హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Poco Smartphone: భారత మార్కెట్లో దుమ్ము రేపుతున్న పోకో.. టాప్-3 స్థానంలో కంపెనీ స్మార్ట్ ఫోన్ బ్రాండ్లు

Poco Smartphone: భారత మార్కెట్లో దుమ్ము రేపుతున్న పోకో.. టాప్-3 స్థానంలో కంపెనీ స్మార్ట్ ఫోన్ బ్రాండ్లు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇటీవల కాలంలో భారత మార్కెట్లో అత్యుత్తమ స్మార్ట్ ఫోన్లు విడుదల చేస్తూ మంచి విక్రయాలు పొందుతున్న సంస్థ పోకో(Poco). తాజాగా ఈ కంపెనీ అరుదైన ఘనత సాధించింది. దేశంలో ఆన్ లైన్ లభ్యమవుతున్న స్మార్ట్ ఫోన్ బ్రాండ్లలో టాప్-3లో చోటు దక్కించుకుంది.

ఇంకా చదవండి ...

ఇటీవల కాలంలో భారత మార్కెట్లో అత్యుత్తమ స్మార్ట్ ఫోన్లు విడుదల చేస్తూ మంచి విక్రయాలు పొందుతున్న సంస్థ పోకో(Poco). తాజాగా ఈ కంపెనీ అరుదైన ఘనత సాధించింది. దేశంలో ఆన్ లైన్ లభ్యమవుతున్న స్మార్ట్ ఫోన్ బ్రాండ్లలో టాప్-3లో చోటు దక్కించుకుంది. బడ్జెట్ ధరలో అత్యుత్తమ మొబైల్ ఫోన్లు విడుదల చేస్తోన్న ఈ సంస్థ తన వృద్ధి రోజురోజుకూ పెంచేసుకుంటోంది. ఈ కంపెనీ కంటే ముందు రియల్ మీ, వన్ ప్లాస్ బ్రాండ్లు ఉన్నట్లు కౌంటర్ పార్ట్ రిసెర్చ్ ఓ నివేదికలో వెల్లడించింది. తన అనుబంధ సంస్థ అయిన షియోమీ(Xiaomi), శాంసంగ్(Samsung) కంటే వెనక ఉన్న పోకో ఏడాది నుంచి స్వతంత్ర మార్గంలో దూసుకెళ్తుంది.  అభిమానులు, వినియోగదారుల వ్యయ సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకొని 11 నెలల లోపే బడ్జెట్ ధరలో శక్తిమంతమైన లైనప్ ను ప్రవేశపెట్టామని పోకో ఇండియా డైరెక్టర్ అనూజ్ శర్మ తెలిపారు.

2020లో బడ్జెట్ విభాగంలో కీలక పాత్ర పోషించామని పేర్కొన్నారు. భారత మార్కెట్లో పోకో ఊపందుకుందని, పోకో సీ3, పోకీ ఎం3 ఈ వృద్ధికి ప్రధాన కారణాలు అని కౌంటర్ పార్ట్ రిసెర్చ్ విశేషలకు శిల్పి జైన్ తెలిపారు. క్యూ2 2020లో పోకో ఆన్ లైన్ సిగ్మెంట్ సరుకుల్లో 4వ స్థానాన్ని కైవసం చేసుకుందని, 2020 నవంబరులో 3వ స్థానానికి చేరుకుందని ఆమె తెలిపారు.

2020 ప్రారంభంలో పోకో షియోమీ నుంచి వేరు..

2018లో పోకో సిరీస్.. పోకో, పోకో ఎఫ్1 గా మార్కెట్లో ప్రవేశించి ఆనతి కాలంలోనే ఎంతో ప్రజాదరణ పొందింది. అయితే జనవరి 2020 వరకు ఇది స్వతంత్ర బ్రాండ్ కాదు. జియోమీ మేనేజింగ్ డైరెక్టర్ మను కుమార్ జైన్ మాట్లాడుతూ.. పోకో ఇప్పడు స్వతంత్రంగా పనిచేయడానికి ఇదే సరైన సమయమని, ఈ వియాన్ని ప్రకటిస్తున్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు. ఈ బ్రాండ్ 2020 జనవరి 17 స్వతంత్ర బ్రాండ్ గా ప్రకటించినప్పటికీ ఇది తన స్మార్ట్ ఫోన్ లో షియోమీకి చెందిన MIUI పోకో తన ప్రకటనలను తొలగించి డిఫాల్ట్ MIUI లాంచర్ కు బదులుగా పోకో లాంచర్ ను జోడించడం ద్వారా యూజర్ ఇంటర్ఫేస్ (UI)ను కొద్దిగా సర్దుబాటు చేసింది.

