Poco F3 GT: పోకో ఎఫ్3 జీటీ రిలీజ్... వీడియో గేమ్ లవర్స్ కోసం ప్రత్యేకమైన ఫీచర్స్

Poco F3 GT: పోకో ఎఫ్3 జీటీ రిలీజ్... వీడియో గేమ్ లవర్స్ కోసం ప్రత్యేకమైన ఫీచర్స్ (image: Poco India)

Poco F3 GT | గేమింగ్ లవర్స్ కోసం పోకో ఇండియా పోకో ఎఫ్3 జీటీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసింది. వీడియో గేమ్స్ ఆడేవారి కోసం ఈ స్మార్ట్‌ఫోన్‌లో ప్రత్యేకమైన ఫీచర్స్ ఉన్నాయి.

  • Share this:
    ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి మరో మోడల్‌ను లాంఛ్ చేసింది పోకో ఇండియా. వీడియో గేమ్స్ ఎక్కువగా ఆడేవారిని దృష్టిలో పెట్టుకొని రూపొందించిన పోకో ఎఫ్3 జీటీ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్ కొత్తగా ఉన్నాయి. గేమ్స్ ఆడేవారి కోసం మాగ్లేవ్ ట్రిగ్గర్స్, జీటీ స్విచెస్ ఉండటం విశేషం. బటన్స్ బయటికి ఉంటాయి కాబట్టి గేమ్స్ ఆడేప్పుడు వెంటనే స్పందించడానికి ఉపయోగపడతాయి. ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఎయిర్‌క్రాఫ్ట్ గ్రేడ్ అల్యూమినియంతో తయారు చేయడం విశేషం. పోకో ఎఫ్3 జీటీ 5జీ స్మార్ట్‌ఫోన్. ఈ మొబైల్‌లో 6.67 అంగుళాల టర్బో అమొలెడ్ డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 1200 ప్రాసెసర్, 5065ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ప్రత్యేకతలు ఉన్నాయి.

    పోకో ఎఫ్3 జీటీ సేల్ జూలై 26 మధ్యాహ్నం 12 గంటలకు మొదలవుతుంది. ఫ్లిప్‌కార్ట్‌లో కొనొచ్చు. జూలై 24 మధ్యాహ్నం 12 గంటలకు ప్రీ-ఆర్డర్ సేల్ మొదలవుతుంది. పోకో ఎఫ్3 జీటీ స్మార్ట్‌ఫోన్ మూడు వేరియంట్లలో రిలీజ్ అయింది. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.26,999 కాగా, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.28,999. హైఎండ్ వేరియంట్ 8జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.30,999. జూలై 26 నుంచి ఆగస్ట్ 2 వరకు రూ.1,000 డిస్కౌంట్ పొందొచ్చు. ఆ తర్వాత రెండో వారంలో అంటే ఆగస్ట్ 2 అర్ధరాత్రి 12 గంటల నుంచి ఆగస్ట్ 9 వరకు రూ.500 డిస్కౌంట్ మాత్రమే లభిస్తుంది. ఆగస్ట్ 9 అర్ధరాత్రి నుంచి ఒరిజినల్ ధరకే ఈ స్మార్ట్‌ఫోన్ లభిస్తుంది.

    OnePlus Nord 2: అదిరిపోయే ఫీచర్స్‌తో వన్‌ప్లస్ నార్డ్ 2 వచ్చేసింది... ధర ఎంతంటే

    BSNL: బీఎస్​ఎన్​ఎల్ కస్టమర్లకు​ బంపరాఫర్​... ఆ ప్లాన్​పై అదనపు బెనిఫిట్స్


    పోకో ఎఫ్3 జీటీ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్ చూస్తే 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల టర్బో అమొలెడ్ డిస్‌ప్లే ఉంది. డాల్బీ అట్మాస్ సౌండ్‌తో డ్యూయెల్ స్పీకర్స్ ఉండటం విశేషం. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 1200 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌ + 8 మెగాపిక్సెల్ అల్‌ట్రా వైడ్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. పోకో ఎఫ్3 జీటీ స్మార్ట్‌ఫోన్‌లో 5065ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 67వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఎల్ షేప్‌లో ఛార్జింగ్ కేబుల్ ఉండటం విశేషం. 15 నిమిషాలు ఛార్జింగ్ చేస్తే ఒక రోజు ఈ స్మార్ట్‌ఫోన్ వాడుకోవచ్చని కంపెనీ చెబుతోంది. పోకో ఎఫ్3 జీటీ స్మార్ట్‌ఫోన్‌ను ప్రిడేటర్ బ్లాక్, గన్‌మెటల్ సిల్వర్ కలర్స్‌లో కొనొచ్చు.

    Airtel Plans: కొత్త ప్లాన్స్ ప్రకటించిన ఎయిర్‌టెల్... బెనిఫిట్స్ ఇవే

    Samsung Galaxy M21 2021: సాంసంగ్ గెలాక్సీ ఎం21 కొత్త మోడల్ వచ్చేసింది... ధర ఎంతంటే

    పోకో ఎఫ్ సిరీస్‌లో వచ్చిన రెండో స్మార్ట్‌ఫోన్ ఇది. మూడేళ్ల క్రితం పోకో ఎఫ్1 లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్స్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ కావడం ఓ సంచలనం. చైనాలో ఈ ఏడాది రిలీజ్ అయిన రెడ్‌మీ కే40 గేమింగ్ ఎడిషన్ రీబ్రాండెడ్ వర్షనే పోకో ఎఫ్3 జీటీ స్మార్ట్‌ఫోన్. పోకో ఎఫ్3 జీటీ స్మార్ట్‌ఫోన్ గురువారం ఇండియాలో లాంఛ్ అయిన వన్‌ప్లస్ నార్డ్ 2 మోడల్‌కు గట్టి పోటీ ఇస్తుందని అంచనా.
    Published by:Santhosh Kumar S
    First published: