హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Poco M3: ఫిబ్రవరి 19న పోకో హెలో ఎల్లో సేల్... ప్రత్యేకత ఏంటంటే

Poco M3: ఫిబ్రవరి 19న పోకో హెలో ఎల్లో సేల్... ప్రత్యేకత ఏంటంటే

Poco Hello Yellow Sale | పోకో ఫ్యాన్స్‌కు శుభవార్త. ఫిబ్రవరి 19న హెలో ఎల్లో సేల్ నిర్వహించబోతోంది పోకో ఇండియా. ప్రత్యేకతలు ఏంటో తెలుసుకోండి.

Poco Hello Yellow Sale | పోకో ఫ్యాన్స్‌కు శుభవార్త. ఫిబ్రవరి 19న హెలో ఎల్లో సేల్ నిర్వహించబోతోంది పోకో ఇండియా. ప్రత్యేకతలు ఏంటో తెలుసుకోండి.

Poco Hello Yellow Sale | పోకో ఫ్యాన్స్‌కు శుభవార్త. ఫిబ్రవరి 19న హెలో ఎల్లో సేల్ నిర్వహించబోతోంది పోకో ఇండియా. ప్రత్యేకతలు ఏంటో తెలుసుకోండి.

  ఇటీవల ఇండియాలో పోకో ఎం3 స్మార్ట్‌ఫోన్‌ను లాంఛ్ చేసింది పోకో ఇండియా. పోకో ఎం2 స్మార్ట్‌ఫోన్‌ పాపులర్ అయినట్టే పోకో ఎం3 స్మార్ట్‌ఫోన్‌కు మంచి డిమాండ్ లభించింది. మొదటి సేల్‌లో ఏకంగా 1,50,000 యూనిట్స్ అమ్ముడుపోయాయి. ఈ సక్సెస్‌ను సెలబ్రేట్ చేసేందుకు పోకో ఇండియా 'హెలో ఎల్లో' సేల్ ప్రకటించింది. మొదటి సేల్‌లో ఎల్లో కలర్‌కు ఎక్కువ డిమాండ్ కనిపించింది. దీంతో Hello Yellow సేల్ నిర్వహిస్తోంది పోకో ఇండియా. ఫిబ్రవరి 19న మధ్యాహ్నం 12 గంటలకు ఈ సేల్ ప్రారంభం కానుంది. ఈ సేల్‌లో కేవలం ఎల్లో కలర్ పోకో ఎం3 మోడల్స్ మాత్రమే లభిస్తాయి. పోకో ఎం3 స్మార్ట్‌ఫోన్ లెదర్ లాంటి టెక్చర్డ్ డిజైన్‌తో ఎల్లో, బ్లూ, బ్లాక్ కలర్స్‌లో రిలీజ్ అయినా ఎల్లో కలర్ కొనేందుకే ఎక్కువమంది ఆసక్తి చూపించారు. అందుకే ఎల్లో కలర్ యూనిట్స్ ప్రత్యేకంగా అమ్మేందుకు ఈ సేల్ నిర్వహిస్తోంది పోకో ఇండియా. డిమాండ్‌కు తగ్గట్టుగా ఎల్లో కలర్ మోడల్స్‌ తయారీని పెంచింది.

  WhatsApp Calls: వాట్సప్ కాల్స్ రికార్డ్ చేయాలా? ఈ ట్రిక్ ఫాలో అవండి

  Redmi Note 10: రెడ్‌మీ నోట్ 10 స్మార్ట్‌ఫోన్లు వచ్చేస్తున్నాయి... ఎప్పుడో తెలుసా

  ఇక పోకో ఎం3 స్మార్ట్‌ఫోన్ విశేషాలు చూస్తే ఇండియన్ మార్కెట్‌లో బాగా పాపులర్ అయిన పోకో ఎం2 అప్‌గ్రేడ్ వర్షన్ పోకో ఎం3 స్మార్ట్‌ఫోన్. పోకో ఎం3 స్మార్ట్‌ఫోన్‌లో 6.53 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్ + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌తో ట్రిపుల్ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా సెటప్ ఉన్నాయి. కెమెరాలో డాక్యుమెంట్ మోడ్, నైట్ మోడ్, ఏఐ సీన్ డిటెక్షన్, గూగుల్ లెన్స్, ఏఐ బ్యూటిఫై, పోర్ట్‌రైట్ మోడ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. పోకో ఎం3 స్మార్ట్‌ఫోన్‌లో 6,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉండటం విశేషం. 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. పోకో ఎం3 స్మార్ట్‌ఫోన్‌ ధరల వివరాలు చూస్తే 6జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.10,999 కాగా 6జీబీ+128జీబీ వేరియంట్‌ ధర రూ.11,999.

  First published:

  Tags: 5G Smartphone, Mobile, Mobile News, Mobiles, POCO, POCO India, Smartphone, Smartphones

  ఉత్తమ కథలు