పోకో ఇండియా ఇటీవల పోకో ఎక్స్3 ప్రో స్మార్ట్‌ఫోన్ లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ స్మార్ట్‌ఫోన్‌పై అదిరిపోయే ఎక్స్ఛేంజ్ ఆఫర్ ప్రకటించింది. పోకో బ్రాండ్‌తో ఇండియాలో మొదటిసారిగా పోకో ఎఫ్1 రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. షావోమీ సబ్‌బ్రాండ్‌గా ఈ స్మార్ట్‌ఫోన్ పరిచయమైంది. అప్పట్లో పోకో ఎఫ్1 ఓ సంచలనం. చాలారోజుల పాటు హాట్ ఫేవరెట్‌గా పోకో ఎఫ్1 నిలిచింది. ఆ తర్వాత పోకో ఎఫ్2 కోసం ఎదురుచూస్తున్నా ఇంకా అప్‌గ్రేడ్ వర్షన్ రాలేదు. అయితే పోకో ఎఫ్1 స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసి పోకో ఎక్స్3 ప్రో మోడల్‌కు అప్‌గ్రేడ్ అయ్యేందుకు ఓ ఆఫర్ ప్రకటించింది పోకో ఇండియా. అప్‌గ్రేడ్ ప్రోగ్రామ్‌లో భాగంగా రూ.18,999 విలువైన పోకో ఎక్స్3 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను రూ.10,999 ధరకే అందిస్తోంది. అంటే రూ.8,000 తగ్గుతోంది. ఇది 6జీబీ+128జీబీ వేరియంట్ ధర. ఒకవేళ 8జీబీ+128జీబీ వేరియంట్ తీసుకున్నారూ.8,000 తగ్గుతుంది. ఇందులో రూ.7,000 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ కాగా, రూ.1,000 బ్యాంక్ ఆఫర్.
The truest and the most powerful upgrade for your legendary POCO F1😈
Check the images 👇🏼for deets. pic.twitter.com/L89Ke4uobO
— POCO - Madder By the Minute (@IndiaPOCO) April 1, 2021
అంటే పోకో ఎఫ్1 ఎక్స్ఛేంజ్ చేస్తే పోకో ఎక్స్3 ప్రో 6జీబీ+128జీబీ వేరియంట్ రూ.10,999 ధరకు, 8జీబీ+128జీబీ వేరియంట్ రూ.12,999 ధరకు లభిస్తుంది. అసలు ధరలు చూస్తే పోకో ఎక్స్3 ప్రో 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.18,999 కాగా 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.20,999. ఈ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కేవలం పోకో ఎఫ్1 స్మార్ట్‌ఫోన్ వాడుతున్నవారికి మాత్రమే. మిగతా స్మార్ట్ఫోన్లపై ఎక్స్ఛేంజ్ ఉందా లేదా అన్న విషయం సేల్ మొదలయ్యాక తెలుస్తుంది. ఏప్రిల్ 6న మధ్యాహ్నం 12 గంటలకు సేల్ మొదలవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ కొనేవారికి ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.
ఇక పోకో ఎక్స్3 ప్రో డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ+ 120Hz డిస్ప్లే ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 860 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. వెనుక వైపు 48 మెగాపిక్సెల్ Sony IMX582 సెన్సార్ + 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ క్వాడ్ కెమెరా సెటప్ ఉండగా ముందువైపు సెల్ఫీల కోసం 20 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. 5160ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఛార్జర్ బాక్సులోనే వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 11 + ఎంఐయూఐ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. గోల్డెన్ బ్రాంజ్, గ్రాఫైడ్ బ్లాక్, స్టీల్ బ్లూ కలర్స్‌లో కొనొచ్చు.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.