గతేడాది ఇండియాలో రిలీజ్ చేసిన పోకో ఎక్స్3 స్మార్ట్‌ఫోన్ ధర తగ్గించింది పోకో ఇండియా. పోకో ఎక్స్3 అప్‌గ్రేడ్ వేరియంట్ పోకో ఎక్స్3 ప్రో లేటెస్ట్‌గా లాంఛ్ అయిన సంగతి తెలిసిందే. దీంతో పోకో ఎక్స్3 ధరను భారీగా తగ్గించింది పోకో ఇండియా. ఏకంగా రూ.2,000 ధర తగ్గించింది. రిలీజ్ అయినప్పుడు పోకో ఎక్స్3 స్మార్ట్‌ఫోన్ 6జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.16,999 కాగా, 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.18,499. ఇక హైఎండ్ వేరియంట్ 8జీబీ+128జీబీ ధర రూ.19,999. ఈ వేరియంట్ల ధర రూ.2,000 తగ్గింది. అంటే పోకో ఎక్స్3 స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.14,999 మాత్రమే. ఒకప్పుడు రూ.20,000 లోపు సెగ్మెంట్‌లో ఉన్న పోకో ఎక్స్3 ఇప్పుడు రూ.15,000 లోపు సెగ్మెంట్‌లోకి వచ్చేసింది. కొత్త ధరలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి.
పోకో ఎక్స్3 స్మార్ట్‌ఫోన్ విషయానికి వస్తే ఇందులో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 732జీ ప్రాసెసర్, 6000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి విశేషాలు ఉన్నాయి. రియల్‌మీ 7, రెడ్‌మీ నోట్ 10 ప్రో లాంటి మోడల్స్‌కి పోటీ ఇవ్వనుంది పోకో ఎక్స్3.
WhatsApp: వాట్సప్‌లో ఈ సెట్టింగ్ చాలా ముఖ్యం... వెంటనే మార్చేయండి
Oppo A54: ఒప్పో ఏ54 స్మార్ట్‌ఫోన్ రిలీజ్... భారీ బ్యాటరీతో పాటు మరెన్నో ప్రత్యేకతలు
Price drop alert! If you're still looking for a reason to get your hands on #POCOX3, this is it?
Get #POCOX3 at just R̶s̶.̶1̶6̶,̶9̶9̶9̶ Rs.14,999 starting this April 1st ? pic.twitter.com/20vSNT5KSZ — POCO - Madder By the Minute (@IndiaPOCO) March 30, 2021
పోకో ఎక్స్3 స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 6.67 అంగుళాల పుల్ హెచ్‌డీ+ ఫుల్ స్క్రీన్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్
ర్యామ్: 6జీబీ, 8జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ, 128జీబీ
ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 732జీ
రియర్ కెమెరా: 64 మెగాపిక్సెల్ Sony IMX 682 సెన్సార్ + 13 (అల్ట్రావైడ్)+2 (మ్యాక్రో)+2 (డెప్త్)
ఫ్రంట్ కెమెరా: 20 మెగాపిక్సెల్
బ్యాటరీ: 6000ఎంఏహెచ్ (33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్)
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10 + ఎంఐయూఐ 12
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
కలర్స్: షాడో గ్రే, కోబాల్ట్ బ్లూ
ధర:
6జీబీ+64జీబీ- రూ.14,999
6జీబీ+128జీబీ- రూ.16,499
8జీబీ+128జీబీ- రూ.17,999
Poco X3 Pro: అదిరిపోయే ఫీచర్స్‌తో పోకో ఎక్స్3 ప్రో వచ్చేసింది... ధర ఎంతంటే
Poco M3: నిమిషానికి 8 ఫోన్లు అమ్మిన పోకో ఇండియా... ఈ ఫోన్ ఎందుకంత స్పెషల్?
ఇక లేటెస్ట్‌గా రిలీజ్ అయిన పోకో ఎక్స్3 ప్రో విశేషాలు చూస్తే 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ 120Hz డిస్‌ప్లే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 860 ప్రాసెర్, 48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6 లాంటి ప్రత్యేకతలున్నాయి. ప్రారంభ ధర రూ.18,999. పోకో ఎక్స్3 ప్రో సేల్ ఏప్రిల్ 6 మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభమవుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.