Poco F4 GT | పోకో కంపెనీ నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్ ఇండియన్ మార్కెట్లో సందడి చేయనుంది. పోకో ఎఫ్ 4 జీటీ (Poco F4 GT) పేరుతో రానున్న కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ తేదీని కంపెనీ ఫిక్స్ చేసింది.
పోకో కంపెనీ నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్ ఇండియన్ మార్కెట్లో సందడి చేయనుంది. పోకో ఎఫ్ 4 జీటీ (Poco F4 GT) పేరుతో రానున్న కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ తేదీని కంపెనీ ఫిక్స్ చేసింది. ఏప్రిల్ 26న దీన్ని ఇండియాతో పాటు గ్లోబల్ మార్కెట్లో లాంచ్ చేయనున్నారు. కొత్త Poco F సిరీస్ డివైజ్‌లు.. టాప్-ఎండ్ స్నాప్‌డ్రాగన్ చిప్సెట్తో రానున్నాయి. ఈ సిరీస్ ఫోన్లు 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
పోకో F4 GT ఫోన్.. రెడ్మీ K50G గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌కు రీబ్యాడ్జ్డ్ వెర్షన్ అని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. పోకో నుంచి వచ్చిన F3 GT వేరియంట్ కూడా రెడ్మీ K40 మోడల్‌కు రీబ్యాడ్జ్ వెర్షన్‌గా వచ్చింది. ఒకవేళ నివేదికల సమాచారం నిజమే అయితే.. Poco F4 GT మోడల్ పవర్-ప్యాక్డ్ డివైజ్‌గా ఉంటుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ గురించి మరిన్ని వివరాలను కంపెనీ లాంచ్ డేట్ రోజునే ప్రకటించే అవకాశం ఉంది.
పోకో F4 GT ధర (అంచనా)
Poco F4 GT ధరలు Redmi K50G మోడల్ ధరకు దగ్గరగా ఉండవచ్చు. చైనాలో రెడ్మీ K50G మోడల్.. RMB 3,299 (సుమారు రూ. 39,600) వద్ద లాంచ్ అయింది. పోకో F4 GT ధర కూడా దాదాపు ఇదే లైనప్‌లో ఉండవచ్చు. అయితే ఇండియాలో ఈ ఫోన్ Edge 30 Pro లేదా Realme GT 2 Pro మోడళ్లతో పోటీ పడనుంది. దీంతో కొత్త ఫోన్ ధర కూడా ఇదే రేంజ్లో ఉండవచ్చని మరికొందరు భావిస్తున్నారు.
స్పెసిఫికేషన్లు
పోకో F4 GT ఫోన్.. ఫ్లాగ్షిప్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 చిప్సెట్తో పనిచేయనుంది. ఇది 12GB వరకు RAM, 256GB స్టోరేజీతో రానుంది. UFS 3.1 టెక్నాలజీ కారణంగా ర్యామ్, స్టోరేజ్‌ను విస్తరించుకునే అవకాశం ఉండకపోవచ్చు. ఆండ్రాయిడ్ 12- బేస్డ్ MIUI 13 వెర్షన్‌తో వచ్చిన మొదటి స్మార్ట్ఫోన్లలో ఇది ఒకటి కావచ్చు.
పోకో F4 GT 64-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ సెన్సార్, 2-మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఈ ఫోన్ ఫుల్ HD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో 6.67-అంగుళాల AMOLED డిస్ప్లేను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఫోన్లో 4,700mAh బ్యాటరీ ఉంటుంది. ఇది Xiaomi 11i హైపర్‌ఛార్జ్, Xiaomi 11T ప్రో వంటి 120W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.