బడ్జెట్ ఫోన్ లపై ఎందుకు దృష్టి..

ఫిబ్రవరి 2020లో పోకో తన మొదటి ఫోన్ ను స్వతంత్ర బ్రాండ్ గా విడుదల చేసింది. అదే పోకో ఎక్స్2. ఇది లాంచ్ అయిన కొన్ని నెలల తర్వాత కూడా రూ.20,000 లోపు అత్యుత్తమ ఫోన్ కొనడానికి డబ్బు కోసం ఉత్తమమైన ఫోన్ ల్లో ఒకటిగా పరిగణించింది. అయితే కరోనా మహమ్మారి కారణంగా ఈ సంస్థ తన దృష్టిని బడ్జెట్ ఫోన్ లపై మరల్చింది. తర్వాతి నెలల్లో పోకో సంస్థ పోకీ సీ3, పోకీ ఎం2 ప్రో మోడళ్లను విడుదల చేసింది. సరసమైన ధరలకు,మధ్య శ్రేణి ఫీచర్లతో ఫోన్లు అందిస్తోంది. భారత్ లో కరోనా సమయంలో బడ్జెట్ కీలక పాత్ర పోషించాయి. చాలా మంది ఉపాధిని కోల్పోతున్నప్పటికీ వారి ఇళ్లకు పరిమితం అయ్యారు. బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్లు సరసమైన ప్రాప్యత, సాంకేతికత ప్రాచుర్యం పొందింది.

ఎంటర్ టైన్మెంట్ నుంచి ఈ-లెర్నింగ్ లాంటి వివిధ అంశాలతో ఈ నూతన స్మార్ట్ ఫోన్లు వినియోగదారులకు బాగా సహాయపడ్డాయి. ఈ రోజు స్మార్ట్ ఫోన్లు కమ్యూనికేషన్ కోసం మాత్రమే ఉద్దేశించే డివైజ్ కాదు. ఇంటి నుంచే వీడియోల ద్వారా నేర్చుకోవడంలో ఇది కీలక పాత్ర పోశిస్తుందని శర్మ అన్నారు. బడ్జెట్ ఆధారిత ఫోన్లు అయిన పోకో సీ3, ఎం2 అమ్మకాలు పెరుగుతున్నాయి. 2020లో అమ్ముడుపోయిన మూడు ఆన్ లైన్ పోన్లలో రెండింటికి కూడా ఇది ఉపయోగపడుతుంది. పోకో ఎం2 మోడల్ తొలి రోజే లక్షా 30 వేల యూనిట్ల విక్రయాలను అందుకుంది. పోకో ఇటీవలే ఈ వేరియంట్ల విజయాలను అందుకుంది.

త్వరలో పోకో ఎఫ్2..

2021లో బ్రాండ్ ఎక్కడ ఫోకస్ చేస్తుందో చూడాలి. తమ ఉత్పత్తలు గురించి గెట్ గో నుంచి తమకు నమ్మకం ఉందని శర్మ తెలిపారు. ఎక్కువ మంది వినియోగదారులు అభినందిస్తున్నారని ఇది ధృవీకరిస్తుంది. తమ అభిమానులు, వినియోగదారుల నుంచి నిరంతర మద్దతుతో 2021లో నూతన మైలు రాళ్లు సృష్టించే దిశగా కృషి చేస్తున్నామని ఆయన అన్నారు. ఇటీవలే ఈ సంస్థ 2021 ప్రణాళికల గురించి ఓ టీజర్ ను లాంచ్ చేసింది. వీడియో చివర్లో పోకో ఎఫ్2 గురించి చాలాసార్లు ప్రస్తావించింది. ఎంతో ఆసక్తిగా ఎదురచూస్తున్న పోకో ఎఫ్1 తర్వాతి మోడల్ ను బహుశా 2021లో చూడవచ్చు.

Published by:Nikhil Kumar S
First published:

Tags: POCO, POCO India, Poco X2

ఉత్తమ కథలు