది. ఈ ఫోన్ ఏఏ వేరియంట్లలో రిలీజ్ అవుతుంది, వీటి ధర ఎంత అన్న విషయాలు తెలియాలంటే ఫిబ్రవరి 2 వరకు ఆగాల్సిందే పోకో ఎం3 సేల్ ఫ్లిప్‌కార్ట్‌లో ఉంటుంది. సేల్ డేట్ కూడా ప్రకటించాల్సి ఉంది. 6జీబీ ర్యామ్ ఉంటుందని అధికారికంగా ప్రకటించింది.

  Realme X7 Pro: రియల్‌మీ ఎక్స్7, రియల్‌మీ ఎక్స్7 ప్రో రిలీజ్ డేట్ ఫిక్స్... ఫీచర్స్ ఇవే

  Jio New Plans: రోజూ 1.5జీబీ డేటా కావాలా? జియో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్ ఇవే

  పోకో ఎం3 స్పెసిఫికేషన్స్

  డిస్‌ప్లే: 6.53 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే

  ర్యామ్: 4జీబీ, 6జీబీ

  ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ, 128జీబీ

  ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662

  రియర్ కెమెరా: 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా

  ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా

  బ్యాటరీ: 6,000ఎంఏహెచ్ బ్యాటరీ (18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్)

  ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10 + ఎంఐయూఐ 12

  సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్

  కలర్స్: కూల్ బ్లూ, పవర్ బ్లాక్, పోకో ఎల్లో

  ధర:

  4జీబీ+64జీబీ- సుమారు రూ.11,000

  6జీబీ+128జీబీ- సుమారు రూ.12,500

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: 5G Smartphone, Mobile, Mobile News, Mobiles, POCO, POCO India, Smartphone, Smartphones

  ఉత్తమ కథలు