గత నెలలో పోకో ఇండియా నుంచి పోకో ఎం3 రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఫోన్ రిలీజ్ అయినప్పటి నుంచి 45 రోజుల్లో ఎన్ని యూనిట్స్ అమ్ముడుపోయాయో తెలుసా? 5,00,000 యూనిట్స్ అమ్మింది పోకో ఇండియా. అంటే నిమిషానికి 8 ఫోన్లు అమమ్మేసింది. మొదటి సేల్‌లోనే 1,50,000 యూనిట్స్ అమ్మినట్టు పోకో ఇండియా గతంలోనే ప్రకటించింది. ఇప్పుడు 45 రోజుల్లో 5,00,000 యూనిట్స్ అమ్మినట్టు తెలిపింది. పోకో ఎం3 స్మార్ట్‌ఫోన్ గతంలో ఇండియాలో రిలీజ్ అయిన పోకో ఎం2 అప్‌గ్రేడెడ్ వర్షన్. అప్పట్లో పోకో ఎం2 కూడా ఇలాగే రికార్డులు సృష్టించింది. ఇప్పుడు పోకో ఎం3 కూడా అదే స్థాయిలో పాపులర్ అవుతోంది. పోకో ఎం3 లో యెల్లో కలర్‌కు బాగా క్రేజ్ లభిస్తోంది.
WhatsApp: వాట్సప్ వాడుతున్నారా? ఈ తప్పులు అస్సలు చేయొద్దు
5⃣0⃣0⃣0⃣0⃣0⃣+ #POCOM3 sold = 4⃣5⃣ days
1⃣1⃣1⃣1⃣1⃣+ phones = 1⃣ day
~4⃣6⃣3⃣ phones = 1⃣ hour
~8⃣ phones = 1⃣ minute
Another 8⃣ #POCO members have been added already to the fam by the time you read the tweet.
Thanks for the amazing response! pic.twitter.com/1EqSREk4Pt
— POCO - Madder By the Minute (@IndiaPOCO) March 26, 2021
అందుకే గతంలో పోకో ఎల్లో సేల్ పేరుతో ప్రత్యేకంగా ఓ సేల్ కూడా నిర్వహించింది పోకో ఇండియా. ఇప్పుడు హోలీ సందర్బంగా 'హోలీ ఎల్లో సేల్' ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్‌లో 'హోలీ ఎల్లో సేల్' ఈ సేల్ మార్చి 29న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. ఈ సేల్‌లో పోకో ఎం3 ఎల్లో కలర్ మాత్రమే లభిస్తుంది. పోకో ఎం3 స్మార్ట్‌ఫోన్ ధర చూస్తే 6జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.10,999 కాగా 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.11,999. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. ఒకవేళ మీరు ఎక్స్‌ఛేంజ్‌లో ఈ ఫోన్ కొంటే కేవలం రూ.649 చెల్లిస్తే చాలు. ఈ ఆఫర్ ఎలా పొందాలో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Vivo V20: ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.2,000 తగ్గింది... లేటెస్ట్ రేట్ ఎంతంటే
The OP perfomer is coming back again to make your Holi colourful with #HoliYellowSale 💛
Grab the 💛 #POCOM3 on 🗓️ 29.03.21
🕛12 PM on @Flipkart. pic.twitter.com/9ZSiDpHxuJ
— POCO - Madder By the Minute (@IndiaPOCO) March 28, 2021
పోకో ఎం3 స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు చూస్తే లెదర్ లాంటి టెక్చర్డ్ డిజైన్‌తో ఉంటుంది. పోకో ఎం3 స్మార్ట్‌ఫోన్‌లో 6.53 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్ + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌తో ట్రిపుల్ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా సెటప్ ఉన్నాయి. కెమెరాలో డాక్యుమెంట్ మోడ్, నైట్ మోడ్, ఏఐ సీన్ డిటెక్షన్, గూగుల్ లెన్స్, ఏఐ బ్యూటిఫై, పోర్ట్‌రైట్ మోడ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. పోకో ఎం3 స్మార్ట్‌ఫోన్‌లో 6,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉండటం విశేషం. 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5G Smartphone, Mobile, Mobile News, Mobiles, POCO, POCO India, Smartphone, Smartphones